పటాస్ పోలీస్గా లారెన్స్ | Lawrence in Paraas remake | Sakshi
Sakshi News home page

పటాస్ పోలీస్గా లారెన్స్

Published Sat, Mar 12 2016 11:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

పటాస్ పోలీస్గా లారెన్స్

పటాస్ పోలీస్గా లారెన్స్

2015లో టాలీవుడ్ ఘనవిజయం సాధించిన యాక్షన్ ఎంటర్టైనర్ పటాస్. కళ్యాణ్ రామ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా మూవీ ఘనవిజయం సాధించింది. కళ్యాణ్ రామ్ కెరీర్ను టర్న్ చేసిన ఈ సినిమాను కన్నడ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటిస్తుండగా, తమిళ్లో సూపర్ ఫాంలో ఉన్న లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే తమిళ వర్షన్ షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల తన ట్విట్టర్లో రిలీజ్ చేశాడు లారెన్స్. తెలుగు వర్షన్లో హీరో లుక్కు భిన్నంగా లారెన్స్ తన మార్క్ చూపించాడు. తెలుగు సినిమాలో క్యారెక్టరైజేషన్లో మాత్రమే రెండు షేడ్స్ చూపించగా, లారెన్స్ లుక్లో కూడా రెండు వెరియేషన్స్ చూపిస్తున్నాడు. పూర్తి మాస్ అప్పీల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'మొట్ట శివ కెట్ట శివ' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సమ్మర్లోనే పటాస్ తమిళ్ రీమేక్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement