అనుష్కకు చెల్లెలవుతున్న రితికా | ritika singh act to anushka sister role | Sakshi
Sakshi News home page

అనుష్కకు చెల్లెలవుతున్న రితికా

Published Mon, Apr 3 2017 3:10 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

అనుష్కకు చెల్లెలవుతున్న రితికా

అనుష్కకు చెల్లెలవుతున్న రితికా

కథానాయకి ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న కథాచిత్రాలు ఇటీవల కాస్త పెరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇద్దరు కథానాయికల సెంట్రిక్‌ కథా చిత్రాలు రావడం  అరుదైన విషయమే. త్వరలో అలాంటి యాక్షన్‌ కథా చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఇందులో స్వీటీ అనుష్క, బ్యూటీ రితికాసింగ్‌ కలిసి నటించనున్నట్లు తెలిసింది. లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలకు పేరుగాంచినది నటి అనుష్క అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అరుంధతి, రుద్రమదేవి చిత్రాలు తన నటనాచాతుర్యానికి నిదర్శనం. బాహుబలి చిత్రంలో దేవసేనగా పరిమిత పాత్రలో అయినా తన ఉనికిని చాటుకున్న అనుష్క దానికి సీక్కెల్‌ బాహుబలి–2లో మరో సారి కత్తిపట్టి విజృంభించనున్నారు.

అదే విధంగా భాగమతి అనే మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటిస్తున్న అనుష్క తాజాగా మరో నూతన చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఒక ఇరుదుచుట్రు చిత్రంతో ఒకేసారి హిందీ, తమిళ భాషల్లో పరిచయమైన రియల్‌ బాక్సర్‌ రితికాసింగ్‌ తొలి చిత్రంలోనే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత నటించిన ఆండవన్‌ కట్టళై చిత్రం ఇటీవల ఇరుదుచుట్రుకు రీమేక్‌గా తెరకెక్కిన తెలుగు చిత్రం గురు చిత్రాలు తన ఖాతాలో సక్సెస్‌ఫుల్‌గా నిలిచాయి. ఇక లారెన్స్‌కు జంటగా నటించిన శివలింగ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. దీంతో రితికాసింగ్‌ కూడా తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అనుష్కకు చెల్లెలిగా నటించడానికి రెడీ అవుతున్నారట. ఇద్దరికీ ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో యాక్షన్‌ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement