Prabhu Solomon
-
హీరోయిన్గా డైరెక్టర్ కూతురి ఎంట్రీ!
ఇండస్ట్రీలోకి వారసులు రావడం కొత్తేం కాదు. వీళ్లలో కొందరు సక్సెస్ అయి స్టార్స్ అయితే మరికొందరు మాత్రం అనామకంగా మిగిలిపోతుంటారు. తాజాగా మరో ఇద్దరు సెలబ్రిటీల వారసుల తెరంగేట్రానికి రెడీ అయ్యాడు. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే నటి వనితా విజయ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మాజీ భర్త ఆకాశ్‌కు పుట్టిన కొడుకు విజయ్ శ్రీహరి... ఇప్పుడు హీరో అవుతున్నాడు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ కూతురు హేజల్ షైనీ ఇదే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)విజయ్ శ్రీహరి, హేజల్ షైనీ జంటగా ప్రభు సాల్మన్ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'కొక్కీ' మూవీతో కరణ్‌ని, 'మైనా'తో అమలాపాల్, 'కుంకీ'తో విక్రమ్ ప్రభును హీరోగా పరిచయం చేశారు. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 'కాయల్' సినిమాతో ఆనందికి కూడా మంచి పేరు వచ్చేలా చేశారు సాల్మన్. ఇలా చాలామందికి హిట్స్ ఇచ్చిన ప్రభు సాల్మన్ ఇప్పుడు తన కూతురికి కూడా అలానే ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారు.ఇది 'కుంకీ' తరహాలోనే అడవి బ్యాక్ డ్రాప్లో సాగే డిఫరెంట్ సినిమా అని, ఇందులో సింహాం ప్రధాన పాత్రధారిగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్) -
ఓటీటీలో కోవై సరళ చిత్రం, ఎప్పుడు? ఎక్కడంటే?
లేడీ కమెడియన్, సీనియర్ నటి కోవై సరళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంబి. తంబిరామయ్య, అశ్విన్ కుమార్, బేబి నీలా, నాంజిల్ సంపత్, ఆండ్రూస్, పళ కరుప్పయ్య, ఆకాశ్, భారతీ కన్నన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 30న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హాట్‌స్టార్ అధికారిక ప్రకటన చేసింది. కథేంటంటే.. అటవీ ప్రాంతంలో మనవరాలితో ఒంటరిగా జీవిస్తున్న భామ(కోవై సరళ) తేనె అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె మనవరాలిపై ఓ రాజకీయ నాయకుడి కొడుకు, తన స్నేహితులతో కలిసి సామూహిత అత్యాచారం చేస్తాడు. దీంతో ఆ బామ్మ తన మనవరాలికి న్యాయం కోసం పోరాడుతూ అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. இயற்கை! A Prabhu solomon's Touch Get ready to watch #Sembi #SembiOnHotstar #SembiFromFeb3 #Disneyplushotstar @APIfilms @tridentartsoffl @arentertainoffl @prabu_solomon #KovaiSarala @i_amak #ThambiRamaiah @nivaskprasanna @saregamasouth pic.twitter.com/hGaQvcD5Mu — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) January 28, 2023 చదవండి: పిల్లగాలి అల్లరి అంటూ తండ్రి పాటకు స్టెప్పులేసిన సితార -
సర్జరీ నుంచి కోలునేంతవరకు వెయిట్ చేశారు: రానా
కొన్నేళ్ల క్రితం దగ్గుబాటి రానా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడిన విషయం తెలిసిందే. రానా కిడ్నీలు పాడవడం, గుండె సమస్యలతో సతమతమైన రానా ఇటీవల అమెరికాలో చికిత్స తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఆయన సాధారణ స్థితికి వచ్చి హుషారుగా కనిపిస్తున్నాడు.. వివాహం కూడా చేసుకొని మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోయాడు. కాగా ప్రస్తుతం రానా నటిస్తోన్న చిత్రం ‘అరణ్య’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యంపై మాట్లాడారు. అలాగే అరణ్య షూటింగ్ తను కోలుకోవడంలో ఎలా ఉపయోగపడిందో వివరించారు. తను సర్జరీ నుంచి కోలుకునేంత వరకు అరణ్య దర్శకుడు ప్రభు సోలమన్ వెయిట్ చేశారని తెలిపారు. ‘నా సినిమాలు సమస్యలను అధిగమించి హీరోగా ఎదగడానికి నాకు దోహదపడ్డాయి. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ప్రభు సార్ నాకు సమయం ఇచ్చారు. నా కోసం వెయిట్ చేశారు. అందుకు సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నాను. అలాగే నా వైద్యంలో అడవి పెద్ద భాగం అయ్యింది. రీల్ ప్రపంచం గురించి సరదాగా ఉంటుంది. నిజ జీవితంలో ఏం జరిగినా, రీల్ లైఫ్ బాధపడదు. సెట్స్‌లో ఉన్నప్పుడు మన బాధలేవి గుర్తుకు రావు. అందుకే సినిమాలు నన్ను ముందుకు నడుపుతాయని భావిస్తున్నాను.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రానా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'అరణ్య'. విష్ణువిశాల్, పుల్కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియా పిల్‌గావ్ంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్, దర్శకుడు శేఖర్ కమ్ముల హాజరయ్యారు. అరణ్య మూవీ స్పెషల్ ప్రోమోని వెంకటేష్ రిలీజ్ చేశారు. చదవండి: జంతువులకు మాటలొస్తే, మన పరిస్థితి ఏంటి? తనే నా ప్రపంచం: బుమ్రా, సంజన పెళ్లి వీడియో వైరల్ -
జంతువులకు మాటలొస్తే, మన పరిస్థితి ఏంటి?
‘‘పక్షులు, జంతువులు అడవులను అభివృద్ధి చేస్తుంటే మనుషుల మైన మనం ఆ అడవుల్ని నాశనం చేస్తున్నాం.. ప్రకృతిని మనం కాపాడాలి.. లేకుంటే ఆ ప్రకృతి కోపాన్ని తట్టుకోలేం’’ అని దర్శకుడు ప్రభు సాల్మన్ అన్నారు. రానా హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’, హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్ ’ పేర్లతో ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రభు సాల్మన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అరణ్య’ కోసం నాలుగేళ్లు కష్టపడ్డాను. ప్రపంచంలో ఏనుగుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అవి అంతరించిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఏనుగులు గురించి ఇప్పటి వరకూ ఏనుగులతో షూటింగ్ చేయడం చాలా కష్టమైంది.. వాటికి శిక్షణ ఇచ్చి నటింపజేశాం. జంతువులు మన ఇంట్లోకి వచ్చి, ఈ స్థలం నాది? నువ్వు బయటికి వెళ్లు? అంటే మన పరిస్థితి ఏంటి? జంతువులకు మాటలొస్తే మనల్ని ప్రశ్నిస్తాయి.. ఎందుకంటే అవి నివసించే అడవులను, పచ్చని ప్రకృతిని మనం ధ్వంసం చేస్తున్నాం కాబట్టి. మా సినిమా చూశాక కొందరిలోనైనా మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. నేను తీసిన ‘కుమ్కి’ సినిమా చూసిన తర్వాత రానా ఫోన్ చేసి, ఓ సినిమా చేద్దామన్నారు. ‘అరణ్య’ చేయాలనుకున్నప్పుడు రానా గుర్తొచ్చారు.. తనకి కథ చెప్పగానే ఓకే అన్నారు. ఈ సినిమాని థాయిల్యాండ్, కేరళ, సతార్, మహా భలేశ్వరంలోని అడవుల్లో చిత్రీకరించాం. ఏనుగులతో షూటింగ్ చేయడం చాలా కష్టమైంది.. వాటికి శిక్షణ ఇచ్చి నటింపజేశాం. నాకు డబ్బు కంటే ‘అరణ్య’ లాంటి సినిమా తీయడం సంతృప్తిగా ఉంటుంది. ప్రస్తుతం మూడు కథలు చర్చల దశలో ఉన్నాయి. ‘అరణ్య’ విడుదల తర్వాత వాటి గురించి ప్రకటిస్తాను’’ అన్నారు. -
నటుడిగా రానా బాగా ఎదిగాడు: వెంకటేష్
‘‘ప్రకృతితో మనందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనమందరం బాధ్యతగా ఉండాలి. ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ‘అరణ్య’ సినిమా చూశాను. అందరం గర్వపడేలా ఉంది’’ అన్నారు వెంకటేష్. రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘లీడర్’, ‘ఘాజీ’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసిన రానా యాక్టర్‌గా నేర్చుకుంటున్నాడని అనుకున్నాను. కానీ ‘అరణ్య’ సినిమాలోని పాత్రలో తను ఒదిగిపోయిన తీరు చూస్తుంటే.. నటుడిగా బాగా ఎదిగాడనిపించింది. ఇండియన్ స్క్రీన్ పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. జంతువుల హావభావాలను కెమెరాలో షూట్ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్ అండ్ టీమ్ బాగా తీశారు’’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘రానా ఎప్పుడూ విభిన్నమైన సినిమాలే చేస్తాడు. ఈ సినిమాలో తన యాక్టింగ్ సూపర్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘సాధారణంగా నువ్వు ఎవరు? అని తెలుసుకోవాలని అంటారు. కానీ ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో ఈ సినిమా నాకు నేర్పించింది. ప్రభు సాల్మన్ బాగా డైరెక్ట్ చేశాడు. ‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళతారు’’ అని రానా అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగుకి పరిచయమవుతున్నందుకు హ్యాపీ. నేను హైదరాబాద్ అల్లుణ్ణి కానున్నాను. త్వరలో గుత్తా జ్వాల (బ్యాడ్మింటన్ ప్లేయర్), నేను పెళ్లి చేసుకోబోతున్నాం’’ అన్నారు విష్ణు విశాల్. ‘‘మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని వీడియో సందేశం పంపారు ప్రభు.‘‘ప్రాణం, మనసుపెట్టి చేస్తే కానీ ఇలాంటి సినిమాలు రావు. రానా తన జీవితాన్ని మర్చిపోయి ఈ సినిమాలోని పాత్రలో జీవించాడు. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చేందుకు ‘అరణ్య’ ఓ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. ‘‘నేను హైదరాబాదీ అమ్మాయిని. నా ఫస్ట్ తెలుగు మూవీ ‘అరణ్య’. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు జోయా. -
ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. దమ్ముందా?
మనుషులు చాలా తెలివైన జీవులు అనుకుంటాం.. కానీ మనుషుల కన్నా ఏనుగులకే ఎక్కువ తెలివి తేటలున్నాయంటున్నాడు హీరో రానా దగ్గుబాటి. అంతేకాదు, అవి ఎమోషనల్ అని, సో సెంటిమెంటల్ అండ్ కేరింగ్ అని చెప్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన "అరణ్య" సినిమా ట్రైలర్ బుధవారం రిలీజైంది. దీనికి విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ ట్రైలర్లో 'ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్. మనుషులెవరూ లోనికి రాకూడదు' అని చెప్తున్నారు. కానీ రానా సహా మరికొందరు ఆ అడవిలోనే ఏనుగులతో సావాసం చేస్తూ, గజరాజులతో దోస్తీ చేస్తున్నారు. కానీ అటవీశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఓ వ్యక్తి ఆ అడవి చుట్టూ గోడ కట్టించడంతో వివాదం రాజుకుంటుంది. ఆ గోడ వల్ల ఏనుగులు నీటి కోసం వెళ్లే దారి మూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఏనుగులకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్కుండా పోవడంతో రానా ఆ గోడను ధ్వంసం చేసి వాటిని కాపాడేందుకు పోరాడతాడు. అయితే అలుపెరగకుండా పోరాటం చేస్తున్న రానాను ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతుందో అమ్మాయి. దీంతో విసుగెత్తిపోయిన రానా "ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. ఈ హెడ్లైన్ పెట్టే దమ్ముందా?" అని అడుగుతాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్లో రానా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఓ వ్యక్తి కథతో వస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. ట్రైలర్లో చూపించినట్లుగానే ఈ సినిమా అటవీ నిర్మూలన సంక్షోభం గురించి కొత్త చర్చను లేవనెత్తేలా కనిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. రానా మరోవైపు వేణు ఊడుగుల దర్శకత్వంలో "విరాట పర్వం" సినిమా చేస్తున్నాడు. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూ సర్: విజయ్‌కుమార్ చాగంటి. చదవండి: మేకప్ మాయ.. కొత్త లుక్‌లో సినీ తారలు పవన్ సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన 'ఫిదా' బ్యూటీ! -
సీక్వెల్ చాన్స్
‘మెంటల్ మదిలో, టిక్ టిక్ టిక్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ కథానాయిక నివేథా పేతురాజ్. చక్కటి హావభావాలతో పాటు గ్లామర్‌పరంగా మార్కులు కొట్టేశారు. దాంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టేశాయి. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో ఒక సినిమాతో బిజీగా ఉన్నారీ భామ. దానికి తోడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేశారట. 2012లో తమిళ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభుని పరిచయం చేస్తూ దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కుమ్కి’. తెలుగులో ‘గజరాజు’ పేరుతో రిలీజైంది. ఇప్పుడు ‘కుమ్కి’ సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారట దర్శకుడు. ఈ సీక్వెల్లో హీరోయిన్గా నివేథా పేరును పరిశీలిస్తున్నారట. ఫస్ట్ పార్ట్‌లో యాక్ట్ చేసిన విక్రమ్ ప్రభునే ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారు. ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనుంది. -
ప్రేమికులను కలిపిన సునామీ
వేలాదిమంది పొట్టన పెట్టుకుని, లక్షలాదిమందిని భయభ్రాంతులకు గురి చేసిన సునామీ ఒక ప్రేమ జంటను మాత్రం కలిపింది. ఈ అంశంతో తెరకెక్కిన చిత్రం కయల్. మైనా, కుంకి చిత్రాల తరహాలో మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం ఇది. కొన్ని రోజులు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న డబ్బుతో ఆనందంగా దేశ సంచారం చేసే ఒక యువకుడు అచ్చంగా తన లానే ఆలోచించే స్నేహితుడితో కలసి సంతోషంగా కాలాన్ని గడిపేస్తుంటాడు. అలా దేశాటనలో కన్యాకుమారి చేరుకున్న అతనికి అనూహ్య సంఘటనల మధ్య ఒక యువతి తారసపడుతుంది. ఇంతకుముందు ప్రేమించడానికి నచ్చిన అమ్మాయి కంటపడలేదన్న ఆ యువకుడు ఆ యువతిని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆ విషయాన్ని ధైర్యంగా ఆమెతో చెప్పేసి వెళ్లిపోతాడు. ఒక జమీందారు ఇంటిలో పని చేసే ఆ యువతి అతనిపై మనసు పడుతుంది. అయితే అతనెవరో, ఎక్కడ ఉంటాడో తెలియదు. అయినా అతనే తన జీవితం అంటూ ఇల్లు వదలి వచ్చేస్తుంది. ఆ తరువాత ఏమైంది? చివరికి ఎలా భగ్న ప్రేమికులు ఒకటయ్యారా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన కయల్ చిత్ర కథకు దర్శకుడు ప్రభుసాల్మన్ సునామీ నేపథ్యాన్ని అద్భుతంగా వాడుకున్నారు. కొత్త వాళ్లతో పాత్రలకు జీవం పోయించడంలో అందెవేసిన ప్రభుసాల్మన్ ఈ చిత్రంలోనూ ఒక హీరోయిన్ ఆనంది మినహా అందరినీ కొత్తవారినే ఎంచుకున్నారు. చిత్రం చివరి ఘట్టంలో సునామీ సన్నివేశాలు గ్రాఫిక్స్ అయినా అబ్బురపరిచేలా రూపొందించారు. ఆరణాల అచ్చ తెలుగమ్మాయి ఆనంది కథానాయికగా చాలా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. నవ నటుడు చంద్రన్ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. గాడ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ ఎస్.మదన్ విడుదల చేశారు. చిత్రం మంచి ప్రజాదరణతో ప్రదర్శితమవుతోంది. -
ప్రకృతే పెద్ద విలన్
ఇక్కడ ఎవరు పెద్ద వారు కాదు. ప్రకృతే పెద్ద విలన్ అని దర్శకుడు ప్రభు సాల్మన్ తన తదుపరి చిత్రం కయల్ ద్వారా చెప్పనున్నారట. పర్ఫెక్షన్కు నూరు శాతం ప్రాముఖ్యతనిచ్చే దర్శకుడీయన. మైనా, కుంకీ చిత్రాలే ఇందుకు నిదర్శనం. తన ఊహా రచనకు సహజత్వంతో కూడిన హంగులు అద్ది విమర్శకులు సైతం మెచ్చేలా సెల్యులాయిడ్‌పై చిత్రాలను ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు ప్రభుసాల్మన్. తాజా చిత్రంలో కమల్‌ను అద్భుత కావ్యంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి ఆయనతో ముచ్చటిద్దాం. కయల్... ఈ పేరే కవితాత్మకంగా ఉందే? : ఇదొక రొమాంటిక్ కథా చిత్రం. కథకు తగ్గట్టుగా అలాంటి టైటిల్ కోసం ఆలోచించగా హీరోయిన్ పేరు కయల్ రొమాంటిక్‌గా ఉండడంతో దాన్నే టైటిల్‌గా నిర్ణయించాం. కథకు సునామీని నేపథ్యంగా తీసుకున్నారట? దానికంటే ముందు అందరికీ అర్థమయ్యేలా ఒక విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పదలిచాను. సునామీ రావడానికి ముందు రోజు డిసెంబర్ 25న పర్వదినం, వేడుకగా జరుపుకునే రోజు. అలా సంతోషంగా గడిపి 24 గంటలు గడవగానే అలాంటి ఒక దుర్దినం సంభవిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే మీరో, నేనో, ఇంకొకరో ఎవరు పెద్ద వాళ్లు కాదు. ప్రకృతే అందరికంటే పెద్ద విలన్. కొన్ని సెకన్లలోనే లక్షల మంది జీవితాలను అతలాకుతలంచేసి పోయింది. అందుకే జీవిస్తున్నప్పుడే నలుగురికి మంచి చెయ్యండి. ప్రేమతో పలకరించండి. జీవితం అనుభవించడానికే అంటాం. ఇప్పుడు మనం బతకడానికే ప్రయత్నిస్తున్నాం. అయితే బతకడానికి, జీవించడానికి మధ్య వ్యత్యాసం తెలియకుండానే కాలం గడిపేస్తున్నాం. ఈ విషయాన్నే కయల్ చిత్రంలో చెబుతున్నాను. డి.ఇమాన్ మ్యూజిక్ వర్కౌట్ అవుతుందా? మైనా, కుంకీ, చిత్రాల కంటే ఈ చిత్రంలో పాటలకు కొంచెం అధికంగానే ప్రాముఖ్యత ఉంటుంది. ఎలక్ట్రానిక్ సంగీతం కాకుండా అంతా లైవ్ సంగీతాన్ని అందిస్తున్నాం. వంద, నూట యాబై వయలెన్స్, పిల్లన గ్రోవిలాంటి పాత విధానంలో సంగీతం అందించనున్నాం. అలాగే చిత్రాన్ని డాల్పి అట్మాస్‌లో చేయనున్నాం. మీ చిత్రాల్లో నటించిన హీరోయిన్లు టాప్ రేంజ్లో ప్రకాశించడం గురించి? సినిమా అనేది రెండున్నర గంటల మ్యాజిక్. అలాంటి సినిమాలను చూడటానికొచ్చేవారిని థియేటర్లలో కూర్చోపెట్టడానికి ఏదైనా చెయ్యాలి. మనం ఎవరితోనయినా మాట్లాడాలంటే వారి కళ్లు చూసే మాట్లాడతాం. అలా నేను కళ్లు చూసే ఎంపిక చేసిన హీరోయిన్లే అమలాపాల్, లక్ష్మీమీనన్. ఈ కయల్ చిత్ర నాయికి ఆనంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఆనందికి పలు అవకాశాలు వస్తున్నాయి. మైనా, కుంకీ వరసలో కయల్ చేరుతుందా? కయల్ చిత్రం కచ్చితంగా మంచి పేరు సంపాదించి పెడుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు షూటింగ్ కోసం చుట్టి వచ్చాం. సిరపురింజి అడవి ప్రాంతంలోని లొకేషన్స్‌ను ఇంతకు ముందే చిత్రంలోనూ చూసి ఉండరు. బ్రహ్మాండమైన విజువల్స్ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఒక చిత్రం హిట్ అవ్వగానే ఆ దర్శకుడు స్టార్స్ చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో మీరు మాత్రం నూతన తారలతోనే చిత్రాలు తీస్తున్నారే. నా కథలకు ఎలాంటి ఇమేజ్ లేని తారలు కావాలి, కుంకీ చిత్రంలో విక్రమ్ ప్రభును ఎంపిక చేసినప్పుడు ఆయన మావటివాడిలానే కనిపించారు. అలానే నా స్క్రిప్ట్ స్టార్స్‌కు నప్పుతుందంటే వారితోనే సినిమా చేస్తా. అలా చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.