Prabhu Solomon Sembi Movie Kovai Sarala First Look Released, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Kovai Sarala Sembi First Look: షాకింగ్‌ లుక్‌లో కోవై సరళ, ఫొటో వైరల్‌

Published Sat, May 21 2022 9:39 AM | Last Updated on Sat, May 21 2022 10:52 AM

Kovai Sarala First Look Release From Prabhu Solomon Sambi Movie - Sakshi

Kovai Saral Shocking look From Sembi Movie: కోవై సరళ.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన కామెడీతో నవ్వించి లేడీ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. బెసిగ్గా తమిళ నటి అయిన కోవై సరళ టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో లేడీ కమెడియన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గరైంది. చివరిగా 2019లో వచ్చిన అభినేత్రి 2లో కనిపించిన ఆమె కొంతకాలంగా తెరపై కనుమరుగైంది. ఈ నేపథ్యంలో కోవై సరళకు సంబంధించిన ఓ షాకింగ్‌ లుక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తలపై క్లాత్‌ కప్పుకుని 70 ఏళ్ల వృద్దురాలిగా దీన స్థితిలో ఉన్నట్లు కినిపించింది. 

చదవండి:  కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పూజా హెగ్డేకు చేదు అనుభవం

ఎప్పుడూ తెరపై నవ్వుతూ,నవ్విస్తూ ఉంటే కోవై సరళ ఇందులో మాత్రం చాలా సీరియస్‌గా కనిపించింది. అయితే ఇది ఆమె తాజాగా నటించిన తమిళ చిత్రం ‘సెంబి’ లోనిది. ‘అరణ్య’ ఫేమ్ ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమె 70 ఏళ్ల వృద్దురాలుగా నటిస్తోంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఓ బస్సు నేపధ్యంలో 24 మంది ప్రయాణికుల చుట్టూ ఈ కథ నడుస్తోందని, ఇందులో కోవై సరళ సీరియస్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. తంబి రామ‌య్య, అశ్విన్ కుమార్‌తోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ నీల ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. ఈ మూవీని తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement