![Mrunal Thakur Upcoming Movies](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/mrunal-thakur.jpg.webp?itok=nKV-HL2i)
ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలన్నది సామెత. ఇందుకు విరుద్ధంగా జరిగితే అంతా తారుమారే. నటి మృణాల్ ఠాకూర్‌ది ఇంచుమించు ఇదే పరిస్థితి. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఉత్తరాది భామ ఈమె. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించిన తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ చిత్రాలు నటిస్తుండగానే తెలుగులో సీతారామం మూవీలో నటించే అవకాశం వరించింది. అందులో నటుడు దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించారు. అది చాలా ట్రెడిషనల్ పాత్ర. ఆ పాత్రలో ఈ భామ ఒదిగి పోవడం, చిత్రం ఘనవిజయాన్ని సాధించడంతో నటి మృణాల్ ఠాకూర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి.
ఈ క్రమంలో నటుడు నానితో జత కట్టిన 'హాయ్ నాన్న' చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాంటి సమయంలో కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. శివ కార్తికేయన్ కు జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించే పెద్ద అవకాశం తలుపు తట్టింది. అయితే కారణాలేమైన ఆ అవకాశాన్ని ఈ అమ్మడు చేజార్చుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ కోలీవుడ్‌లో అవకాశం రాలేదు. అంతేకాకుండా ఆ తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ మెన్ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_438.jpg)
గ్లామర్ విషయంలో ఎంతగా హద్దులు మీరినా, దక్షిణాదిలో నటి మృణాల్ ఠాకూర్ దాదాపు కనుమరుగైన పరిస్థితి. మళ్లీ దక్షిణాదిలో కనిపించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఆమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ అభిమానులు తన కథాపాత్రలను ఆదరిస్తున్నారని అందువల్ల వారికి నచ్చే విధంగా కథాపాత్రలను ఎంపిక చేసుకునే విషయంలో ఆచి చూసి అడిగేస్తున్నానని చెప్పారు. ఒక చిత్రంపై పూర్తిగా దృష్టి పెట్టకుండా పలు చిత్రాలను అంగీకరించే మనస్తత్వం తనదు కాదని పేర్కొన్నారు. అందుకే మంచి కథ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు నటి మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment