Aranya Movie
-
అరణ్య స్ట్రీమింగ్: ఈ అర్ధరాత్రి నుంచే..
రానా దగ్గుబాటి, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అరణ్య'. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మార్చి 26న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజ్ అవబోతోంది. దసరా కానుకా అక్టోబర్ 15 నుంచి జీ5లో ప్రసారం కానుంది. దీంతో కరోనా కారణంగా థియేటర్లో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు నేడు అర్ధరాత్రి నుంచి ఎంచక్కా ఫోన్లోనే చూసేయొచ్చు. Premiere Alert !!!#Aranya arrives on @ZEE5India tonight at 12 midnight !!!#RanaDaggubati @ZEE5Telugu pic.twitter.com/VYZZfPQryK — Global OTT (@global_ott) October 14, 2021 ఇక సినిమా కథ విషయానికి వస్తే.. అడవులు, వన్యప్రాణులను సంరక్షిస్తుంటాడు హీరో. అయితే అటవీ శాట మంత్రి 60 ఎకరాల అడవిని నాశనం చేసి అక్కడ డీఆర్ఎల్ టౌన్‌షిప్‌ని నిర్మించాలని భావిస్తాడు. దీనిని ప్రకృతి ప్రేమికుడు అరణ్య ఏ విధంగా అడ్డుకున్నాడు? అనేదే మిగతా కథ. జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి శాంతను సంగీతం అందించారు. చదవండి: Aranya Movie Review : రానా ‘అరణ్య’ మూవీ ఎలా ఉందంటే... -
‘అరణ్య’ మూవీ రివ్యూ
టైటిల్ : అరణ్య నటీనటులు : రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ తదితరులు నిర్మాణ సంస్థ : ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ దర్శకత్వం : ప్రభు సాల్మన్ సంగీతం : శాంతను మొయిత్రా సినిమాటోగ్రఫీ : ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్ డైలాగ్స్ : వనమాలి విడుదల తేది : మార్చి 26, 2021 కథ నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య(రానా దగ్గుబాటి) ప్రకృతి ప్రేమికుడు. అడవులు, వన్యప్రాణులు అంటే ఆయనకు ప్రాణం. ఆయన తాతలు 500 ఎకరాల అడవిని ప్రభుత్వానికి రాసిచ్చెస్తే... ఆయన ఆ అడవికి, అక్కడి వన్యప్రాణులకు సంరక్షకుడిగా ఉంటాడు. లక్షకు పైగా మొక్కలు నాటి రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మాన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు. అడవిలోనే ఉంటూ అక్కడి ఏనుగులకు, గిరిజనులకు అండగా ఉంటాడు. ఇదిలా ఉంటే.. అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్ మహేదేవన్) ఆ అడవి స్థలంపై కన్నుపడుతుంది. అక్కడ డీఆర్ఎల్ టౌన్‌షిప్‌ని నిర్మించాలని భావిస్తాడు. దీని కోసం 60 ఎకరాల అడవిని నాశనం చేయాలనుకుంటాడు. దీనిని ప్రకృతి ప్రేమికుడు అరణ్య ఏ విధంగా అడ్డుకున్నాడు? తన కలల ప్రాజెక్టుకు ఆటంకం కలిగించిన అరణ్యను మంత్రి ఏవిధంగా హింసించాడు? చివరకు అడవిని, ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ. నటీనటులు వైవిధ్యమైన పాత్రలు, కథా చిత్రాల్లో నటించే అతికొద్ది మంది నటుల్లో రానా ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు. పాత్ర ఏదైనా అందులో పరకాయప్రవేశం చేయడం రానా నైజం. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. చెట్లు, ఏనుగుల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా అరణ్య పాత్రలో రానా పరకాయ ప్రవేశం చేశాడు.ఆయన నటకు ఎక్కడా కూడా వంకపెట్టలేము. అరణ్య పాత్ర కోసం రానా పడిన కష్టమంతా సినిమాలో కనిపిస్తుంది. సింగ పాత్రకు విష్ణు విశాల్ న్యాయం చేశాడు. విలేకరిగా శ్రీయా పింగోల్కర్, నక్సలైట్‌గా జోయా హుస్సేన్ పాత్రల నిడివి తక్కువే అయినా.. పర్వాలేదనిపించారు. ఇక విలన్ పాత్రలో మహదేవన్ ఒదిగిపోయాడు. కమెడియన్ రఘుబాబు నిడివి తక్కువే అయినా.. ఉన్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథే ‘అరణ్య’. ప్రేమఖైదీ’, ‘గజరాజు’వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడంతో ‘అరణ్య’పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను దర్శకుడు అందుకోలేకపోయాడు. కథ బాగున్నా.. తెరపై చూపించిన విధానం బాగాలేదు. బలమైన కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ, కథనాన్ని ఎటో తీసుకెళ్లాడు. కథలోకి నక్సలైట్లను ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాదు. అలాగే మహిళా మావోయిస్ట్‌తో సింగ ప్రేమను కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. అడవి జంతువుల కోసం అరణ్య పోరాడుతున్న విధానం ఆకట్టుకునేలా చూపించలేకపోయాడు.అతుకుబొంతలా వచ్చే సన్నివేశాలు సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా సింపుల్‌గా సాగిపోతుందనే భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఏనుగులకు రానాకు మధ్య వచ్చిన ఎమోషనల్ సీన్లు కూడా తేలిపోయినట్లు కనిపిస్తాయి. అరణ్య పాత్రని కూడా ఇంకా బలంగా తీర్చిదిద్దితే బాగుండేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజువల్ ఎఫెక్ట్స్. సినిమా నేపథ్యం అంతా అడవి చుట్టే తిరుగుతుంది. ఎక్కువ శాతం షూటింగ్‌ని అడవి ప్రాంతంలోనే జరిపారు. అడవి అందాలని తెరపై చక్కగా చూపించారు. థియేటర్లో ఉన్నామా లేదా అడవిలో ఉన్నామా అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ ఏఆర్ అశోక్ కుమార్ కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం శాంతను మొయిత్రా సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. వనమాలి రాసిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఎడిటర్ భువన్ శ్రీనివాసన్ చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ రానా నటన కథ విజువల్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ఊహకందేలా సాగే కథనం సాగదీత సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సర్జరీ నుంచి కోలునేంతవరకు వెయిట్ చేశారు: రానా
కొన్నేళ్ల క్రితం దగ్గుబాటి రానా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడిన విషయం తెలిసిందే. రానా కిడ్నీలు పాడవడం, గుండె సమస్యలతో సతమతమైన రానా ఇటీవల అమెరికాలో చికిత్స తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఆయన సాధారణ స్థితికి వచ్చి హుషారుగా కనిపిస్తున్నాడు.. వివాహం కూడా చేసుకొని మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోయాడు. కాగా ప్రస్తుతం రానా నటిస్తోన్న చిత్రం ‘అరణ్య’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యంపై మాట్లాడారు. అలాగే అరణ్య షూటింగ్ తను కోలుకోవడంలో ఎలా ఉపయోగపడిందో వివరించారు. తను సర్జరీ నుంచి కోలుకునేంత వరకు అరణ్య దర్శకుడు ప్రభు సోలమన్ వెయిట్ చేశారని తెలిపారు. ‘నా సినిమాలు సమస్యలను అధిగమించి హీరోగా ఎదగడానికి నాకు దోహదపడ్డాయి. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ప్రభు సార్ నాకు సమయం ఇచ్చారు. నా కోసం వెయిట్ చేశారు. అందుకు సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నాను. అలాగే నా వైద్యంలో అడవి పెద్ద భాగం అయ్యింది. రీల్ ప్రపంచం గురించి సరదాగా ఉంటుంది. నిజ జీవితంలో ఏం జరిగినా, రీల్ లైఫ్ బాధపడదు. సెట్స్‌లో ఉన్నప్పుడు మన బాధలేవి గుర్తుకు రావు. అందుకే సినిమాలు నన్ను ముందుకు నడుపుతాయని భావిస్తున్నాను.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రానా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'అరణ్య'. విష్ణువిశాల్, పుల్కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియా పిల్‌గావ్ంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్, దర్శకుడు శేఖర్ కమ్ముల హాజరయ్యారు. అరణ్య మూవీ స్పెషల్ ప్రోమోని వెంకటేష్ రిలీజ్ చేశారు. చదవండి: జంతువులకు మాటలొస్తే, మన పరిస్థితి ఏంటి? తనే నా ప్రపంచం: బుమ్రా, సంజన పెళ్లి వీడియో వైరల్ -
జంతువులకు మాటలొస్తే, మన పరిస్థితి ఏంటి?
‘‘పక్షులు, జంతువులు అడవులను అభివృద్ధి చేస్తుంటే మనుషుల మైన మనం ఆ అడవుల్ని నాశనం చేస్తున్నాం.. ప్రకృతిని మనం కాపాడాలి.. లేకుంటే ఆ ప్రకృతి కోపాన్ని తట్టుకోలేం’’ అని దర్శకుడు ప్రభు సాల్మన్ అన్నారు. రానా హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’, హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్ ’ పేర్లతో ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రభు సాల్మన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అరణ్య’ కోసం నాలుగేళ్లు కష్టపడ్డాను. ప్రపంచంలో ఏనుగుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అవి అంతరించిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఏనుగులు గురించి ఇప్పటి వరకూ ఏనుగులతో షూటింగ్ చేయడం చాలా కష్టమైంది.. వాటికి శిక్షణ ఇచ్చి నటింపజేశాం. జంతువులు మన ఇంట్లోకి వచ్చి, ఈ స్థలం నాది? నువ్వు బయటికి వెళ్లు? అంటే మన పరిస్థితి ఏంటి? జంతువులకు మాటలొస్తే మనల్ని ప్రశ్నిస్తాయి.. ఎందుకంటే అవి నివసించే అడవులను, పచ్చని ప్రకృతిని మనం ధ్వంసం చేస్తున్నాం కాబట్టి. మా సినిమా చూశాక కొందరిలోనైనా మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. నేను తీసిన ‘కుమ్కి’ సినిమా చూసిన తర్వాత రానా ఫోన్ చేసి, ఓ సినిమా చేద్దామన్నారు. ‘అరణ్య’ చేయాలనుకున్నప్పుడు రానా గుర్తొచ్చారు.. తనకి కథ చెప్పగానే ఓకే అన్నారు. ఈ సినిమాని థాయిల్యాండ్, కేరళ, సతార్, మహా భలేశ్వరంలోని అడవుల్లో చిత్రీకరించాం. ఏనుగులతో షూటింగ్ చేయడం చాలా కష్టమైంది.. వాటికి శిక్షణ ఇచ్చి నటింపజేశాం. నాకు డబ్బు కంటే ‘అరణ్య’ లాంటి సినిమా తీయడం సంతృప్తిగా ఉంటుంది. ప్రస్తుతం మూడు కథలు చర్చల దశలో ఉన్నాయి. ‘అరణ్య’ విడుదల తర్వాత వాటి గురించి ప్రకటిస్తాను’’ అన్నారు. -
త్వరలోనే తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నాను: హీరో
భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే తాను తెలుగింటి అల్లుడిని కాబోతున్నట్లు ప్రకటించాడు విష్ణ విశాల్. అరణ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘‘మూడు భాషల్లో నటిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ జ్వాలా ఎంకరేజ్మెంట్, మద్దతుతో నేను ధైర్యం చేయగలిగాను. అతి త్వరలోనే మేం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం. తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా పెళ్లి తేదిని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ నెల 26న అరణ్య చిత్రం విడుదల కానుంది. దీనిలో విష్ణు విశాల్ మావటి(ఏనుగులను అదుపు చేసే వ్యక్తి) పాత్రలో నటించాడు. రానా హీరోగా నటిస్తున్న అరణ్య చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఒక వ్యక్తి కథ ఇది. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించే సినిమా. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు విష్టు విశాల్. వీరిద్దరికి గతంలోనే వివాహం అయ్యింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరు తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. చదవండి: మాల్దీవుల్లో ప్రేమ పక్షులు.. రొమాంటిక్ ఫోటోస్ ఆనందపు క్షణాలు..తోడు ఉండాల్సిందే -
నటుడిగా రానా బాగా ఎదిగాడు: వెంకటేష్
‘‘ప్రకృతితో మనందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనమందరం బాధ్యతగా ఉండాలి. ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ‘అరణ్య’ సినిమా చూశాను. అందరం గర్వపడేలా ఉంది’’ అన్నారు వెంకటేష్. రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘లీడర్’, ‘ఘాజీ’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసిన రానా యాక్టర్‌గా నేర్చుకుంటున్నాడని అనుకున్నాను. కానీ ‘అరణ్య’ సినిమాలోని పాత్రలో తను ఒదిగిపోయిన తీరు చూస్తుంటే.. నటుడిగా బాగా ఎదిగాడనిపించింది. ఇండియన్ స్క్రీన్ పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. జంతువుల హావభావాలను కెమెరాలో షూట్ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్ అండ్ టీమ్ బాగా తీశారు’’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘రానా ఎప్పుడూ విభిన్నమైన సినిమాలే చేస్తాడు. ఈ సినిమాలో తన యాక్టింగ్ సూపర్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘సాధారణంగా నువ్వు ఎవరు? అని తెలుసుకోవాలని అంటారు. కానీ ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో ఈ సినిమా నాకు నేర్పించింది. ప్రభు సాల్మన్ బాగా డైరెక్ట్ చేశాడు. ‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళతారు’’ అని రానా అన్నారు. ‘‘ఈ సినిమాతో తెలుగుకి పరిచయమవుతున్నందుకు హ్యాపీ. నేను హైదరాబాద్ అల్లుణ్ణి కానున్నాను. త్వరలో గుత్తా జ్వాల (బ్యాడ్మింటన్ ప్లేయర్), నేను పెళ్లి చేసుకోబోతున్నాం’’ అన్నారు విష్ణు విశాల్. ‘‘మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని వీడియో సందేశం పంపారు ప్రభు.‘‘ప్రాణం, మనసుపెట్టి చేస్తే కానీ ఇలాంటి సినిమాలు రావు. రానా తన జీవితాన్ని మర్చిపోయి ఈ సినిమాలోని పాత్రలో జీవించాడు. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చేందుకు ‘అరణ్య’ ఓ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. ‘‘నేను హైదరాబాదీ అమ్మాయిని. నా ఫస్ట్ తెలుగు మూవీ ‘అరణ్య’. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు జోయా. -
ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది
‘‘మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడ్నుంచి ఏమీ తీసుకెళ్లలేం అనే విషయం అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని నాకు ఏనుగు మరోలా చెప్పింది. ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఈ భూమిని నువ్వు చూసుకుంటే అది మళ్లీ నిన్ను చూసుకుంటుందని. ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చేసింది’’ అని రానా అన్నారు. రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, శ్రియా పింగోల్కర్, జోయా హుస్సేన్ ప్రధాన పాత్ర«ధారులు. ఈ నెల 26న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్య క్రమంలో రానా మాట్లాడుతూ– ‘‘సిటీలో పెరిగిన ఓ కుర్రాడు ప్రకృతికి, మనుషులకు జరిగిన పోరాటంలో ఏనుగులను రిప్రజెంట్ చేస్తూ.. వాటిని ఎలా రక్షించాడు? అనే కథతో ‘అరణ్య’ను రూపొందించాం’’ అన్నారు. ‘‘ఐదేళ్లుగా ఏడాదికి 800 ఏనుగుల వరకూ మరణిస్తున్నాయి. దీనికి అడవుల విస్తీర్ణం తగ్గడం ఓ కారణం. రానా ఇందులో ఏనుగుల గొంతుకగా కనిపిస్తారు’’ అన్నారు సాల్మన్ . ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఈరోస్ ప్రతినిధి నందు అహూజా. -
ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. దమ్ముందా?
మనుషులు చాలా తెలివైన జీవులు అనుకుంటాం.. కానీ మనుషుల కన్నా ఏనుగులకే ఎక్కువ తెలివి తేటలున్నాయంటున్నాడు హీరో రానా దగ్గుబాటి. అంతేకాదు, అవి ఎమోషనల్ అని, సో సెంటిమెంటల్ అండ్ కేరింగ్ అని చెప్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన "అరణ్య" సినిమా ట్రైలర్ బుధవారం రిలీజైంది. దీనికి విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ ట్రైలర్లో 'ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్. మనుషులెవరూ లోనికి రాకూడదు' అని చెప్తున్నారు. కానీ రానా సహా మరికొందరు ఆ అడవిలోనే ఏనుగులతో సావాసం చేస్తూ, గజరాజులతో దోస్తీ చేస్తున్నారు. కానీ అటవీశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఓ వ్యక్తి ఆ అడవి చుట్టూ గోడ కట్టించడంతో వివాదం రాజుకుంటుంది. ఆ గోడ వల్ల ఏనుగులు నీటి కోసం వెళ్లే దారి మూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఏనుగులకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్కుండా పోవడంతో రానా ఆ గోడను ధ్వంసం చేసి వాటిని కాపాడేందుకు పోరాడతాడు. అయితే అలుపెరగకుండా పోరాటం చేస్తున్న రానాను ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతుందో అమ్మాయి. దీంతో విసుగెత్తిపోయిన రానా "ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. ఈ హెడ్లైన్ పెట్టే దమ్ముందా?" అని అడుగుతాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్లో రానా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఓ వ్యక్తి కథతో వస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. ట్రైలర్లో చూపించినట్లుగానే ఈ సినిమా అటవీ నిర్మూలన సంక్షోభం గురించి కొత్త చర్చను లేవనెత్తేలా కనిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. రానా మరోవైపు వేణు ఊడుగుల దర్శకత్వంలో "విరాట పర్వం" సినిమా చేస్తున్నాడు. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూ సర్: విజయ్‌కుమార్ చాగంటి. చదవండి: మేకప్ మాయ.. కొత్త లుక్‌లో సినీ తారలు పవన్ సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన 'ఫిదా' బ్యూటీ!