అలియా భట్‌, మృణాల్‌ ఠాకూర్‌ ఆ గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కేది ఎవరికి..? | Alia Bhatt And Mrunal Thakur Who Will Get This Film Chance | Sakshi
Sakshi News home page

అలియా భట్‌, మృణాల్‌ ఠాకూర్‌ ఆ గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కేది ఎవరికి..?

Published Mon, Apr 8 2024 12:49 PM | Last Updated on Mon, Apr 8 2024 1:01 PM

Alia Bhatt And Mrunal Thakur Who Will Get This Film Chance - Sakshi

ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దళపతి విజయ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (గోట్‌) వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. విజయ్‌ రాజకీయ రంగప్రవేశం చేసి, పార్టీని కూడా స్థాపించారు. 2026లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరొక చిత్రం మాత్రమే చేయనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అది ఆయన నటించే 169వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి పలువురు ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించినా, చివరికి హెచ్‌.వినోద్‌ పేరు ఖరారైనట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది.

ఈయన ఇంతకు ముందు ఖాకీ, తెగింపు, వలిమై వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ తరువాత కమలహాసన్‌ కథానాయకుడిగా చిత్రం చేయాల్సింది. దానికి సంబంధించిన కథా చర్చలు కూడా జరిగాయి. అయితే కారణాలేమైనా ఆ చిత్రం డ్రాప్‌ అయ్యింది. తాజాగా విజయ్‌ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన చెప్పిన కథకు విజయ్‌ చాలా ఇంప్రెస్‌ అయ్యారని సమాచారం. ఈ రేర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది.

ఇందులో నటించే హీరోయిన్‌ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. రూ.10 కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్‌ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని యూనిట్‌ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లిస్ట్‌లో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార లేదట. ఇకపోతే బాలీవుడ్‌ భామ అలియా భట్‌, మృణాళ్‌ ఠాకూర్‌, త్రిష, సమంతలలో ఒకరిని ఎంపిక చేయడానికి వారితో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. త్రిష, సమంత ఇప్పటికే విజయ్‌ సరసన నటించారు. కాబట్టి ఇప్పటి వరకూ విజయ్‌తో జతకట్టని నటిని ఇందులో నటింపజేసే ఆలోచనలో యూనిట్‌ వర్గాలు ఉన్నట్లు సమాచారం.

నటి అలియాభట్‌, మృణాళ్‌ఠాకూర్‌ ఇప్పటి వరకూ నేరుగా తమిళ చిత్రాల్లో నటించలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో అలియాభట్‌, సీతారామం మృణాళ్‌ ఠాకూర్‌లో తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ రెండు అనువాద చిత్రాలేనన్నది గమనార్హం. దీంతో బాలీవుడ్‌ భామ అలియాభట్‌ గానీ, మృణాళ్‌ ఠాకూర్‌ గానీ విజయ్‌ 69వ చిత్రంలో నటించే చాన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. వీరిలో ఆ అదృష్టం ఎవరికి లభిస్తుందన్నదే తాజాగా జరుగుతున్న చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మేలో వెలువడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement