
కమల్‌తో సెంబి చిత్ర యూనిట్
సాక్షి, చెన్నై: సెంబి చిత్ర యూనిట్‌ను నటుడు కమలహాసన్ అభినందించారు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ ఆర్.రవీంద్రన్, ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ రియా, ఆడిటర్ అక్బర్ అలీ కలిసి నిర్మిస్తున్న చిత్రం సెంబి. నివిన్ కె.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి కోవై సరళ ప్రధాన పాత్రలో, అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
కాగా కమలహాసన్ కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించిన నేపథ్యంలో సెంబి చిత్ర యూనిట్ మంగళవారం నటుడు కమలహాసన్‌ను చెన్నైలోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు అందించింది. ఈ సందర్భంగా సెంబి చిత్ర ట్రైలర్‌ను కమలహాసన్‌కు చూపించారు. ట్రైలర్ చాలా బాగుందని చిత్ర యూనిట్‌ను కమల్ అభినందించడంతో పాటూ నట రాక్షసి అంటూ కోవై సరళను ప్రశంసించారు. కాగా కమలహాసన్ అభినందనలు ఉత్సాహాన్ని కలిగించాయని, త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.