18లో ఒకటి... 19లో మరొకటి! | Kajal Aggarwal to be Lawrence's heroine? | Sakshi
Sakshi News home page

18లో ఒకటి... 19లో మరొకటి!

Published Sun, May 21 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

18లో ఒకటి... 19లో మరొకటి!

18లో ఒకటి... 19లో మరొకటి!

ఓ కథ 18వ శాతాబ్దంలో, మరో కథ 19వ శతాబ్దంలో జరుగుతుంది. ఈ రెండు కథలు కలిస్తే ఓ సినిమా వస్తుందట! విజయేంద్ర ప్రసాద్‌ ‘బాహుబలి’ కథ రాస్తే, ఆయన తనయుడు రాజమౌళి రెండు సినిమాలుగా తీశారు. ‘మిత్రుడు, జాగ్వార్‌’ సినిమాలు తీసిన రాజమౌళి శిష్యుడు మహదేవ్, ఇప్పుడాయన రాసిన రెండు కథలను ఓ సినిమాగా తీయనున్నారట.

తెలుగు, తమి భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో రాఘవా లారెన్స్‌ హీరో. పీరియాడికల్‌ డ్రామాగా కమర్షియల్‌ ఫార్మాట్‌లో రూపొందనున్న ఈ సినిమాలో కొంత భాగం 18వ శతాబ్దంలో, మిగతాది 19వ శతాబ్దంలో జరుగుతుందని సమాచారం. దీనికి హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ పేరు పరిశీలనలో ఉందట. లారెన్స్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించబోయే సినిమా ఒకటి సెప్టెంబర్‌లో మొదలవుతుందట. ముందు ఆ సినిమాను పూర్తి చేసి, తర్వాత ఈ సినిమాను స్టార్ట్‌ చేస్తారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement