లేడీ కమెడియన్, సీనియర్ నటి కోవై సరళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంబి. తంబిరామయ్య, అశ్విన్ కుమార్, బేబి నీలా, నాంజిల్ సంపత్, ఆండ్రూస్, పళ కరుప్పయ్య, ఆకాశ్, భారతీ కన్నన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 30న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హాట్‌స్టార్ అధికారిక ప్రకటన చేసింది.
కథేంటంటే..
అటవీ ప్రాంతంలో మనవరాలితో ఒంటరిగా జీవిస్తున్న భామ(కోవై సరళ) తేనె అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె మనవరాలిపై ఓ రాజకీయ నాయకుడి కొడుకు, తన స్నేహితులతో కలిసి సామూహిత అత్యాచారం చేస్తాడు. దీంతో ఆ బామ్మ తన మనవరాలికి న్యాయం కోసం పోరాడుతూ అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.
இயற்கை! A Prabhu solomon's Touch
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) January 28, 2023
Get ready to watch #Sembi #SembiOnHotstar #SembiFromFeb3 #Disneyplushotstar @APIfilms @tridentartsoffl @arentertainoffl @prabu_solomon #KovaiSarala @i_amak #ThambiRamaiah @nivaskprasanna @saregamasouth pic.twitter.com/hGaQvcD5Mu
చదవండి: పిల్లగాలి అల్లరి అంటూ తండ్రి పాటకు స్టెప్పులేసిన సితార
Comments
Please login to add a commentAdd a comment