డబ్బింగ్ రైట్స్‌కు 25 కోట్లు | bandla ganesh bets 25 crore on Lawrence Bhairava | Sakshi
Sakshi News home page

డబ్బింగ్ రైట్స్‌కు 25 కోట్లు

Published Tue, Feb 23 2016 12:55 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

డబ్బింగ్ రైట్స్‌కు 25 కోట్లు

డబ్బింగ్ రైట్స్‌కు 25 కోట్లు

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న బండ్ల గణేష్ కొన్నాళ్లుగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్నాడు. తిరిగి ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని భావించినా స్టార్ హీరోల డేట్స్ లేకపోవటంతో విరమించుకున్నాడు. అయితే తాజాగా డబ్బింగ్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడ్డుతున్నాడు గణేష్.

ఇప్పటికే మళయాల సూపర్ హిట్ సినిమా 'టు కంట్రీస్' రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న బండ్ల గణేష్, తెలుగులో ఓ స్టార్ హీరోతో ఆ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీంతోపాటు మరో తమిళ సినిమా డబ్బింగ్ రైట్స్ను కూడా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు గణేష్. లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భైరవ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ను 25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నాడు.

ముని, కాంచన, గంగ సినిమాలతో కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా మంచి విజయాలు నమోదు చేసిన లారెన్స్, అదే జానర్లో భైరవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గంగ సినిమా తెలుగులో 18 కోట్లకు పైగా బిజినెస్ చేయటంతో నెక్ట్స్ సినిమాకు అంతకుమించి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే భారీ మొత్తానికి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ను తీసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement