హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ కూతురు! | Director Prabhu Solomon's Daughter New Movie Details | Sakshi
Sakshi News home page

ఇద్దరు వారసులు.. ఒకే సినిమాతో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం!

Published Wed, Jun 12 2024 8:35 AM | Last Updated on Wed, Jun 12 2024 10:08 AM

Director Prabhu Solomon's Daughter New Movie Details

ఇండస్ట్రీలోకి వారసులు రావడం కొత్తేం కాదు. వీళ్లలో కొందరు సక్సెస్ అయి స్టార్స్ అయితే మరికొందరు మాత్రం అనామకంగా మిగిలిపోతుంటారు. తాజాగా మరో ఇద్దరు సెలబ్రిటీల వారసుల తెరంగేట్రానికి రెడీ అయ్యాడు. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే నటి వనితా విజయ కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మాజీ భర్త ఆకాశ్‌కు పుట్టిన కొడుకు విజయ్‌ శ్రీహరి... ఇప్పుడు హీరో అవుతున్నాడు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్‌ కూతురు హేజల్‌ షైనీ ఇదే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.

(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)

విజయ్‌ శ్రీహరి, హేజల్ షైనీ జంటగా ప్రభు సాల్మన్‌ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'కొక్కీ' మూవీతో కరణ్‌ని, 'మైనా'తో అమలాపాల్‌, 'కుంకీ'తో విక్రమ్‌ ప్రభును హీరోగా పరిచయం చేశారు. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 'కాయల్‌' సినిమాతో ఆనందికి కూడా మంచి పేరు వచ్చేలా చేశారు సాల్మన్. ఇలా చాలామందికి హిట్స్ ఇచ్చిన ప్రభు సాల్మన్ ఇప్పుడు తన కూతురికి కూడా అలానే ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారు.

ఇది 'కుంకీ' తరహాలోనే అడవి బ్యాక్ డ్రాప్‌లో సాగే డిఫరెంట్ సినిమా అని, ఇందులో సింహాం ప్రధాన పాత్రధారిగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్‌ రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement