kovai sarala
-
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
తెలుగు వెండితెరపై టాప్ లేడీ కమెడియన్ ఎవరయా? అంటే అందరూ ముక్తకంఠంతో కోవై సరళ అని టక్కున సమాధానమిస్తారు. ఈ మలయాళ నటి హీరోయిన్గా, సహాయ నటిగా, కమెడియన్‌గా అలరించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్ చేస్తూ కామెడీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.అలా మొదలైంది'మూడుముళ్లు సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు మా ఇంటి పక్కన ఉండేవారు. ఒకరోజు ఇంటి దగ్గర షూటింగ్ జరగ్గా అందులో నాకు అవకాశమిచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్టయింది. అలా నా జర్నీ మొదలైంది. దాదాపు 15 చిత్రాల్లో హీరోయిన్గా చేశాను. 900కు పైగా సినిమాల్లో నటించాను. కోలీవుడ్ నా పుట్టినిల్లయితే టాలీవుడ్ నా మెట్టినిల్లు.పెళ్లెందుకు చేసుకోలేదు?స్వేచ్చ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. కచ్చితంగా వివాహం చేసుకోవాలని రూలేమీ లేదు కదా.. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే అన్ని బంధాలు ఏర్పడుతాయి. ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని చూసేందుకు ఒకరుండాలని ఎదురుచూడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలంతే!తెలుగులో బిజీసతీ లీలావతి సినిమా కోసం కమల్ హాసన్ పక్కన హీరోయిన్గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత కమల్ ఫోన్ చేసి నా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే తెలుగులో బిజీగా ఉన్నానని చెప్తే నాకోసం ఐదు నెలలు వెయిట్ చేశారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది.ఆరోగ్యం బాగోలేదని రూమర్స్ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదని, ఖర్చులకు డబ్బుల్లేక దీన స్థితిలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. మా అక్కవాళ్లందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని కూడా రాసేశారు. కానీ అలాంటివేమీ జరగలేదు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు' అని కోవై సరళ చెప్పుకొచ్చింది.చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. హీరోయిన్‌కు ఊహించని ప్రశ్న! -
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.చాలా కాలం తర్వాత ఈ సీనియర్ నటి బాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్ కమెడిన్ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడు. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్ కొడుతూ సందడి చేయాలి. నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్ అయింది. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!
సీనియర్ నటి కోవై సరళ మీకు గుర్తుందా? ఆమె పేరు వినగానే కామెడీ వెంటనే గుర్తుకొచ్చేస్తోందా? కోవై సరళ- బ్రహ్మానందం జోడీ చేసే కామెడీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెదలుతూనే ఉంటాయి. టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు.ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు. చివరిసారిగా 2022లో వచ్చిన సెంబి చిత్రంలో కోవై సరళ నటించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్ సిరీస్ అరణ్మనై పార్ట్-4 త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్ పేరుతో తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు కోవై సరళ కూజా హాజరయ్యారు. సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేశారు. సినీ ప్రియులు గుర్తు పట్టలేని విధంగా ఆమె మారిపోయారు. కాగా.. ఈ చిత్రం మే3న థియేటర్లలో సందడి చేయనుంది. -
హోటల్ బయట ఏడ్చిన కోవై సరళ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!
కోవై సరళ.. చాలామందికి ఈ పేరు వినగానే పెదాలపై చిన్నటి చిరునవ్వు వస్తుంది. బ్రహ్మానందంతో జత కట్టి ఈమె పండించిన కామెడీకైతే పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే! తమిళంలో వడివేలుకు జంటగా నటించి అక్కడా నవ్వుల రసాన్ని పంచింది. ఉత్తమ హాస్యనటిగా రెండు నందులు సహా అనేక అవార్డులు అందుకుంది. రాష్ట్రస్థాయిలోనూ బోలెడన్ని పురస్కారాలు అందుకున్న ఈ నటి తన జీవితంలో మాత్రం తోడు కావాలనుకోలేదు. అసలు తన సినీప్రస్థానం ఎలా మొదలైంది? ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిందో చూద్దాం.. ఆయన ప్రశ్నలకు వణికిపోయిన కోవై సరళ ఆరో తరగతి చదువుతున్నప్పుడు కోవై సరళ తన అభిమాన నటుడు ఎమ్జీఆర్ను చూసేందుకు కోయంబత్తూరులోని హోటల్ బయట నిలుచుంది. స్కూల్ డ్రెస్‌లో రెండు జళ్లు వేసుకుని ఉన్న ఆమె ఎమ్జీఆర్ను చూడలేకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్జీఆర్ ఆమెను ఇంటికి పిలిచి మరీ తన గురించి ఆరా తీశాడు. ఏ స్కూలులో చదువుతున్నావని అడిగాడు. కొంత సంతోషం, మరికొంత భయంతోనే అన్నింటికీ సమాధానాలు ఇచ్చుకుంటూ పోయింది. తన మీద పాఠశాలలో ఫిర్యాదు చేస్తాడేమోనని వణికిపోయింది సరళ. కానీ సరిగ్గా నెల రోజులకు సరళ చదువుతున్న పాఠశాలకు ఆమె స్కూల్ ఫీజు పంపించాడు ఎమ్జీఆర్. పదో తరగతికే గర్భిణీగా అప్పటినుంచి అతడిని మరింత ఆరాధించింది. తనలాగే వెండితెరపైనా కనిపించాలనుకుంది. అనుకున్నది సాధించింది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే వెళ్లి రత్తం(1979) చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. పదో తరగతికే గర్భిణీగా నటించింది. రెండో సినిమా ముందనై ముడిచ్చులో గర్భిణీ స్త్రీగా యాక్ట్ చేసింది. అంత చిన్న వయసులో గర్భిణీగా నటించే సాహసం చేసిందంటే తన అంకితభావం ఎటువంటిదో అర్థమవుతోంది. తనకు వచ్చిన అవకాశాలనల్లా కాదనకుండా చేసుకుంటూ పోయింది. పాత్రలకు ప్రాణం పోసింది.. తన కామెడీతో సినిమాలను విజయపథం వైపు నడిపించింది. ఎన్నో వందల సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ బుల్లితెరపై టీవీ యాంకర్‌గా, జడ్జిగానూ వ్యవహరిస్తోంది. 61 ఏళ్లొచ్చినా ఒంటరిగానే.. పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, అఖండ విజయాలు కైవసం చేసుకున్న కోవై సరళ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 61 సంవత్సరాలు. తన కుటుంబంలో కోవై సరళనే పెద్ద.. తన తర్వాత నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. తను సంపాదించిందంతా కుటుంబానికే ఖర్చుపెట్టేది. ఏనాడూ స్వార్థంగా ఆలోచించేది కాదు. చెల్లెళ్లకు దగ్గరుండి పెళ్లి చేసిన ఈ హాస్యనటి వారికి పుట్టిన పిల్లల బాధ్యతను సైతం తన భుజాన వేసుకుంది. తన సొంత ఖర్చులతో వారిని చదివించింది. మనవరాళ్లను కూడా చూసుకుంటోంది. వారి కోసం జీవితాన్నే త్యాగం మరోవైపు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంది. తన చెల్లెళ్ల కోసం అనునిత్యం ఆలోచింది తన జీవితాన్నే త్యాగం చేసింది. తను కూడా ఇల్లాలిగా మారాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రస్తుతం కోవై సరళ వారి పిల్లలకు, మనవరాళ్లకు తన ప్రేమను పంచుతోంది. ఒంటరిగా ఉండటం కూడా ఈ హాస్యనటికి ఇష్టం. అందుకే ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా మిగిలిపోయిందనీ అంటుంటారు! చదవండి: డబుల్ మీనింగ్ డైలాగ్స్.. కోరుకునేది ఒక్కటేనంటున్న గురు హీరోయిన్ -
నవ్వుకు బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కామెడీకి మించిన ఎంటర్టైన్మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్‌కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు. నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్‌గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు. భయపెట్టిన సునీల్ భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్‌గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్‌ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్‌లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ‘సీరియస్’ నరేశ్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది. నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు. కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ టాలీవుడ్లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్‌లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్యం రాజేశ్ నట విశ్వరూపం ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్‌తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్‌లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బలగం వేణు జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్‌గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు. -
ఓటీటీలో కోవై సరళ చిత్రం, ఎప్పుడు? ఎక్కడంటే?
లేడీ కమెడియన్, సీనియర్ నటి కోవై సరళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంబి. తంబిరామయ్య, అశ్విన్ కుమార్, బేబి నీలా, నాంజిల్ సంపత్, ఆండ్రూస్, పళ కరుప్పయ్య, ఆకాశ్, భారతీ కన్నన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 30న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హాట్‌స్టార్ అధికారిక ప్రకటన చేసింది. కథేంటంటే.. అటవీ ప్రాంతంలో మనవరాలితో ఒంటరిగా జీవిస్తున్న భామ(కోవై సరళ) తేనె అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె మనవరాలిపై ఓ రాజకీయ నాయకుడి కొడుకు, తన స్నేహితులతో కలిసి సామూహిత అత్యాచారం చేస్తాడు. దీంతో ఆ బామ్మ తన మనవరాలికి న్యాయం కోసం పోరాడుతూ అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. இயற்கை! A Prabhu solomon's Touch Get ready to watch #Sembi #SembiOnHotstar #SembiFromFeb3 #Disneyplushotstar @APIfilms @tridentartsoffl @arentertainoffl @prabu_solomon #KovaiSarala @i_amak #ThambiRamaiah @nivaskprasanna @saregamasouth pic.twitter.com/hGaQvcD5Mu — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) January 28, 2023 చదవండి: పిల్లగాలి అల్లరి అంటూ తండ్రి పాటకు స్టెప్పులేసిన సితార -
కోవై సరళ ప్రతీకారం!
తమిళసినిమా: సీనియర్ నటి కోవై సరళను ఇప్పటి వరకు వినోదానికి రునామా అనే అందరూ అనుకుంటారు. అత్యధిక చిత్రాల్లో ఆమె అలాంటి పాత్రలే చేశారు కూడా. అలాంటి నటిని దర్శకుడు ప్రభు సాల్మన్ పూర్తిగా వేరే కోణంలో తెరపై ఆవిష్కరించారు. ఆ చిత్రం పేరు సెంబీ. ఇందులో కోవై సరళ ప్రధాన పాత్రను పోషించగా, తంబిరామయ్య, అశ్విన్‌కుమార్, బేబి నిలా, నాంజిల్ సంపత్, పళ కరుప్పయ్య, ఆకాష్ జ్ఞానసంబంధం, ఆండ్రూస్, భారతీ కన్నన్ ముఖ్యపాత్ర పోషించారు. ఆర్ రవీంద్రన్ టాలెంట్ ఆర్ట్స్ ఆర్.రవీంద్రన్, ఏఆర్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేతలు అజ్మల్‌ఖాన్, రియా కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ప్రభు సాల్మన్ నిర్వహించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ చిత్ర విడుదల హక్కును పొందింది. దర్శకుడు ప్రభు సాల్మన్ ఇంతకుముందు రూపొందించిన మైనా, కుంకీ చిత్రాలు తరహాలోనే ఈ సెంబి చిత్రాన్ని కూడా వైవిధ్య భరితంగా తెరకెక్కించారు. ఒక అటవీ ప్రాంతంలో మనవరాలితో ఒంటరిగా జీవిస్తున్న బామ్మ (నటి కోవై సరళ) ఆ ప్రాంతంలో పక్షుల గుడ్లను, తేనెను అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె మనవరాలిపై ఒక రాజకీయ నాయకుడి కొడుకు గ్యాంగ్ రేప్ చేస్తాడు. దీంతో ఆ బామ్మ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తుంది. కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారి రాజకీయ నాయకుడికి అమ్ముడుపోవడంతో అది సహించలేని ఆ బామ్మ అతనిపై తిరగబడుతుంది. అక్కడి నుంచి వారికి కష్టాలు మొదలవుతాయి. ఈ సంఘటనపై రాజకీయాలు చొచ్చుకు రావడంతో కథ ఆసక్తిగా సాగుతుంది. అయితే ఆ బామ్మ తన మనవరాలిపై జరిగిన అఫయిత్యానికి ప్రతీకారం తీసుకోగలిగిందా లేదా అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో సాగే చిత్రం సెంబి. 60 ఏళ్లు పైబడిన కోవై సరళ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశారనే చెప్పాలి. బామ్మ పాత్రలో అంత అద్భుతంగా జీవించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ ప్రతి సన్నివేశాన్ని సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. -
డేంజరస్ గేమ్ నేపథ్యంతో 'వన్ వే' చిత్రం
తమిళసినిమా: చిత్రాల్లో మంచి కంటెంట్ ఉంటే స్టార్ వాల్యూస్ లేకపోయినా ప్రేక్షక ఆదరణ పొందుతున్న రోజులివి. దీంతో ఈ తరం దర్శకులు కొందరు కథని నమ్ముకుని చిత్రాలు చేస్తున్నారు. అలా రూపొందిన చిత్రాల్లో వన్‌వే ఒకటని చెప్ప వచ్చు. జీ.గ్రూప్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు హర్బజన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో నటి కోవై సరళ, ఆరా, చార్లెస్ వినోద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నటి కుష్బూ అన్నయ్య అబ్దుల్లా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఎంఎస్ శక్తివేల్ దర్శకత్వం వహించారు. ముత్తు కుమరన్ చాయాగ్రహణం, అశ్వివన్ హేమంత్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 4వ తేదీన థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది. చిత్ర కథను దర్శకుడు ఒక కుగ్రామం నుంచి పైశాచిక ఆనందాన్ని పొందే బడా బాబుల సంస్కృతి వరకు తీసుకెళ్లాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన కోవై సరళ భర్త అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడితే ఇద్దరు పిల్లలతో ఆ తల్లి ఏం చేసిందీ? కుటుంబ బాధ్యతలు మీద పడడంతో డబ్బు సంపాదన కోసం ముంబయి వెళ్లిన యువకుడు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? ప్రాణాలను కోల్పోయేంత డేంజరస్ గేమ్‌లోకి ఎలా నెట్టపడ్డాడు? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం వన్ వే. ప్రాణాలతో చెలగాటం ఆడే ఆ గేమ్ ఏమిటీ? అందులోకి బలవంతంగా నెట్టపడిన యువకుడి పరిస్థితి ఏమిటి అనే సన్నివేశాలను దర్శకుడు ఉత్కంఠ భరితంగా తెరపై ఆవిష్కరించారు. -
నటి కోవై సరళ గురించి కమల్‌హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళసినిమా: సీనియర్ నటి కోవై సరళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంభీ. సైలెంట్ ఆర్ట్స్ ఆర్. రవీంద్రన్, ఏఆర్. ఎంటర్టైన్మెంట్ అజ్మల్ ఖాన్, రియా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మైనా చిత్రం ఫేమ్ ప్రభు సాల్మన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి ఇందులో నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. నటుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన పాత్ర పోషించిన కోవై సరళ మాట్లాడుతూ దర్శకుడే ఈ చిత్ర కథానాయకుడు అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో నటించడం చాలా సులభం అన్నారు. ప్రభు సాల్మన్ చెప్పినట్టు చేస్తే చాలని చిత్రం బాగా వస్తుందన్నారు. నటుడు కమలహాసన్ మాట్లాడుతూ ఇక్కడ నటి కోవై సరళను కొందరు అక్క అని మరికొందరు అమ్మ అని పేర్కొన్నారని.. అయితే తాను ఏమనాలో తెలియడం లేదని అన్నారు. సరళ పాప తనకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. ఆమె ఈ చిత్రంలో చాలా బాగా నటించారని కొనియాడారు. అదేవిధంగా బాలనటి కూడా ఎలాంటి సంకోచం లేకుండా చాలా చక్కగా నటించిందని ప్రశంసించారు. 16 వయదినిలే చిత్రం గురించి ఇప్పటికి చెప్పుకుంటున్నారంటే అదే పెద్ద చిత్రం అని కమల్ పేర్కొన్నారు. ఇన్ని కోట్లతో రూపొందించామే ఆ చిత్రం పేరు ఏంటి ?అని అడిగితే అది పెద్ద చిత్రం కాదని అన్నారు. ప్రేక్షకులు మంచి కథా చిత్రాలను ఆదరించాలని, నచ్చకపోతే ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పాలని పేర్కొన్నారు. ప్రతిభావంతులు చాలామంది అవకాశాలు లేక గుర్తింపుకు నోచుకోలేక పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కె.భాగ్యరాజ్, ఆర్.వి. ఉదయకుమార్, నిర్మాత ఐసరి కె గణేష్, టి.శివ, ధనుంజయన్ తదితరులు అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. -
కోవై సరళ ‘సెంబి’ మూవీ టీంకు కమల్ అభినందనలు
సాక్షి, చెన్నై: సెంబి చిత్ర యూనిట్‌ను నటుడు కమలహాసన్ అభినందించారు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ ఆర్.రవీంద్రన్, ఏఆర్ ఎంటర్టైన్మెంట్ రియా, ఆడిటర్ అక్బర్ అలీ కలిసి నిర్మిస్తున్న చిత్రం సెంబి. నివిన్ కె.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి కోవై సరళ ప్రధాన పాత్రలో, అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా కమలహాసన్ కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించిన నేపథ్యంలో సెంబి చిత్ర యూనిట్ మంగళవారం నటుడు కమలహాసన్‌ను చెన్నైలోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు అందించింది. ఈ సందర్భంగా సెంబి చిత్ర ట్రైలర్‌ను కమలహాసన్‌కు చూపించారు. ట్రైలర్ చాలా బాగుందని చిత్ర యూనిట్‌ను కమల్ అభినందించడంతో పాటూ నట రాక్షసి అంటూ కోవై సరళను ప్రశంసించారు. కాగా కమలహాసన్ అభినందనలు ఉత్సాహాన్ని కలిగించాయని, త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
షాకింగ్ లుక్‌లో కోవై సరళ, ఫొటో వైరల్
Kovai Saral Shocking look From Sembi Movie: కోవై సరళ.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన కామెడీతో నవ్వించి లేడీ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. బెసిగ్గా తమిళ నటి అయిన కోవై సరళ టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో లేడీ కమెడియన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గరైంది. చివరిగా 2019లో వచ్చిన అభినేత్రి 2లో కనిపించిన ఆమె కొంతకాలంగా తెరపై కనుమరుగైంది. ఈ నేపథ్యంలో కోవై సరళకు సంబంధించిన ఓ షాకింగ్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తలపై క్లాత్ కప్పుకుని 70 ఏళ్ల వృద్దురాలిగా దీన స్థితిలో ఉన్నట్లు కినిపించింది. చదవండి: కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎప్పుడూ తెరపై నవ్వుతూ,నవ్విస్తూ ఉంటే కోవై సరళ ఇందులో మాత్రం చాలా సీరియస్‌గా కనిపించింది. అయితే ఇది ఆమె తాజాగా నటించిన తమిళ చిత్రం ‘సెంబి’ లోనిది. ‘అరణ్య’ ఫేమ్ ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమె 70 ఏళ్ల వృద్దురాలుగా నటిస్తోంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఓ బస్సు నేపధ్యంలో 24 మంది ప్రయాణికుల చుట్టూ ఈ కథ నడుస్తోందని, ఇందులో కోవై సరళ సీరియస్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. తంబి రామయ్య, అశ్విన్ కుమార్‌తోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ నీల ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. ఈ మూవీని తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. Presenting the Title and First Look of my next titled #SEMBI #செம்பி starring #KovaiSarala @i_amak prod by #Ravindran's @tridentartsoffl & #AjmalKhan @actressReyaa's @AREntertainoffl #Jeevan @nivaskprasanna #Buvan #VijayThennarasu @PhoenixPrabu2 @srikrish_dance @onlynikil pic.twitter.com/BCO7eACqYP — Prabu Solomon (@prabu_solomon) May 20, 2022 -
యాక్టింగ్‌లో మేటి.. యాసలో ఒకటే!
వెబ్‌డెస్క్: ఏరంగంలోనైనా పురుషులతో సమానంగా మహిళలు రాణించాలంటే అదనపు నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాల్సిందే. అలా తమదైన సొంత ప్రతిభతో పురుషులకు ధీటుగా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా సినీరంగంలో,అందులోనూ హాస్య పాత్రల్లో రాణించడమంటే కత్తిమీదే సామే. అలాంటి వారిలో అలనాటి సూర్యకాంతం, ఛాయాదేవి మొదలు, రమాప్రభ, శ్రీలక్ష్మి, 90ల దశకం నాటి తెలంగాణా శకుంతల, ఇంకా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న కోవై సరళ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పరభాషా నటి అయినా తెలుగులో అద్భుతంగా రాణించిన కోవై సరళ, ‘తెలంగాణా’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తెలంగాణ శకుంతల మధ్య ఉన్న వివిధ సారూప్యతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా శకుంతల, కోవై సరళ ఇద్దరూ తెలుగు తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్టులుగా రాణించారు. తెలుగు సినీరంగంలో వీరిద్దరి మధ్యా ఉన్న సారూప్యత కేవలం హాస్యాన్ని పండించడం ఒక్కటే కాదు. అద్భుతమైన నటన, విలక్షణమైన భాషతో వీరు తెరపైగా కనిపించిగానే థియేటర్లలో నవ్వులు పూయాల్సిందే. సీటీలు మారు మోగాల్సిందే. నటనా శైలి, భాష, యాస, పంచ్ డైలాగులు వీరికి తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అపహాస్యం, అసభ్యత లేని కామెడీ వీరి సొంతం.కుటుంబంలో ఆడపిల్లగా కుటుంబ బాధ్యత తనపై వేసుకుని నిబద్దతతో కుటుంబాన్నిపైకి తీసుకు రావడం మరో సారూప్యత. కడియాల శంకుతల (తెలంగాణా శకుంతల) మహారాష్ట్రలో పుట్టి పెరిగిన కడియాల శంకుతల 250కి పైగా చిత్రాల్లో నటనతో అజరామరంగా నిలిచిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్లో తెలంగాణ యాస, రాయలసీమ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒంటి కాలిపరుగుతో రంగస్థల నటిగా తన నటనాప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఆ తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిరు. అది మొదలు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఒకదశలో తన కోసమే పాత్రలను సృష్టించే స్థాయికి ఎదిగిన గొప్ప నటి ఆమె. రవీంద్ర భారతిలో ప్రదర్శించిన నాటకం ద్వారా నటన మొదలు పెట్టిన ఆమె చాలా నాటకాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆ తరువాత. గౌతమ్ ఘోస్ దర్శకత్వం వహించిన 1979 నాటి చిత్రం ‘మా భూమి’ ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ ‘నీ తల్లి..ఇంకోపాలి నా ఇలాకలో..’ డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె ఆ తరువాత ఎన్నో పంచ్ డైలాగులతో ప్రేక్షకుల మెప్పుపొందారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’లోని ఆమె నటన, ఆమె పలికన తీరు, నోట్లో లావుపాటి చుట్టతో ఆమె ఆహార్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతేనా లక్ష్మి సినిమాలో, మరో హాస్యనటుడు వేణు మాధవ్‌తో కలిసి నటించిన కామెడీ సీన్ గుర్తొస్తే పగలబడి నవ్వాల్సిందే. ‘‘తమ్మీ పైసలు దెస్తివా..మరి ఏమే.. పోవే.. శక్కూ.. అంటివి గదరా’‘ లాంటి ఎన్నో విలక్షణ డైలాగులతో శకుంతల ఎంతో ప్రాచుర్యం పొందారు. పెళ్లాంతో పనేంటి సినిమాలో కొండవలసకు జోడిగా ఆమె అమాయకపు నటన, ఆ తరువాత చూపించిన నట విశ్వరూపం, ఒరిజినల్ కారెక్టర్‌ను ప్రదర్శించిన తీరు అద్భుతం. అలాగే దివంగత దర్శకుడు దాసరి నారాయణ దర్శకత్వంలోవచ్చిన చిత్రం ఒసేయ్ రాములమ్మతోపాటు, కొమురం భీం, ఎర్ర సైన్యం లాంటి చిత్రాలు ఆమె కరియర్లో భాగం. అంతేకాదు పురుషులతో పోటీ పడి మరీ విలనిజాన్ని పండించిన ఘనత శకుంతల సొంతం. కుక్క సినిమాలో నటనకు నంది అవార్డును సొంతం చేసుకున్నారు. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు, కష్టపడే మనస్తత్వంతోనే మహిళలు రాణిస్తారని నమ్మి ఆచరించిన ధీర మహిళ శకుంతల. రవి తేజ నటించిన వీడే మూవీలో ఆమె ఒక పాట పాడటం విశేషం. ‘‘భయం అనేదే నాకు తెలియదు..అమ్మకు నేనే అబ్బాయిని. నన్ను మగరాయుడిలా పెంచారు..నలుగురి అక్క చెలెళ్లకు నేను అన్న..నేనే తమ్ముడిని. డేరింగ్ అండ్ డేషింగ్ మహిళను’’ అని స్వయంగా శకుంతలగారే చెప్పుకున్నారు. తండ్రి చనిపోవడంతో నటననే వృత్తిగా ఎంచుకుని కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లి చేసిన తరువాత మాత్రమే ఆమె పెళ్లి చేసుకున్నారు. రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్లు, రెండుకాళ్లు విరిగిపోయినా మృత్యుంజయురాలై, ఫీనిక్స్ పక్షిలా పడిలేచిన కెరటం శకుంతల. కానీ 2014, జూన్ 14న తీవ్ర గుండెపోటుతో కన్నుమూయడం విషాదం. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జన్మించిన కోవై సరళ తమిళం తెలుగు భాషల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. రెంటిలోనూ ఇప్పటి దాకా సుమారు 750 సినిమాల్లో నటించారు. కామెడీనీ పండించడంలో ఈమెకు ఈమే సాటి. ముఖ్యంగా కమల్ హాసన్‌కు జోడీగా ‘సతీ లీలావతి’, స్టైలిష్‌స్టార్ అర్జున్ నటించిన దేశముదురుమూవీలో కోవై సరళ నటనను ఎలా మర్చిపోతాం. అంతేకాదు బ్రహ్మానందానికి తోడుగా తిరుమల తిరుపతి వెంకటేశా, 2002లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా సందడే సందడి మూవీలో ఆమె చేసిన కామెడీ హైలెట్‌గా చెప్పొచ్చు. అలాగే లారెన్స్ మూవీ కాంచనలో కోవై సరళ అమాయక నటనకు జేజేలు చెప్పాల్సిందే. నాగార్జున నుంచి మొదలు ఈ తరం యంగ్ హీరోలు అందరి సినిమాల్లోను ఆమె నటించారు. ముఖ్యంగా కిక్-2 , గ్రీకు వీరుడు, హీరో, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ఎలా చెప్పను, శ్రీరామచంద్రులు, ఎంత బావుందో!, ఫూల్స్ , అక్కా బావెక్కడ సినిమాల్లోని పాత్రలతో తనదైన శైలితో ఆకట్టుకున్నారు. పదినేళ్ల వయసులోనే కేఆర్ విజయ సరసన వెల్లి రథం అనే తమిళ సినిమాలో నటించారు. ముంధనై ముడిచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగాను, మరో రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించిన మెప్పించిన ఘనత ఆమె సొంతం. కోవై సరళ కుటుంబ బాధ్యతల నిమిత్తం అవివాహితగానే మిగిలిపోయారు. నలుగురు అక్కచెల్లెళ్లున్న కుటుంబంలో పెద్ద కుమార్తె సరళ. వారి చదువు సంధ్యా వివాహాల సందడిలో పడి పెళ్లి అన్న మాటనే మర్చిపోయారామె. తనకు ఒంటరిగా ఉండడం ఇష్టమని, అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని ఒక సందర్భంగా ఆమె చెప్పుకున్నారు. ఓరి నీప్రేమ బంగారం కానూ (2003) సినిమాకు ఉత్తమ హాస్యనటి నంది పురస్కారాన్ని, తమిళనాడు ప్రభుత్వం నుంచి మూడుసార్లు ఉత్తమ హాస్యనటి అవార్డును సొంతం చేసుకున్నారు. తరతరాలకి ఎవర్గ్రీన్ కామెడీ క్వీన్ కోవై సరళ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఎంఎన్ఎం పార్టీలో చేరిన నటి కోవై సరళ
సాక్షి, చెన్నై : ప్రముఖ హాస్య నటి కోవై సరళ శుక్రవారం కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమల్ హాసన్ ఇవాళ కోవై సరళను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. కోవై సరళకు పార్టీ సభ్యత్వాన్ని అందించిన కమల్ హాసన్ ఆమె సేవలు అవసరమని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవుతున్న కమల్ హాసన్‌కు కోవై సరళ పార్టీలో చేరిక కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుంది. కొంతకాలంగా రాజకీయాలలో చేరికపై కోవై సరళ దూరంగా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో చిరకాల మిత్రుడు, సహ నటుడు కమల్ హాసన్‌కు మద్దతు తెలపటంతో పాటు పార్టీలో చేరటం మక్కల్ నీది మయ్యం పార్టీకి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ సందర్బంగా కోవై సరళ మాట్లాడుతూ ఎంఎన్ఎం పార్టీ కోసం కమల్ సూచనల మేరకు పని చేసేందుకు సిద్దమని అన్నారు. హాస్య నటిగా దక్షిణాన గుర్తింపు పొందిన కోవై సరళ మంచి వక్త కూడా. ఇకపై రానున్న ఎన్నికల ప్రచారంలో కోవై సరళ వ్యంగ్యాస్త్రాలు ఎలా పేలనున్నాయో చూడాలి మరి. -
అంతకు మించి!
‘ముని’ ఫ్రాంచైజీలో వచ్చిన హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘కాంచన 3’ రెడీ అవుతోంది. రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్ దుహన్ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తెలుగులో లైట్‌హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్లో రాఘవ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం డాల్బీ అట్మాస్ సౌండ్‌ని వినియోగించారు టీమ్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భాగా బి. మధు మాట్లాడుతూ– ‘‘రాఘవా లారెన్స్ స్వయంగా అందించిన హారర్ సినిమాలన్నీ సూపర్ హిట్లే. అందులో ‘ముని’ సీక్వెల్ చాలా స్పెషల్. ‘ముని’ సిరీస్‌లో ఇది నాలుగో చిత్రం. కాంచన పేరుతో స్టార్ట్ అయిన తర్వాత ఇది కాంచన–3. ఆయన ప్రతి చిత్రంలో తన గెటప్‌ని సామాన్య ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా చూసుకుంటారు. గత మూడు చిత్రాలకు మించి ‘కాంచన 3’ ఉండబోతుంది’’ అన్నారు. -
శశికుమార్ మొరటోడనుకున్నా!
తమిళనాడు ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉందని ప్రముఖ హాస్యనటి కోవైసరళ పేర్కొన్నారు. కథానాయకుడు, నిర్మాత శశికుమార్ తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించి నటించిన తాజా చిత్రం భలే వెళ్‌లైయదేవా. నటి తాన్యా కథానాయకిగా నటించిన ఇందులో కోవైసరళ, రోహిణి, సంగిలి మురుగన్ ముఖ్య పాత్రలు పోషించారు. సోలై ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శశికుమార్ మాట్లాడుతూ దర్శకుడు సోలైప్రకాశ్ చెప్పిన కథ చాలా నచ్చిందన్నారు. అయితే అందులో తనకు ముందుగా కళ్ల ముందు మెదిలింది బామ్మ పాత్ర అని చెప్పారు.ఈ పాత్ర పోషించే సత్తా ఇద్దరు నటీమణులకే ఉందనపించిందన్నారు.అందులో ఒకరు నటి మనోరమ, రెండోవారు కోవైసరళ అని పేర్కొన్నారు. మనోరమ ఇప్పుడు లేకపోవడంతో తమ చిత్రంలో బామ్మ పాత్రను కోవైసరళనే పోషించాలని భావించామన్నారు. ఆమె నటించడానికి అంగీకరించకుంటే ఈ భలే వెళ్‌లైయదేవా చిత్రం ఉండేది కాదన్నారు. ఇందులో హీరోను తాను కాదు కోవైసరళనే అని శశికుమార్ పేర్కొన్నారు. కానీ చాలా సాఫ్ట్.. నటి కోవైసరళ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు శశికుమార్ చాలా మొరటోడు, తానేమో కామెడీ పీస్‌ను కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందని కాస్త భయపడినట్లు పేర్కొన్నారు. అయితే చిత్రంలో నటిస్తున్నప్పుడు శశికుమార్ సినిమాల్లో చూడడానికే మొరటోడులా కనిపిస్తారని, నిజానికి చాలా సాఫ్ట్ అని తెలిసిందన్నారు. ఆయన ఎక్కువగా మాట్లాడరు కూడా అని అన్నారు. ఇక పేమెంట్ విషయంలో చెప్పనే అక్కర్లేదన్నారు. ఇంటికి వచ్చి మరీ ఇచ్చే వారని చెప్పారు. ఇప్పుడు తమిళనాడు చాలా టెన్షన్ లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భలే వెళ్‌లైయదేవా చిత్రం చూస్తే కాస్త ఓదార్పు కలుగుతుందని కోవైసరళ తెలిపారు. సమావేశంలో నటి తాన్యా, సంగిలిమురుగన్, దర్శకుడు సోలై ప్రకాశ్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియాలో సునీత హల్చల్
-
భర్త, పిల్లలు, హాబీలు.. అన్నీ సినిమానే..!
ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు, దేవాలయాల్లాంటి ప్రదేశాలలో కూడా చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. - కోట్ బై కోవై సరళ ‘ప్రేమించడం హత్య చేసినంత మహా పాపం’. - కోట్ బై కోవై సరళ జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు. - కోట్ బై కోవై సరళ సినిమాలే నా లైఫు, పర్సనల్ లైఫూ. - కోట్ బై కోవై సరళ కోట్ బై అని అంతా చెప్పుకునే స్థాయిలో చాలా పెద్ద జీవితాన్ని చూశారు కోవై సరళ! సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే... జీవితం ఆమెను రెండు వైపుల నుంచి నొక్కేసింది! ఏం చెప్పినా చిటికెలో చేసేస్తుంది - ఒకవైపు ఆ అమ్మాయి ఉంటే మేం చెయ్యం - రెండో వైపు. ఇవాళ పిలిచి అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు - ఒకవైపు మర్నాడు ఫోన్ చేసి ఇచ్చేయ్మనేవాళ్లు - రెండో వైపు. ఇంకా... ఇలాంటివే చాలా, చాలా, చాలా. అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు కోవై సరళ. ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. అవడానికి కమెడియనే అయినా... ఆమె ప్రతి అనుభవంలో మీకు హీరోయినే కనిపిస్తుంది! ఎస్. వడివేలును కుమ్మినట్లు... పరిస్థితులతో తలపడి నిలబడిన ప్రతి స్త్రీ... హీరోయినే. సరళగారూ... మీ ఇంటి పేరు కోవైనా? కోవై సరళ: కాదు. మా తమిళంవాళ్లకి ఇంటి పేర్లుండవు. నాన్నగారి పేరు ఇంటిపేరు అవుతుంది. మా సొంత ఊరు కోయంబత్తూర్. ఆ సిటీని ‘కోవై’ అని పిలుస్తారు. ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి, పత్రికలవాళ్లు కోవై సరళ అని రాయడం మొదలుపెట్టారు. దాంతో అది పాపులర్ అయిపోయింది. అయితే పుట్టి పెరిగిందంతా కోయంబత్తూర్లోనేనా? కోవై సరళ: అవును. నా బాల్యం, చదువూ అంతా అక్కడే. ప్లస్ టూ వరకూ చదివా. ఇంగ్లిష్, తమిళ్లో టైప్‌రైటింగ్ హయ్యర్ పాసయ్యాను. అప్పట్లో నేను టైప్ చేస్తుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అంత స్పీడ్ అన్నమాట. నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ప్లస్ టు తర్వాత సినిమాల్లోకి వెళదామనుకున్నాను కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. మీ నాన్నగారు ఏం చేసేవారు? సరళ: లారీలు, బస్సులు ఉండేవి. ఆ బిజినెస్‌లో నష్టం వచ్చిన తర్వాత ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. మా నాన్న మిలిటరీలో కూడా చేశారు. దాంతో స్ట్రిక్ట్‌గా ఉండేవారు. చిన్న పనైనా ఓ పద్ధతి ప్రకారం చేయాలనేవారు. సినిమాలకు వెళ్లనిచ్చేవారు కాదు. స్కూల్, ఇల్లు, టైప్‌రైటింగ్ క్లాస్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. మీకు బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా? సరళ: నలుగురు అక్కయ్యలు, ఓ అన్నయ్య. నాన్నగారు స్ట్రిక్ట్ అయినప్పటికీ నాకేదైనా కావాలంటే మారాం చేసి, మంకు పట్టు పట్టి మరీ సాధించుకునేదాన్ని. డ్రామాల్లో అయినా యాక్ట్ చేయనివ్వాలంటూ స్ట్రైక్ చేశాను. అయినా నాన్న మనసు కరగలేదు. దాంతో ఓ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇక, లాభం లేదనుకుని అనుమతించారు. ఒక డ్రామాలో యాక్ట్ చేశా. భలే అనిపించింది. అమ్మానాన్నను బతిమాలుకుని ఎలాగోలా 20 డ్రామాల్లో యాక్ట్ చేసేశాను. డ్రామాల ద్వారా సంపాదించిన అనుభవంతో సినిమాల్లో యాక్ట్ చేయొచ్చన్నది నా అభిప్రాయం. మరి... సినిమాల్లోకి రావడానికి ఎంత పెద్ద స్ట్రయిక్ చేశారేంటి? సరళ: లక్కీగా అలా చేయాల్సిన అవసరంలేదు. డెరైక్టర్ భాగ్యరాజాగారి ఇల్లు మా ఇంటి పక్కనే. నేను చిన్నప్పట్నుంచీ ఆయనకు తెలుసు. ‘‘పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు?’’ అని ఆయన అడిగితే.. ‘సినిమా యాక్టర్’ అవుతా అనేదాన్ని. సినిమాల్లోకి రాకముందు భాగ్యరాజాగారు డ్రామాలు వేసేవారు. సినిమా డెరైక్టర్ అయిన తర్వాత, మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే భాగ్యరాజాగారు చూడ్డానికి వచ్చారు. నన్ను చూసి, ‘‘ఏం చేస్తున్నావ్’’ అనడిగితే, ై‘టెప్రైటింగ్’ చేస్తున్నా అని చెప్పాను. ‘‘నేను ‘ముందానై ముడిచ్చు’ అనే సినిమా చేస్తున్నా. గోపిచెట్టిపాల్యంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడికొస్తే, నీకు మంచి కేరక్టర్ ఇస్తాను’’ అన్నారాయన. చెప్పింది భాగ్యరాజాగారు.. పైగా సినిమాల మీద నా పిచ్చి బాగా ముదిరిందని గ్రహించి, పెద్దగా బతిమాలించుకోకుండానే అమ్మానాన్న పర్మిషన్ ఇచ్చారు. దాంతో హుషారుగా కోయంబత్తూర్ టు గోపిచెట్టిపాల్యం బస్సెక్కేశా. ఫస్ట్ టైమ్ షూటింగ్ ఎలా అనిపించింది? సరళ: అప్పటివరకు నాది చాలా చిన్నప్రపంచం. లొకేషన్లో చాలామందిని చూసి, ఆశ్చర్యం అనిపించింది. కానీ భయపడలేదు. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ కాబట్టి, తడబడకుండా చేసేశాను. ‘ముందానై ముడిచ్చు’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వెంటనే బోల్డన్ని అవకాశాలు వచ్చి ఉంటాయేమో? సరళ: ఫలానా కేరక్టర్ చేసింది ఎవరు? అంటూ కొంతమంది దర్శక, నిర్మాతలు ఆరా తీశారు. అయితే నేను ‘ముందానై ముడిచ్చు’ సినిమా చేసి, కోయంబత్తూర్‌లోనే ఉండిపోయాను. అందుకని, నన్ను కాంటాక్ట్ చేయలేకపోయారు. ఆరు నెలలు గడిచిన తర్వాత ఇలా అయితే లాభం లేదనుకుని మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఊరు కాని ఊరికి పంపించడానికి ఇంట్లోవాళ్లు భయపడలేదా? సరళ: నాతో పాటు నాన్నగారు కూడా వచ్చారు. మద్రాస్‌లోని తేనాంపేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఇక, నేను మద్రాసు వచ్చానని తెలుసుకుని, చాలామంది అప్రోచ్ అయ్యారు. ‘కళ్యాణరామన్’, ‘ఉయిరే ఉనక్కాగ’... ఇలా నేను చేసిన సినిమాలన్నీ వంద రోజులాడటం, నా కామెడీ నచ్చడంతో పాపులర్ అయ్యాను. అసలు సినిమాల మీద మీకు ఇష్టం ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? సరళ: నేను ఎమ్జీఆర్‌కి వీరాభిమానిని. ఇంట్లో సినిమాలు చూడనిచ్చేవాళ్లు కాదని చెప్పాను కదా. అప్పుడప్పుడు గొడవపడో, బతిమాలుకునో ఎమ్జీఆర్ సినిమాకెళ్లేదాన్ని. తెరపై ఆయన కనిపించగానే అభిమానులు విజిల్స్ వేయడం, ఆరాధనగా చూడటం భలే అనిపించేది. మనం కూడా సినిమా ఆర్టిస్ట్ అయితే అలానే చూస్తారుగా అనుకునేదాన్ని. సో.. నేను ఆర్టిస్ట్ అవాలనుకోవడానికి ఓ కారణం ఎమ్జీఆర్ అనే చెప్పాలి. అది సరే... ఎవరైనా హీరోయిన్ అవ్వాలనుకుంటారు... మీరు కామెడీనే ఎందుకు టార్గెట్ చేశారు? సరళ: నా టార్గెట్ హీరోయినా, కమెడియనా, కేరక్టర్ ఆర్టిస్టా? అని కాదు. స్క్రీన్ మీద నా మొహం కనిపిస్తే చాలనుకున్నాను. పబ్లిక్‌లో కనిపించినప్పుడు ‘అదిగో కోవై సరళ...’ అని నన్ను గుర్తుపడితే ఈ జన్మ సార్ధకమైనట్లు అనుకునేదాన్ని. ఒకవేళ నేను హీరోయిన్‌కి టార్గెట్ చేసి, పరిస్థితుల ప్రభావం వల్ల కామెడీతో సరిపెట్టుకోవాల్సి వస్తే... చాలా అప్సెట్ అయ్యుండేదాన్ని. మీరు రంగప్రవేశం చేసే నాటికి కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా మనోరమ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి... మీకేమైనా అభద్రతాభావం, భయం ఉండేవా? సరళ: నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. సీన్ ఇలా చెప్పగానే అలా చేసేదాన్ని. చెట్లెక్కమంటే ఎక్కేసేదాన్ని, పై నుంచి దూకమంటే అమాంతంగా దూకేసేదాన్ని. దాంతో కోవై సరళ ఏం చెప్పినా, చిటెకెలో చేసేస్తుందని ప్రచారం జరిగింది. అలాగే నేను చేసే కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో అవకాశాలకు కొదవ ఉండేది కాదు. అందుకే, మనం పెట్టే బేడా సర్దుకుని కోయంబత్తూర్ వెళ్లాల్సి వస్తుందేమోననే భయం ఉండేది కాదు. మనోరమ.. ఆ తర్వాత మీరు... మీ తర్వాత పెద్దగా హాస్యనటీమణులు రాణించకపోవడానికి కారణం ఏంటి... మగవాళ్లల్లో చాలామంది కమెడియన్లు ఉన్నారు కదా? సరళ: తమిళ పరిశ్రమకు సంబంధించినంతవరకు మగవాళ్ల డామినేషన్ ఉంటుంది. లేడీస్‌కి తక్కువ ప్రోత్సాహం ఉంటుంది. అందుకే, మా తర్వాత లేడీ కమెడియన్స్ షైన్ అవలేదు. ఒకరిద్దరు వచ్చినా, పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు. ఒకవేళ ఇన్వాల్వ్ అయినా ఎంకరేజ్మెంట్ లభించలేదు. నిజం చెప్పండి... ఇక్కడ మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా? సరళ: నన్ను పైకి రానివ్వకుండా చేయాలని కొంతమంది ట్రై చేశారు. ‘ఆ అమ్మాయి ఉంటే మేం సినిమా చెయ్యం’ అని నిర్దాక్షిణ్యంగా చెప్పేవాళ్లు. దాంతో నాకు కొన్ని అవకాశాలు పోయేవి. అలా చేసినవాళ్లెవరు?... ఆ డామినేషన్‌ని తట్టుకోవడానికి మీరేం చేసేవారు? సరళ: పేర్లు చెప్పను. నేను కామెడీ ఆర్టిస్ట్‌ని కాబట్టి, నా అవకాశాల విషయంలో హీరోల జోక్యం ఉండదు కదా. కొంతమంది కమెడియన్లే నాతో యాక్ట్ చేయకూడదనుకునేవాళ్లు. అయినా నా పని నేను చేసుకునేదాన్ని. ఓ పది సినిమాలు చేతిలో ఉన్నప్పుడు ఒకటీ రెండు సినిమాలు పోతే ఏమవుతుంది? అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా వెనక్కి వెళ్లిన అవకాశాలు ఉన్నాయా? సరళ: చాలా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయలంటే పెద్ద విషయం. అప్పట్లో నేనో సినిమా కమిట్ అయ్యానంటే, వెయ్యిరూపాయలు అడ్వాన్స్ ఇచ్చేవారు. అయితే కొంతమంది కమెడియన్లు నేనుంటే.. యాక్ట్ చెయ్యనని చెప్పేయడంతో ఇచ్చిన అడ్వాన్స్‌ని వెనక్కివ్వమని అడిగేవాళ్లు. ఒక సినిమాకి అవకాశం వస్తే.. సంతోషంతో నాకా రోజంతా నిద్రపట్టేది కాదు. కానీ, ఉదయమే అడ్వాన్స్ వెనక్కివ్వమని ఫోన్ రావడమో, డెరైక్ట్‌గా మనిషి రావడమో జరిగేది. అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మా నాన్నగారు ఇచ్చిన ధైర్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేదు. ‘మనకేది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీకు టాలెంట్ ఉంది’ అంటూ ఊరడించేవారు. నాన్న ముందు కన్విన్స్ అయ్యేదాన్ని కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని. ఆ బాధలో బ్యాక్ టు కోయంబత్తూర్ అనే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా? సరళ: అంత పిరికిగా ఆలోచించలేదు. బాధపడుతూ ఇంట్లో కూర్చునేంత ఖాళీ ఉండేది కాదు. పైగా నేను చేసేది కామెడీ కాబట్టి.. షూటింగ్‌కి వెళ్లగానే బాధ తగ్గేది. అలాగే, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. హాస్యనటుల కెరీర్ మహా అయితే 10, 15 ఏళ్లు ఉంటుంది. వాళ్లతో పోల్చితే నటీమణుల కెరీర్‌కి ఎక్కువ స్పాన్ ఉంటుంది. అందుకు ఉదాహరణ నా 30 ఏళ్ల కెరీరే. నా కళ్లముందే ఎంతోమంది మగ కమెడియన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ, నేను మాత్రం అలానే ఉన్నాను. ఎంతమంది కమెడియన్లు వచ్చినా.. వాళ్లకి దీటుగా నిలబడగలననే విషయం నాకు చాలా త్వరగానే అర్థమైంది. దాంతో నా వెనక గోతులు తవ్వినా పట్టించుకునేదాన్ని కాదు. మహా అయితే నాలుగైదేళ్లు ఇతను ఉంటాడేమో.. కానీ మనకు లాంగెవిటీ ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. అదే నిజమైంది. హాస్యనటుల కెరీర్ పదేళ్లే అని ఎలా అంటున్నారు... కోట, బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ.. ఇలా చాలామంది ఏళ్ల తరబడి ఏలుతున్నారు కదా? సరళ: నేను చెప్పింది తమిళ పరిశ్రమ గురించి. నాకు తెలిసి తెలుగులో డెరైక్టర్, ప్రొడ్యూసర్, రైటర్స్ సెలక్ట్ చేసిన కమెడియన్లనే ఎన్నుకుంటున్నారనిపిస్తోంది. తమిళంలోలా ‘నేను కోవై సరళతో యాక్ట్ చేయను’ అని చెప్పే కమెడియన్లు ఇక్కడ లేరు. అందుకే, నాకిక్కడ అవకాశాలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ‘సతీలీలావతి’లో మిమ్మల్ని కమల్‌హాసన్ హీరోయిన్గా ఎంపిక చేసినప్పుడు ఎలా అనిపించింది? సరళ: ఆయన సినిమాలో నేను కామెడీ కేరక్టర్స్ చేశాను.ఆ విధంగా కమల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నా మేనేజర్ వచ్చి ‘కమల్‌సార్ సరసన మీరు హీరోయిన్గా నటించాలి’ అన్నాడు. జోక్‌లేసి నవ్వించే నాకే జోక్ చెబుతున్నావా? అనడిగాను. ‘కాదు మేడమ్.. సీరియస్‌గానే చెబుతున్నా’ అనడంతో నమ్మకం కుదిరింది. ఆ సినిమా ఓ మర్చిపోలేని మంచి అనుభవం. మీకు బాగా పేరొచ్చాక కూడా, మిమ్మల్ని తొక్కాలని ఎవరైనా ప్రయత్నించారా? సరళ: ప్రయత్నించారు. అయితే నాకు పేరొచ్చేసింది కాబట్టి... మొహం మీద చెప్పేవాళ్లు కాదు. లేడీ కమెడియన్‌గా ఎవరు చేస్తున్నారు? అని అడిగి, ‘ఆవిడా.. అయితే మా డేట్స్ ఖాళీగా లేవు’ అని చెబుతుంటారు. ఆ విధంగా ఎవరెవరు చెబుతున్నారో నాకర్థమయ్యింది. అందుకని, నిర్మాతలను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక, ‘ముందు ఆ ఆర్టిస్ట్ దగ్గర డేట్స్ ఓకే చేయించుకోండి. ఒకవేళ ఆయన ఇస్తే.. నాకేం అభ్యంతరం లేదు’ అని చెబుతుంటాను. కానీ, ఆ నిర్మాతలు ఆ తర్వాత నాతో టచ్‌లోకి రారు. అది నేనూహించిందే కాబట్టి, నవ్వేసి ఊరుకుంటాను. ఎందుకని మీరంటే ఆ ‘కొంతమంది ఆర్టిస్ట్’లకు పడదు? సరళ: ఒకవేళ యాక్టింగ్‌లో డామినేట్ చేస్తాననో లేక వాళ్లకి ఈక్వల్‌గా యాక్ట్ చేస్తున్నాననే ఫీలింగ్ వల్లో... లేకపోతే ఇంకా ఏమైనా కారణాలున్నాయేమో నాకు తెలియదు. జనరల్‌గా సినిమా నిడివి ఎక్కువైతే.. కత్తెర పడేది దాదాపు కమెడియన్ల పాత్రలకే. మీ విషయంలో అలా జరిగిన సందర్భలున్నాయా? సరళ: లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఈ పాత్ర మనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఓ నమ్మకంతో చేసి, ఆ సినిమా విడుదల కోసం బాగా ఎదురు చూసేదాన్ని. కానీ, సినిమా నిడివి పెరిగినందున నా పాత్ర నిడివి ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది. దాంతో రావాల్సినంత పేరు వచ్చేది కాదు. అప్పుడు చాలా నిరుత్సాహపడేదాన్ని. కొన్ని ఎదురు దెబ్బలు మనకు మంచి పాఠాలవుతాయి. ఆ పాఠాలు మన దిశను నిర్దేశిస్తాయి. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేను ఎంచుకున్న దిశ ‘ఆధ్యాత్మికం’. ఏ వయసులో ఈ దారిని ఎంచుకున్నారు? సరళ: అది కరెక్ట్‌గా చెప్పలేను. చిన్నప్పట్నుంచే నా ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండేవి. అయితే ఆ వయసులో దాని పేరు ఆధ్యాత్మికం అని తెలిసే అవకాశం లేదు కదా. పెద్దయిన తర్వాత వివేకానంద, ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆధ్యాత్మికతకు సంబంధించిన క్లాస్‌లకు వెళ్లేదాన్ని. ‘జీవితం నిరంతరం కాదు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. ఈ రోజు ఉన్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు. అందుకని ఈరోజు నవ్వుతూ, హాయిగా ఉందాం. చుట్టుపక్కలవాళ్లని సంతోషపెడదాం’ అనేంత మానసిక పరిపక్వత నాలో రావడానికి కారణం ఆ పుస్తకాలే. ఓషో ద్వారా ఇంకా ఎలాంటివి తెలుసుకున్నారు? సరళ: ఉదాహరణకు చెయ్యి మీద పెద్ద దెబ్బ తగిలిందనుకుందాం. ‘రక్తం కారుతోంది’ అని మాత్రం అనుకుంటే, నొప్పి తెలియదు. బాగా నొప్పిగా ఉంది అనుకుంటే, నొప్పి తెలుస్తుంది. అసలు నొప్పే లేదనుకుంటే, నిజంగానే నొప్పి తెలియదు. నేనిది టెస్ట్ చేసి చూసుకున్నా. ఓషో బుక్స్ వల్ల దేన్నయినా తేలికగా తీసుకునే పరిపక్వత వచ్చేసింది. తెలుగులో మీ పాత్రలకు ఎంచక్కా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు? సరళ: నా డైలాగులన్నీ తమిళంలో రాసుకుని, బట్టీపట్టి లొకేషన్లో చెప్పేస్తుంటాను. తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడానికి మొదటి కారణం కోడి రామకృష్ణగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పమన్నారు.. ఆ సినిమాకి కో-డెరైక్టర్‌గా చేసిన రాధాకృష్ణ దగ్గరుండి మరీ నాతో డబ్బింగ్ చెప్పించారు. నాకు బాగానే పేరొచ్చింది.. కానీ నాతో డబ్బింగ్ చెప్పించి, ఆయనకు చుక్కలు కనిపించాయి (నవ్వుతూ). తెలుగు మాట్లాడటానికి నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. తమిళ్ ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడేస్తాను. ఆ శ్లాంగ్ అందరికీ నచ్చడం నా లక్. మీ సినిమాల్లో కమెడియన్స్‌ని ఫుట్‌బాల్ ఆడేస్తుంటారు. అసలు ఈ కొట్టడం అనేది ఎవరితో మొదలైంది? సరళ: వడివేలుతో మొదలుపెట్టా. అది బాగా పండటంతో అప్పట్నుంచి నాతో కొట్టించడం ఆనవాయితీ అయ్యింది. ఈ కొట్టే ప్రక్రియ ఓవర్‌గా ఉంటుందనే విమర్శ ఉంది...? సరళ: ఏ కొద్దిమందో అంటున్నారేమో. కానీ, మొగుడూ పెళ్లాలూ కొట్టుకోవడం నేను రోడ్డు మీద చాలా చూశాను. మందు కొడితే చాలు.. మృగంలా మారిపోయి, భార్యలను రోడ్డు మీద కొట్టే మగవాళ్లను స్వయంగా చూశాను. అది తట్టుకోలేక తిరగబడ్డ ఆడవాళ్లనూ చూశాను. నేను కొట్టడం ఓవర్ అని మీరంటున్నారు. కానీ, చాలామంది ఆడవాళ్లు.. ‘‘మేడమ్... మీరే మాకు ఇన్స్పిరేషన్. మా మగవాళ్లు అడ్డదిడ్డంగా బిహేవ్ చేసినప్పుడు ‘కోవై సరళలా మారతాం... జాగ్రత్త అని బ్లాక్మెయిల్ చేస్తుంటాం’’ అంటుంటారు. మగవాళ్లకు నా మీద కోపం ఉంటుందేమో. కానీ, ఆడవాళ్లు తమను తాము రక్షించుకోవడం కోసం నా పేరు వాడుకోవడం నాకు బాగానే అనిపిస్తోంది. కొంచెం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... సినిమా పరిశ్రమలో ఆడవాళ్లు చాలా విషయాల్లో రాజీపడాలంటారు. హీరోయిన్ నుంచి కామెడీ ఆర్టిస్ట్‌ల వరకూ ఇది వర్తిస్తుందా? సరళ: హీరోయిన్ల నుంచీ కామెడీ ఆర్టిస్ట్‌ల వరకు కాదు.. జూనియర్ ఆర్టిస్టులకూ ఇది వర్తిస్తుంది. అయితే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మన దగ్గర బిర్యానీ తినడానికి డబ్బులు లేకపోతే పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాలనుకుంటే.. ఏ విషయంలోనూ రాజీపడాల్సిన అవసరంరాదు. కానీ, బిర్యానీయే తినాలనుకుంటే మాత్రం రాజీ పడాలి. రాజీపడకపోతే.. అవకాశాలు రావంటారు? సరళ: ఒకట్రెండు సినిమాలు పోతాయేమో. దానికే కంగారుపడిపోతే రాజీపడాలనే ధోరణి మొదలవుతుంది. కానీ, మనకు రావాలని రాసి పెట్టి ఉంటే, వచ్చే అవకాశాలను ఎవరూ ఆపలేరు. నాకు చాలా సినిమాలు మిస్ అయ్యాయి. అయినా డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరించాను. ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు.. దేవాలయాల్లాంటి స్కూల్స్, కాలేజ్‌లు, హాస్పిటల్స్‌లో కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునే నేర్పు ఉంటే, సేఫ్‌గా వెళ్లిపోవచ్చు. ఇక... మీ తోడబుట్టినవాళ్లతో మీ అనుబంధం గురించి? సరళ: నా అక్కయ్యల పిల్లలు నా దగ్గరే పెరిగారు. అందర్నీ చదివించాను. ఒకబ్బాయి దుబాయ్‌లో, ఇద్దరు యూఎస్‌లో, ఒకరు లండన్‌లో... ఇలా అందరూ మంచి జాబ్స్‌లో సెటిలయ్యారు. మీ నలుగురు అక్కలు చక్కగా పెళ్లి చేసుకుని, సెటిలయ్యారు.. మీకెప్పుడూ పెళ్లి చేసుకోవాలనిపించలేదా? సరళ: పెళ్లి గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేదాన్ని. సినిమాలు తప్ప నా పర్సనల్ లైఫ్ ఇలా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. పైగా సమాజంలో ఎన్నో విడాకుల కేసులు చూశాను. ఇక పెళ్లెందుకు అనిపించేసింది. అమ్మానాన్న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదా? సరళ: పెళ్లి చేసుకో అన్నారు. ఇష్టం లేదంటే, వదిలేశారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. స్కూల్‌కి వెళ్లేటప్పుడు వంచిన తల ఎత్తకూడదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇలా ఓ స్ట్రిక్ట్ వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో నాకు ప్రేమ మీద కూడా దృష్టి మళ్లలేదు. ఒకవేళ అప్పట్లో ఎవరితోనైనా ప్రేమలో పడి ఉంటే, పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో. కానీ, నేను లవ్‌కి ఆపోజిట్. ప్రేమించడం అనేది హత్య చేసినంత మహా పాపం అని నా మనసులో బలంగా ముద్రించుకుపోయింది. మరి.. మీకు ఎవరూ ‘ఐ లవ్ యు’ చెప్పలేదా? సరళ: నన్ను చూసి ఎవరైనా ‘ఐ లవ్ యు’ చెబుతారా? నేను చేసిన కేరెక్టర్ల ప్రభావం నా జీవితం మీద కూడా పడి ఉంటుందేమో. సినిమాల్లో సహ నటులను ఓ రేంజ్లో కొట్టే నేను నిజజీవితంలో కూడా అలానే ఉంటాననుకుని ఉండొచ్చు. అందుకని, ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు. వయసులో ఉన్నంతవరకూ ఓకే. కానీ, వయసు మీద పడిన తర్వాత ఓ తోడు ఉండాలంటారు కదా? సరళ: పుట్టినప్పుడు మనం ఒంటరిగానే పుడతాం. ఇది మీ అమ్మ.. ఇది నాన్న... వీళ్లు నీ అక్క, చెల్లెళ్లు అని ఎవరో ఒకరు చెబితేనే మనకు తెలుస్తుంది. దాంతో ‘మనవాళ్లు’ అనే భావన మొదలవుతుంది. పెరిగే కొద్దీ అనుబంధం బలపడుతుంది. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ‘నా కుటుంబం’ అనే భావన మొదలవుతుంది. అప్పుడు తోబుట్టువుల మీద కొంత ప్రేమ తగ్గుతుంది. అలా మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నామే అనుకోండి. భర్త చనిపోతే ఒంటరిగా బతకాల్సిందేగా. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయా. నా దృష్టిలో జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు. పెళ్లి చేసుకున్న తర్వాత తోడబుట్టినవాళ్లతో అనుబంధాలు తగ్గుతాయన్నారు. మీవాళ్లు ఆ జాబితాకి చెందినవారేనా? సరళ: ఎంతో కొంత ఆ జాబితాకే చెందుతారు. పెళ్లయిన తర్వాత వాళ్లల్లో మార్పొచ్చింది. ‘నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్య’... అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ‘ఓకే.. నాకు మంచి పాఠం నేర్పించారు’ అని డెరైక్ట్‌గా వాళ్లతోనే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీవాళ్లు అలా చేయడం బాధగా లేదా? సరళ: నేను కూడా మనిషేనండి. ఓషో, వివేకానంద పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రతి విషయాన్ని తేలికగా తీసేసుకుంటానని అనుకోవద్దు. అయితే ఒకే ఒక్క విషయంలో నేను ఆనందపడ్డాను. మంచి వయసులో ఉన్నప్పుడే నాకు అందరి మనస్తత్వాలు అర్థం అయ్యాయి. అదే నేను బాగా ముసలిదాన్ని అయిన తర్వాత తెలిసిందనుకోండి.. ఆ వయసులో తట్టుకునేంత ధైర్యం నాకు ఉండేది కాదు. ఇప్పుడు నాకు బాగా స్టామినా ఉంది. మానసికంగా చాలా ధైర్యం ఉంది. అందుకే, తట్టుకున్నాను. అసలు మీ లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుంది? సరళ: చాలా నార్మల్‌గా. కొన్ని రోజులు ఉదయం ఐదున్నర గంటలకు వాకింగ్ వెళుతుంటాను. బద్దకం అనిపించినప్పుడు మానేస్తా. చెబితే నమ్మరు కానీ.. పదేళ్ల క్రితం రాత్రి రెండున్నర గంటలకు నిద్రలేచి, మూడుగంటలకల్లా మెరీనా బీచ్‌కి వెళ్లేదాన్ని. ఓ గంట వాక్ చేసి, నాలుగున్నరకి ఇంటికొచ్చేసేదాన్ని. ఆ తర్వాత మేకప్ చేసుకుని ఏడుకల్లా షూటింగ్‌కి వెళ్లేదాన్ని. అలా ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వాకింగ్ మానేశాను. ఇంట్లోనే త్రెడ్మిల్ మీద వాక్ చేసేదాన్ని. అది వర్కవుట్ కాలేదు. ఈ మధ్య ఉదయం నాలుగున్నరకల్లా నిద్ర లేచి, వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తున్నాను. ఆ తర్వాత సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నాన్‌వెజ్ పెద్దగా తినను. ఫైనల్‌గా కథానాయికల కెరీర్‌కన్నా మీ కెరీర్‌కి లాంగ్విటీ ఎక్కువ కాబట్టి.. ఎప్పుడైనా హీరోయిన్స్‌కన్నా మనమే బెస్ట్ అనిపించిందా? సరళ: హీరోయిన్గా చేసి ఉంటే.. ఇప్పుడు ‘సాక్షి’కి ఈ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేదాన్ని కాదేమో. మా కోయంబత్తూర్‌లో పాత రోజులను నెమరువేసుకుంటూ కాలక్షేపం చేసేదాన్నేమో. 1983లో సినిమాల్లోకొచ్చాను. ఒకవేళ హీరోయిన్ అయ్యుంటే ఐదు, పదేళ్లకే వెనక్కి వెళ్లిపోయుండేదాన్ని. కామెడీలో ఉన్నాను కాబట్టే 30 ఏళ్లయినా స్టేల్ అవ్వలేదు. ఇప్పటికీ ‘కోవై సరళ’ కామెడీ బోర్ కొట్టలేదు. అందుకే, ‘కామెడీలో నేనే హీరోయిన్’ అనుకుంటాను. నా భర్త, నా పిల్లలు, నా హాబీ సినిమాలే. చివరి శ్వాస వరకు యాక్ట్ చేయాలన్నదే నా కోరిక. - డి.జి. భవాని మీరు ఎవరితోనూ ఫోన్లో టచ్‌లో ఉండరు... ఎందుకు? సరళ: ఫోన్లో మాట్లాడటం నాకు అలర్జీ. ఎవరైనా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే, అంతసేపు ఎలా మాట్లాడుతున్నారు? అనుకుంటాను. మీకో విషయం చెప్పనా? ఆరు నెలల క్రితం వెయ్యి రూపాయలతో రీచార్జ్ చేయించు కున్నాను. ఇప్పటికీ నా ఫోన్లో బాలెన్స్ ఉంది. దాన్ని బట్టి ఎంత మితంగా ఫోన్ వాడతానో అర్థం చేసుకోవచ్చు. ఫంక్షన్స్‌లో కూడా ఎక్కువ కనిపించరు? సరళ: ఫంక్షన్స్‌కి వెళ్లడం చాలా తక్కువ. ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి... దానికోసమే ప్రత్యేకంగా తయారవ్వాలి. తయారై, ట్రాఫిక్ని కూడా లెక్క చేయకుండా వెళ్లిన తర్వాత అక్కడ జరిగేది ఏంటి? ‘బాగున్నారా..’.. ‘ఆ బాగున్నాను’ అంటూ పలకరింపులు. వెనక్కి తిరగ్గానే ‘ఆ ఏం బాగులే...’ అని వెక్కిరింతలు. పెదాల మీద నవ్వుని మెయిన్టైన్ చెయ్యాలి. ఇంటికొచ్చేసరికి ఆ నవ్వు తాలూకు బుగ్గల నొప్పిని భరించాలి. ఇవన్నీ ఎందుకు? అని ఫంక్షన్స్‌ని తగ్గించేశాను. ఓ సినిమా సక్సెస్ అయితే హీరో, డెరైక్టర్, హీరోయిన్స్‌కి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు. ఆ తర్వాతే కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటారు. దీని గురించి మీరేమంటారు? సరళ: నాకు సంబంధించినంతవరకు అది కరెక్టే అంటాను. ఎందుకంటే, హీరోలు నిజంగానే కష్టపడాలి. ఫిజిక్ మెయిన్టైన్ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు కంపల్సరీ. ఆహార విషయాల్లో కూడా చాలా నియమాలుంటాయి. ఇక, ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమా మొత్తం దాదాపు హీరో మీదే నడుస్తుంది కాబట్టి.. ఎక్కువ శాతం క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. హీరోయిన్స్ కూడా సన్నగా మెరుపు తీగలా ఉండాలి కాబట్టి... నచ్చిన ఆహారం తినలేరు. డ్యూయెట్ సాంగ్స్‌లో డాన్సులు చేయడం చిన్న విషయం కాదు. అందుకని, హీరోయిన్‌కీ క్రెడిట్ ఇవ్వాలి. సినిమా మొత్తాన్ని ఏకతాటిపై నడిపించేది దర్శకుడు, అసలా సినిమా తీయడానికి కారణం ప్రొడ్యూసర్ కాబట్టి.. ముందు వాళ్ల గురించే మాట్లాడాలి. ఇక, ఆ తర్వాతి క్రెడిట్ విలన్, కమెడియన్స్, క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకు దక్కుతుంది.