ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశా.. | police getup to Actress Nikki galrani | Sakshi
Sakshi News home page

ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశా..

Published Sat, Apr 30 2016 3:09 AM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశా.. - Sakshi

ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశా..

ఆ పాత్ర కోసం చాలా కసరత్తు చేశానంటోంది నటి నిక్కీగల్రాణి. ఇంతకీ ఈ అమ్మడు చెప్పొచ్చేదేమిటనేగా మీ భావన. కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్లలో నిక్కీగల్రాణి ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. డార్లింగ్ అంటూ జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రొమాన్స్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం మూడు, నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. లారెన్స్‌కు జంటగా మొట్టశివ కెట్టశివ చిత్రంతో పాటు జీవీ ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి కడవుళ్ ఇరుక్కాన్ కుమారు చిత్రాన్ని పూర్తి చేశాననీ చెప్పింది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాల్లోనూ తనకు నటనకు అవకాశం ఉన్న పాత్రలో లభించడం సంతోషంగా ఉందని అంది. ఒకే రకం మూస పాత్రలు చేయడం తనకు ఇష్టం ఉండదనీ, అదే విధంగా నటించిన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పకుంటేనే ఆ పాత్రలకు న్యాయం చేకూరుతుందనీ పేర్కొంది. తాను తదుపరి ఘట్టానికి చేరుకోవచ్చునని అంది. అందుకే తన చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని చెప్పింది. ప్రస్తుతం వేలన్నువందుటా వెళ్లక్కారన్ చిత్రంలో నటిస్తున్నాననీ తెలిపింది. ఇందులో తాను పోలీస్ అధికారిగా నటిస్తున్నాననీ, ఇందు కోసం చాలా కసరత్తు చేశాననీ చెప్పింది.పోరాట సన్నివేశాలు ఉండడంతో ఫైట్స్‌లో శిక్షణ పొందాననీ, పోలీస్ గెటప్ కోసం తన శారీరక భాషను చాలానే మార్చుకున్నాననీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement