సూపర్‌స్టార్ చిత్ర రీమేక్‌లో లారెన్స్ | Lawrence in superstar movie remake | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్ చిత్ర రీమేక్‌లో లారెన్స్

Published Fri, Nov 4 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

సూపర్‌స్టార్ చిత్ర రీమేక్‌లో లారెన్స్

సూపర్‌స్టార్ చిత్ర రీమేక్‌లో లారెన్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం మూండ్రుముఖం. ఇందులో రజనీకాంత్ త్రిపాత్రాభినయంలో అదరగొట్టారు. ఈ చిత్ర రీమేక్‌లో నటించాలని ఇళయదళపతి విజయతో సహా పలువురు ఆకాంక్షను వ్యక్తం చేశారు. చివరికి ఆ అదృష్టం నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్‌‌సను వరించింది. ఈయన సూపర్‌స్టార్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. లారెన్‌‌స నటించనున్న మూండ్రుముఖం రీమేక్ చిత్రాన్ని శ్రీరాఘవేంద్ర ప్రొడక్షన్‌‌స సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం.

 సుమారు వంద కోట్లు వసూలు చేసిన కాంచన- 2 చిత్రం తరువాత లారెన్‌‌స మెట్టశివ కెట్టశివ, శివలింగ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసి మూండ్రుముఖం చిత్ర రీమేక్‌కు సిద్ధం అవుతారన్న మాట. ఇంకా పేరు నిర్ణరుుంచని ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఇంతకు ముందు తిగర్‌తండా వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శ్రీ మీనాక్షి క్రిమేషన్‌‌స అధినేత ఎం. కదిరేశన్ భాగం పంచుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement