చెన్నై ప్రజలకు సినీ ప్రముఖుల చేయూత | kollywood celebrities reaction in chennai rains | Sakshi
Sakshi News home page

చెన్నై ప్రజలకు సినీ ప్రముఖుల చేయూత

Published Wed, Dec 2 2015 10:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

చెన్నై ప్రజలకు సినీ ప్రముఖుల చేయూత

చెన్నై ప్రజలకు సినీ ప్రముఖుల చేయూత

జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న భారీవర్షాల నుంచి చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ సామాన్య ప్రజలతో పాటు సినీ తారలు కూడా కోరుతున్నారు. తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించటంతో పాటు అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కోరుతున్నారు. సిద్దార్థ, లారెన్స్ లాంటి మరికొంత మంది ప్రత్యక్షంగా సాయం చేయడానికి రెడీ అవుతున్నారు.

వర్షాలు, వరదలు కారణంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజానీకానికి సాయం చేయడానికి హీరో సిద్దార్ధ్ ముందుకు వచ్చాడు. ఆహార పొట్లాలను ఇవ్వదలచిన వారు తనకు ఫోన్ చేయాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిద్దార్థ్, సాయం చేసే ఉద్దేశం లేనివారు ఇంట్లోనే ఉండాలంటూ కోరాడు. అలాంటి వారు రోడ్ల మీదకు రావడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశాడు. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితిని కూడా తన ట్విట్టర్లో తెలిపాడు సిద్దార్ధ్.

మరో తమిళ స్టార్ లారెన్స్ కూడా చెన్నై వర్షాలపై స్పందించాడు. చాలాకాలంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లారెన్స్.. చెన్నై వరద బాధితుల కోసం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు. వీరితో పాటు కుష్బూ, ఐశ్వర్య ధనుష్, అనిరుధ్, సౌందర్య రజనీకాంత్, విశాల్, అమీజాక్సన్ లాంటి కోలీవుడ్ స్టార్స్, ఇంకా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా చెన్నై పరిస్థితి పై ట్విట్టర్లో స్పందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement