తెలుగు వెండితెరపై టాప్ లేడీ కమెడియన్ ఎవరయా? అంటే అందరూ ముక్తకంఠంతో కోవై సరళ అని టక్కున సమాధానమిస్తారు. ఈ మలయాళ నటి హీరోయిన్‌గా, సహాయ నటిగా, కమెడియన్‌గా అలరించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్ చేస్తూ కామెడీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.
అలా మొదలైంది
'మూడుముళ్లు సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు మా ఇంటి పక్కన ఉండేవారు. ఒకరోజు ఇంటి దగ్గర షూటింగ్ జరగ్గా అందులో నాకు అవకాశమిచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్టయింది. అలా నా జర్నీ మొదలైంది. దాదాపు 15 చిత్రాల్లో హీరోయిన్‌గా చేశాను. 900కు పైగా సినిమాల్లో నటించాను. కోలీవుడ్ నా పుట్టినిల్లయితే టాలీవుడ్ నా మెట్టినిల్లు.
పెళ్లెందుకు చేసుకోలేదు?
స్వేచ్చ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. కచ్చితంగా వివాహం చేసుకోవాలని రూలేమీ లేదు కదా.. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే అన్ని బంధాలు ఏర్పడుతాయి. ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని చూసేందుకు ఒకరుండాలని ఎదురుచూడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలంతే!
తెలుగులో బిజీ
సతీ లీలావతి సినిమా కోసం కమల్ హాసన్ పక్కన హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత కమల్ ఫోన్ చేసి నా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే తెలుగులో బిజీగా ఉన్నానని చెప్తే నాకోసం ఐదు నెలలు వెయిట్ చేశారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది.
ఆరోగ్యం బాగోలేదని రూమర్స్
ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదని, ఖర్చులకు డబ్బుల్లేక దీన స్థితిలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. మా అక్కవాళ్లందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని కూడా రాసేశారు. కానీ అలాంటివేమీ జరగలేదు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు' అని కోవై సరళ చెప్పుకొచ్చింది.
చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. హీరోయిన్‌కు ఊహించని ప్రశ్న!
Comments
Please login to add a commentAdd a comment