లారెన్స్కు జంటగా అనుష్క? | anushka and raghava Lawrence in p.vasu direction | Sakshi
Sakshi News home page

లారెన్స్కు జంటగా అనుష్క?

Published Sat, Mar 19 2016 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

లారెన్స్కు జంటగా అనుష్క?

లారెన్స్కు జంటగా అనుష్క?

ఒక క్రేజీ కాంబినేషన్‌తో భారీ చిత్రానికి కోలీవుడ్‌లో అడుగులు పడుతున్నాయన్నది తాజా సమాచారం.డాన్సింగ్ కింగ్,సంచలన విజయాల దర్శక నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్, అందాల ముద్దుగుమ్మ అనుష్క జంటగా ఒక భారీ చిత్ర నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.తమిళంలో మన్నన్, చంద్రముఖి వంటి పలు సూపర్‌హిట్ చిత్రాల సృష్టికర్త పి.వాసు ఈ మధ్య కన్నడం, తెలుగు చిత్రాలపై దృష్టి సారించారు. కన్నడంలో ఈయన రవిచంద్రన్ నవ్యానాయర్ జంటగా దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ తరువాత శివరాజ్‌కుమార్ వేదిక హీరోహీరోయిన్లుగా శివలింగ చిత్రానికి దర్శకత్వం వహించారు. అది అక్కడ ఘన విజయం సాధించింది. దీన్ని తమిళ రీమేక్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది.

ఆయనకు దర్శకుడు పి.వాసు ప్రత్యేకంగా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి చూపించడంతో ఈ ప్రచారం జరిగింది. తాజా శివలింగ తమిళ రీమేక్‌లో లారెన్స్‌ను హీరోగానూ ఆయనకు జంటగా నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. శివలింగ చిత్రం కన్నడంలో పెద్ద విజయం సాధించింది కనుక దాని రీమేక్‌లో నటించడానికి లారెన్స్,అనుష్క అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని తెలుస్తోంది. దీనికి    చంద్రముఖి-2 అని టైటిల్‌ను నిర్ణయించనున్నట్లు సమాచారం. అయితే లారెన్స్ ప్రస్తుతం మొట్టశివ కెట్టశివ చిత్రంలో నటిస్తున్నారు.నటి అనుష్క బాహుబలి-2, ఎస్-3  చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక శివలింగ చిత్ర రీమేక్ విషయం గురించి అధికారిక వార్త వెల్లడికాలేదన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement