రజనీ పాత్రలో లారెన్స్ | P Vasu and Lawrence begin their next | Sakshi
Sakshi News home page

రజనీ పాత్రలో లారెన్స్

Published Tue, Jul 19 2016 9:04 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

రజనీ పాత్రలో లారెన్స్

రజనీ పాత్రలో లారెన్స్

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పాత్రలో మరో నటుడు కనిపించాలని నిర్ణయించుకోవటం సాహసమే. అయితే ఆ సాహసానికి రెడీ అవుతున్నాడు కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో లారెన్స్. ఇటీవల వరుసగా హర్రర్ సినిమాలతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను భయపెడుతున్న లారెన్స్ ప్రస్తుతం పటాస్ సినిమా రీమేక్గా తెరకెక్కుతున్న మొట్ట శివ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత మరోసారి తనకు బాగా కలిసొచ్చిన హర్రర్ జానర్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటి వరకు తన దర్శకత్వంలోనే హర్రర్ సినిమాలు చేసిన లారెన్స్, ఈ సారి చంద్రముఖి ఫేం పి.వాసు దర్శకత్వంలో నటిస్తున్నాడు. చంద్రముఖి సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈసినిమాను ముందుగా రజనీతోనే చేయాలని భావించినా.., రజనీకాంత్ ఇంట్రస్ట్ చూపించకపోవటంతో లారెన్స్కు ఫిక్స్ అయ్యారు. అనుష్క హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement