
హీరోగా లారెన్స్ తమ్ముడు
వారసుల పట్టికలో మరో హీరో చేరనున్నారు. డాన్సర్ స్థాయి నుంచి నిరంతర శ్రమతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఎదిగి ఇటీవల విడుదలైన కాంచన-2 చిత్రంతో ఆల్‌టైం రికార్డు సాధించిన లారెన్స్ తాజాగా తన తమ్ముడు ఎల్విన్‌ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. ఎల్విన్ ఇప్పటికే కాంచన-2 చిత్రంలో సిల్లోట్ట పిల్లోట్ట అనే పాటలో తన అన్నయ్య లారెన్స్‌తో కలిసి ఆడి ప్రేక్షకుడి ప్రశంసలు పొందారు.
ఇప్పుడు హీరోగా పరిచయం అవ్వడానికి రంగం సిద్ధమైంది. ఈయన కోసం లారెన్స్ పలువురు దర్శకుల నుంచి కథలు వింటున్నారు. త్వరలోనే ఎల్విన్ హీరోగా నటించే చిత్రం గురించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు లారెన్స్ తెలిపారు. అన్నట్టు ఎల్విన్ నృత్యంతో పాటు సిక్స్‌ప్యాక్ బాడీతో తయారయ్యారు.