
కొన్నేళ్ల క్రితం దగ్గుబాటి రానా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడిన విషయం తెలిసిందే. రానా కిడ్నీలు పాడవడం, గుండె సమస్యలతో సతమతమైన రానా ఇటీవల అమెరికాలో చికిత్స తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఆయన సాధారణ స్థితికి వచ్చి హుషారుగా కనిపిస్తున్నాడు.. వివాహం కూడా చేసుకొని మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోయాడు. కాగా ప్రస్తుతం రానా నటిస్తోన్న చిత్రం ‘అరణ్య’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యంపై మాట్లాడారు. అలాగే అరణ్య షూటింగ్ తను కోలుకోవడంలో ఎలా ఉపయోగపడిందో వివరించారు.
తను సర్జరీ నుంచి కోలుకునేంత వరకు అరణ్య దర్శకుడు ప్రభు సోలమన్ వెయిట్ చేశారని తెలిపారు. ‘నా సినిమాలు సమస్యలను అధిగమించి హీరోగా ఎదగడానికి నాకు దోహదపడ్డాయి. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ప్రభు సార్ నాకు సమయం ఇచ్చారు. నా కోసం వెయిట్ చేశారు. అందుకు సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నాను. అలాగే నా వైద్యంలో అడవి పెద్ద భాగం అయ్యింది. రీల్ ప్రపంచం గురించి సరదాగా ఉంటుంది. నిజ జీవితంలో ఏం జరిగినా, రీల్ లైఫ్ బాధపడదు. సెట్స్‌లో ఉన్నప్పుడు మన బాధలేవి గుర్తుకు రావు. అందుకే సినిమాలు నన్ను ముందుకు నడుపుతాయని భావిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రానా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'అరణ్య'. విష్ణువిశాల్, పుల్‌కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియా పిల్‌గావ్ంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్, దర్శకుడు శేఖర్ కమ్ముల హాజరయ్యారు. అరణ్య మూవీ స్పెషల్ ప్రోమోని వెంకటేష్ రిలీజ్ చేశారు.
చదవండి:
జంతువులకు మాటలొస్తే, మన పరిస్థితి ఏంటి?
తనే నా ప్రపంచం: బుమ్రా, సంజన పెళ్లి వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment