రేప్ చేసి స్వేచ్ఛగా.. | Goa Russian rape: Accused still at large, consulate not informed | Sakshi
Sakshi News home page

రేప్ చేసి స్వేచ్ఛగా..

Published Tue, May 3 2016 8:46 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

రేప్ చేసి స్వేచ్ఛగా.. - Sakshi

రేప్ చేసి స్వేచ్ఛగా..

పనాజీ: గోవాలో 25ఏళ్ల రష్యా పర్యాటకురాలిపై లైంగిక దాడి కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. రేప్ చేసిన వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు అతడిని పోలీసులు అరెస్టు చేయడంగానీ, కనీసం రష్యన్ కాన్సులేట్కు ఆ సమాచారం అందించడంగానీ చేయలేదు. బాధితురాలిపై లైంగిక దాడి జరిగి ఐదురోజులు పూర్తి కావస్తున్నా కేసు ముందడుగు వేయకపోవడంతో మొత్తం దేశ న్యాయవ్యవస్థకే కలంకం తెచ్చేలాగా ఉంది. బాధితురాలి పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం గత నెల 28న గోవాలోని మోర్జిమ్ అనే బీచ్ కు రష్యా పర్యాటకురాలు వచ్చింది.

అక్కడే ఉన్న బీచ్ రిసార్ట్ లో అద్దెకు దిగింది. ఆరోజు రాత్రి ఆ రిసార్ట్ ఓనర్ తన మాస్టర్ కీని ఉపయోగించి ఆమె గదిలోకి ప్రవేశించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలు పోలీసులకు చెప్తుండగానే మీడియాకు కూడా తెలిసిందే. అయితే, దీనిపై అప్పుడే రాద్ధాంతం చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు సూచించారు. అయితే, వారు కనీసం ఈ విషయాన్ని గోవాలోని రష్యాకు చెందిన అధికారులకు గానీ, ముంబయిలోని కాన్సులేట్కు గానీ తెలియజేయలేదు.

ఈ విషయం స్వయంగా ఆ కాన్సులేట్ అధికారులే తెలిపారు. 'మా దేశ యువతిపై రేప్ జరిగిందని మాకు ఏ పోలీసులు అసలు చెప్పలేదు. కేవలం మీడియా ద్వారానే ఈ విషయం తెలిసింది. ఇది చాలా దురదృష్టకరం. బాధితురాలి నుంచి గానీ, గోవా పోలీసుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందలేదు. తమకు ఆ సమాచారం అందితే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాము' అని రష్యా కాన్సులేట్ అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement