కాంచన నటికి లైంగిక వేధింపులు | Sexual Harassments on Kanchana Movie Actress | Sakshi
Sakshi News home page

రష్యన్‌ నటికి లైంగిక వేధింపులు

Published Thu, Apr 25 2019 10:53 AM | Last Updated on Thu, Apr 25 2019 1:55 PM

Sexual Harassments on Kanchana Movie Actress - Sakshi

అరెస్టయిన రుబేశ్‌కుమార్‌

చెన్నై, పెరంబూరు: రష్యన్‌ నటిని వేధింపులకు గురి చేసిన నటుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి 10 ఏళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. స్థానిక ఎంఆర్‌సీ నగర్‌లో నివసిస్తూ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల లారెన్స్‌ నటించి, తెరకెక్కించిన కాంచన 3 చిత్రంలో నటించారు. బుధవారం ఆమె తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆమెతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రుబేశ్‌కుమార్‌ అనే 26 ఏళ్ల యువకుడు తనకు పరిచయం అయ్యాడని పేర్కొంది.

అతను తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలు భంగి మల్లో ఫొటోలు తీశాడని తెలిపింది. అనంతరం ఆ ఫొటోలను తన వాట్సాప్‌కు పంపాడనీ, ఆ తరువాత తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, లేని పక్షంలో ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపింది. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ దురై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రుబేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు మాధవరం, పొన్నియమ్మన్‌మేడు ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. అవకాశాల పేరుతో ఫొటోలు తీస్తానని వచ్చే వారితో జాగరూకత వహించాలని పోలీసులు హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement