
రాఘవా లారెన్స్
‘ముని’ ఫ్రాంచైజీలో వచ్చిన హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘కాంచన 3’ రెడీ అవుతోంది. రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్ దుహన్ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తెలుగులో లైట్‌హౌస్ మూవీమేకర్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం డాల్బీ అట్మాస్ సౌండ్‌ని వినియోగించారు టీమ్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భాగా బి. మధు మాట్లాడుతూ– ‘‘రాఘవా లారెన్స్ స్వయంగా అందించిన హారర్ సినిమాలన్నీ సూపర్ హిట్లే. అందులో ‘ముని’ సీక్వెల్ చాలా స్పెషల్. ‘ముని’ సిరీస్‌లో ఇది నాలుగో చిత్రం. కాంచన పేరుతో స్టార్ట్ అయిన తర్వాత ఇది కాంచన–3. ఆయన ప్రతి చిత్రంలో తన గెటప్‌ని సామాన్య ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా చూసుకుంటారు. గత మూడు చిత్రాలకు మించి ‘కాంచన 3’ ఉండబోతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment