దడ పుట్టిస్తా!
‘దడ పుట్టిస్తా.. నీకు దడ పుట్టిస్తా..’ అనే పాట చాలామందికి గుర్తుండే ఉంటుంది. లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘డాన్’లోని పాట ఇది. మరి.. ఈ పాట మహత్యమో ఏమో అప్పటి నుంచి మొన్నటి ‘శివలింగ’ వరకూ లారెన్స్ నిజంగానే దడ పుట్టిస్తున్నారు . ముని, కాంచన, గంగ, శివలింగ... ఇలా వరుసగా హారర్ థ్రిల్లర్స్ చేసి, ప్రేక్షకులకు దడ పుట్టిస్తున్నారు.
ఈ చిత్రాలు వసూళ్ల సునామీతో బాక్సాఫీస్‌ని దడదడ లాడిస్తున్నాయి. ఇప్పుడు లారెన్స్ మరో హారర్ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో లారెన్స్‌తో కలిసి కాజల్ అగర్వాల్ కూడా దడ పుట్టించనున్నారట. ఇటీవల ‘జాగ్వార్’ని తెరకెక్కించి న దర్శకుడు మహాదేవ్ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తారట. ఇప్పటివరకూ హారర్ చిత్రాల్లో నటించని కాజల్ ఈ చిత్రానికి అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా.