Bhairava
-
ఆగస్టు 15న దేవర నుంచి బిగ్ అప్డేట్
-
బాహుబలి వర్సెస్ బుజ్జి
-
కలైజ్ఞానం నివాసానికి రజనీకాంత్
సాక్షి, చెన్నై : ప్రముఖ నిర్మాత-రచయిత కలైజ్ఞానం నివాసానికి దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం విచ్చేశారు. కలైజ్ఞానం, ఆయన కుటుంబసభ్యులు ...రజనీకాంత్‌ను సాదరంగా ఆహ్వానించారు. కాగా రజనీకాంత్ ఆదిలో ప్రతినాయకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి రోజుల్లో ఆయనను హీరోగా పరిచయం చేసి ‘భైరవి’ (1978) అనే చిత్రాన్నికలైజ్ఞానం నిర్మించారు. ఆ చిత్రం రజనీకాంత్ సినీ జీవితాన్నే మార్చేసింది. అలాంటి నిర్మాత నివసించడానికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తున్న కలైజ్ఞానంకు... రజనీకాంత్ సుమారు రూ.కోటి విలువ చేసే ఇంటిని కానుకగా ఇచ్చారు. ఆ నివాసానికే ఇవాళ రజనీకాంత్ వెళ్లారు. దీంతో రజనీ తన నివాసానికి రావడంతో కలైజ్ఞానం సంతోషం వ్యక్తం చేశారు. -
మన జిల్లాలో అరుదైన శాసనం..!
సాక్షి, కడప కల్చరల్ : మన జిల్లాలో మరో శాసనం వెలుగుచూసింది. కడప నుంచి గండి వాటర్ వర్క్స్‌కు వెళ్లే దారిలో తూర్పునగల గుట్టపై మగ్దూమ్ సాహెబ్ కొట్టాల గ్రామంలో పురాతన శాసనం వెలుగులోకి వచ్చింది. యానాదులు ఉంటున్న ఈ గ్రామం కడప నగరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి పురాతనమైన శిథిలమై మొండిగోడలు మాత్రమే మిగిలి ఉన్న ఆలయంలో మూడేళ్ల క్రితం వరకు భైరవేశ్వరస్వామి విగ్రహం తల మాత్రమే ఉండేది. దానికి స్థానికులు పూజలు చేసేవారు. కాగా 2015లో కడపకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు, ‘బాసట స్వచ్ఛంద సంస్థ’ అధ్యక్షులు మేరువ బాలాజీరావు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన సభ్యులతో కలిసి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించారు. భైరవేశ్వరుని నూతన విగ్రహాన్ని తయారు చేయించి మూలవిరాట్టుగా ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో కనిపించిన భైరవేశ్వరుని శిథిల మూలమూర్తి, ఇతర దేవతా విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రహరీగా నిలిపారు. వెలుగు చూసిందిలా... బాలాజీరావు ద్వారా సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వివరాలుగల శాసనాలు, ఇతర ఆనవాళ్ల గురించి ఆరా తీశారు. ఆలయం ఎదురుగా ముళ్లపొదల్లో ఉన్న శాసనాన్ని స్థానికులు బయటకు తీశారు. అందులోని లిపిని గమనించిన సాక్షి ప్రతినిధి దాన్ని చరిత్ర పరిశోధకులు విద్వాన్ కట్టా నరసింహులుకు పంపారు. ఆయన దాన్ని పరిశీలించి ఆ బండపై ‘శ్రీ సమరాదిత్య’ అన్న అక్షరాలు ఉన్నాయని తెలిపారు. ఆ పురాతన లిపిని మరింత స్పష్టంగా పరిశీలించేందుకు మైసూరు పురాతత్వశాఖ ప్రతినిధులకు పంపారు. దాంతో పాటు మరో ఇద్దరు చారిత్రక పరిశోధకులకు కూడా పంపారు. కాగా ఇంతవరకు చేసిన పరిశోధనలో జిల్లాలోని పెద్దముడియం గ్రామాన్ని సమరాదిత్య తదితర ప్రభువులు పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆలయం వద్ద లభించిన బండపై గల అక్షరాలు తక్కువే అయినా దీని ద్వారా జిల్లాకు సంబంధించిన మరింత చరిత్ర లభించే అవకాశం ఉందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు, చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. చరిత్ర వెలుగులోకి వస్తుంది... ఈ గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామి ఆలయాన్ని చూసిన పెద్దలంతా ఇది పురాతనమైన ఆలయమని చెబుతున్నారు. ప్రస్తుతం లభించిన ఈ శాసనంలోని వివరాలు తెలిస్తే గ్రామచరిత్రతోపాటు జిల్లా చరిత్ర కూడా మరికొంత వెలుగుచూసే అవకాశం ఉంది. – మేరువ బాలాజీరావు, అధ్యక్షులు, బాసట స్వచ్ఛంద సేవా సంస్థ, కడప -
స్టార్ హీరో సరసన మరో ఛాన్స్
టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సంక్రాంతి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి సినిమాతో పాటు కోలీవుడ్‌లో సూర్య సరసన నటించిన గ్యాంగ్ సినిమాలు సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరోసారి కోలీవుడ్ టాప్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది కీర్తిసురేష్. ఇలయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో విజయ్ సరసన భైరవ సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
విజయ్ కోసం.. కుంచె పట్టిన కీర్తీ
తమిళసినిమా: హీరోలంటే పడిచచ్చే అభిమానుల్లో చాలా మంది సెలబ్రిటీలు ఉంటారనడానికి చిన్న ఉదాహరణ నటి కీర్తీసురేశ్. అనతికాలంలోనే విజయ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్‌తో నటించే స్థాయికి ఎదిగిన లక్కీ బ్యూటీ కీర్తీసురేశ్. విజయ్‌కి జంటగా భైరవా చిత్రంలో నటించిన ఈ భామ తాజాగా సూర్యతో తానాసేర్న్‌ద కూటం చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. త్వరలో సామి– 2లో విక్రమ్‌తో డ్యూయెట్లు పాడటానికి సిద్ధం అవుతోంది. నటి కాక ముందు కీర్తీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. ఇప్పుడు తన చిత్రాలకు తానే దుస్తులు డిజైన్ చేసుకుంటారట. కాగా ఈ అమ్మడు నటుడు విజయ్‌కి వీరాభిమాని అట. ఇటీవల విజయ్ పుట్టిన రోజును జరుపుకున్నారు. అయితే ఆయనకు ఏలాంటి గిప్ట్ ఇవ్వాలన్న ఆలోచనలతో మునిగిపోయిన కీర్తీసురేశ్ తనకు తెలిసిన విద్యకు పని చెప్పారట. మంచి పెయింటింగ్ నాలెడ్జ్ ఉన్న కీర్తీ విజయ్ రూపాన్ని క్యాన్వాస్పై ఆవిష్కరించి పుట్టిన రోజు కానుకగా ఆయనకు పంపించారట. అందులో కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో బ్లాక్ ఫేడ్లో స్టైలిష్‌గా నడిచివస్తున్న విజయ్ ప్రతిరూపం కనిపిస్తోంది. ఈ పెయింటింగ్ కింద మీ విజయం కోనసాగాలి లక్షలాది మీ అభిమానుల్లో నేనూ ఒకరిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని రాశారు. ఈ పెయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అభిమాన నటుడి కోసం కీర్తి గిఫ్ట్
స్టార్ హీరోల అభిమానుల లిస్ట్ సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఉంటారు. ముఖ్యంగా తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న కోలీవుడ్ హీరో విజయ్ లాంటి హీరోలకు ఈ లిస్ట్ మరింత భారీగా ఉంటుంది. గురువారం ఈ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ ఓ గిఫ్ట్ రెడీ చేసింది. తన అభిమాన నటుడి కోసం తానే స్వయంగా ఓ కలర్ పెయింటింగ్‌ను రెడీ చేసింది. ఆ పెయింటింగ్ ఫొటోలను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకుంది. విజయ్ కి వీరాభిమని అయిన కీర్తి సురేష్ ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన భైరవ సినిమాతో ఆయనకు జోడిగా నటించింది. A small art work I did for @actorvijay sir #HBDThalapathy 😊🙏 pic.twitter.com/M2XDNtneMG — Keerthy Suresh (@KeerthyOfficial) 22 June 2017 -
3 సీకి తక్కువ కాకుండా చూసుకోండి!
3 సీ తక్కువ కాకుండా చూసుకోండి అంటోంది నటి కీర్తీసురేశ్. ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మాలీవుడ్ బ్యూటీ కీర్తీసురేశ్.ఆ చిత్రం ఓకే అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. దీంతో యమ క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు అనూహ్యంగా ఇళయదళపతితో భైరవా చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. అంతకు ముందే ధనుష్‌తో తొడరి చిత్రంలో నటించి తన వరకూ మంచి మార్కులు కొట్టేసింది. అయితే విజయ్‌తో నటించిన భైరవా చిత్రంపై కీర్తీసురేశ్ చాలా ఆశలనే పెట్టుకుంది.అయితే తను ఆశంచిన పేరు ఆ చిత్రం అందించలేదనే చెప్పాలి.అయినా టాలీవుడ్ కీర్తీని సక్సెస్‌తో ఆదుకుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ద్విభాషా( తమిళం, తెలుగు) చిత్రంలో ఆ మహానటిగా నటించే అదృష్టం కీర్తీనే వరించింది. కోటి నుంచి కోటిన్నర, రెండు కోట్లు అంటూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ వస్తున్న కీర్తీసురేశ్ సావిత్రి జీవిత కథ ద్విభాషా చిత్రం కావడంతో తమిళం, తెలుగు భాషలకు కలిసి మూడు కోట్లు పారితోషికం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసిందట. నిర్మాత కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో తమిళ దర్శక, నిర్మాతలకు తన చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంటోంది కాబట్టి మీరూ తన పారితోషికం మూడు కోట్లకు తక్కువ కాకుండా చూసుకోండని అంటోందట. ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న నయనతార, అనుష్క వంటి వారే చాలా కాలం పోరాడి మూడు కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకోగా, కేవలం నాలుగైదు చిత్రాలతోనే కీర్తీసురేశ్ అంత పారితోషికం డిమాండ్ చేయడాన్ని తమిళ నిర్మాతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో సూర్యకు జంటగా తానాసేర్న్‌దకూటం అనే ఒకే ఒక్క చిత్రం చేస్తోందన్నది గమనార్హం. -
ఈ ఏడాది మూడు సినిమాలు!
గతేడాది పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంౖపై ‘దృశ్యకావ్యం’ చిత్రాన్ని అందించిన దర్శక–నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ ఏడాది మూడు చిత్రాలను ప్రేక్షకులకు ఇవ్వనున్నారు. ఆ చిత్రాల విశేషాలను రామకృష్ణారెడ్డి తెలియజేస్తూ – ‘‘విజయ్–కీర్తీ సురేశ్ జంటగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘భైరవ’ను మేలో తెలుగులో విడుదల చేయబోతున్నాం. జై, అంజలి, జెన్నీ అయ్యర్ హీరో హీరోయిన్లుగా రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ‘బెలూన్’ షూటింగ్ ప్రస్తుతం కొడైకెనాల్లో జరుగుతోంది. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. విక్రమ్, నయనతార జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్వామి–2’ని ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తాం. మహేశ్ గోవిందరాజు సమర్పణలో మా పుష్యమి ఫిలిం మేకర్స్ నిర్మాణ సారథ్యంలో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ మూడు చిత్రాలూ ఘనవిజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
రేస్ నుంచి వైదొలగిన విజయ్‌సేతుపతి
పొంగల్ రేస్ నుంచి నటుడు విజయ్‌సేతుపతి తప్పుకున్నారు. ఈ సారి పొంగల్ బరిలో నాలుగైదు చిత్రాలు పోటీ పడడానికి సిద్ధమయ్యాయి. అలాంటిది రెండు చిత్రాలే చివరికి ఢీ కొంటున్నాయి. పొంగల్ రేసు నుంచి జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించిన బ్రూస్లీ చిత్రం వారం క్రితమే తప్పుకుంది.అలాగే మరో రెండు చిత్రాలు వెనక్కి వెళ్లాయి. దీంతో విజయ్ నటించిన భైరవా, విజయ్‌సేతుపతి నటించిన పురియాద పుధీర్, పార్తిబన్ చిత్రం కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా మొదలగు మూడు చిత్రాలు పోటీకి సిద్ధమయ్యాయి. అలాంటిది ఇప్పుడు నిక్కా మూమెంట్లో విజయ్‌సేతుపతి చిత్రం పురియాదపుధీర్ పోటీ నుంచి తప్పుకుంది. ఇక విజయ్ భైరవా, పార్తిబన్ కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రాలే బరిలో తలపడుతున్నాయి. భైరవా గరువారం భారీ స్థాయిలో తెరపైకి వచ్చింది. ఇక శనివారం పార్తిబన్ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. విజయ్‌సేతుపతి చిత్రం విడుదల వాయిదా గురించి ఆ చిత్ర నిర్మాత దీపక్ భూపతి తెలుపుతూ విజయ్‌సేతుపతి, గాయత్రి జంటగా నటించిన తమ తొలి నిర్మాణం పురియాదపుధీర్ చిత్రం పొంగల్ రేసుకు సిద్ధమవుతుందని చాలా సంతోషించామన్నారు.ఇప్పటికే చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం చాలా ఉత్సాహాన్ని కలిగించిందన్నారు.అయితే తన తదుపరి చిత్రానికి ఏర్పడ్డ చిన్న సమస్య కారణంగా పురియాదపుధీర్ చిత్ర విడుదల వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.తదిపరి విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు. -
ఇళయదళపతితో ముచ్చటగా..
ఇళయదళపతి విజయ్ 60వ చిత్రం భైరవా చిత్ర పాటలు ఆయన అభిమానుల్లో యమ జోష్‌ను నింపుతున్నాయి. చిత్రం సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విజయ్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న రెండవ చిత్రం ఇది. ఇంతకు ముందు తెరి సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అంతకు ముందు కత్తి చిత్రంలో సమంత విజయ్‌తో జత కట్టారన్న విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎ విఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రంలోనూ ఇద్దరు కథానాయికలు ఉంటారట. అందులో ఒక హీరోయిన్ గా కాజల్‌అగర్వాల్ ఇప్పటికే ఎంపికైనట్లు సమాచారం. ఈ అమ్మడికి విజయ్‌తో ఇది మూడో చిత్రం అవుతుంది. ఇంతకు ముందు తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించారు. తాజా చిత్రంలో కాజల్‌తో పాటు సమంత మరో నాయకిగా నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. సమంత, టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. ఈ ప్రేమజంట వచ్చే ఏడాది ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతోంది. ఈ లోగా సమంత ఓ ఐదు చిత్రాలు చేసేయాలన్న నిర్ణయంతో ఉన్నారట. ఇప్పటికే తమిళంలో రెండు చిత్రాలు కమిట్ అయ్యారు. విజయ్ చిత్రం ఓకే అయితే మూడు చిత్రాలు అవుతాయి. ఇక మరో రెండు చిత్రాలు అంగీకరించి ఆ తరువాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. -
విజయ్‌ని వెంటాడుతున్న లీకులు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ని కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో విజయ్ నటించిన సినిమాల రిలీజ్ విషయంలో సమస్యలు తలెత్తేవి.. కానీ విజయ్ తాజా చిత్రానికి సెట్స్ మీద ఉండగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబందించిన ప్రతీ విషయం, చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించడానికి ముందే బయటికి వచ్చేస్తుండటంతో యూనిట్ సభ్యులు కంగారు పడుతున్నారు. హీరో విజయ్ 60వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా భైరవ. ఈ సినిమా టైటిల్ దగ్గరి నుంచే లీకులు మొదలయ్యాయి. చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయడానికి ముందే టైటిల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ తరువాత ఫస్ట్ లుక్ విషయంలోనూ అదే జరిగింది. యూనిట్ సభ్యులు ప్రకటించిన డేట్ కన్నా ముందే విజయ్ స్టిల్స్ బయటకి వచ్చేయటంతో ముందే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేయాల్సి వచ్చింది. తాజాగా ఆడియో రిలీజ్ విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 23న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వర్థ తుఫాన్‌తో ఈవెంట్‌ను రద్దు చేసి ఆడియోను నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కానీ యూనిట్ సభ్యులు రిలీజ్ చేయడానికి నాలుగు రోజుల ముందే భైరవ పాటలు ఐ ట్యూన్స్‌లో దర్శనమిచ్చాయి. ఆడియో కంపెనీ వారు టెక్నికల్ మిస్టేక్ వల్లే ఇలా జరిగిందని.. పూర్తి పాటలను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇలా వరుసగా అన్నీ రిలీజ్ డేట్‌కు ముందు బయటకి వచ్చేస్తుండటంతో యూనిట్ సభ్యులు, ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
విశాల్‌తో జోడీ కుదిరింది
వయసు, అనుభవం లాంటి వాటిని పక్కన పెడితే యువ నటి కీర్తీసురేష్ ఇప్పుడు అగ్రనాయకిల పట్టికలో చేరిపోయారు. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం ఇదు ఎన్న మాయం సక్సెస్ పరంగా పెద్దగా మాయ చేయలేకపోయినా ద్వితీయ చిత్రం రజనీమురుగన్, తృతీయ చిత్రం రెమో సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో ఏకంగా ఇలయదళపతి విజయ్‌తోనే రొమాన్స్ చేసే అదృష్టం తలుపు తట్టింది. ఆయనతో నటించిన భైరవా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా మరో స్టార్ హీరో సూర్యతో తానా సేర్న్‌దకూట్టం చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు తెలుగులో నానీతో నేను లోకల్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో డ్యూయెట్లు పాడటానికి సిద్ధం అవుతున్నారు. ఇక కోలీవుడ్‌లో మరో స్టార్ హీరో విశాల్‌తోనూ జత కట్టడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. కత్తిసండై చిత్రాన్ని పూర్తి చేసి ప్రస్తుతం మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్న విశాల్ తదుపరి సండైకోళి–2 చిత్రానికి రెడీ అవుతున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ పొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది పిబ్రవరిలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. కాగా సండైకోళి చిత్రంలో విశాల్‌కు తండ్రిగా నటించిన నటుడు రాజ్‌కిరణ్‌నే దానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న సండైకోళి–2 చిత్రంలోనూ నటించనున్నారు. ఇందులో నాయకిగా కీర్తీసురేష్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. -
దీపావళి బరిలోకి ఇళయదళపతి
ఇళయదళపతి విజయ్ మరోసారి దీపావళి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. విజయ్ చిత్రం విడుదలవుతుందంటే ఆయన అభిమానుల్లో పెద్ద పండగ వాతావరణమే నెలకొంటుంది. అలాగే చిత్ర పరిశ్రమలోనూ ఆ సందడి ఉంటుంది. ఇక పెద్ద పండగ రోజునే విజయ్ చిత్రాలు తెరపైకి వస్తే అభిమానులకు రెండు పండగలు ఒకే వచ్చినంత సంతోషం కలుగుతుందని వేరే చెప్పాలా? అలాంటి రెట్టింపు ఆనందం వచ్చే ఏడాది విజయ్ అభిమానులకు కలగనుంది. విజయ్ తాజాగా నటిస్తున్న 60వ చిత్రం భైరవా. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స పతాకంపై బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్న భైరవా చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇది వరకే వెల్లడించారు. కాగా ఇళయదళపతి తన 61వ చిత్రానికీ సైన్ చేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు విజయ్‌తో తెరి వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు అట్లీ ఆయన 61వ చిత్రానికీ దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. దీని షూటింగ్ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుందన్నది తాజా సమాచారం. కాగా చిత్ర విడుదలను 2017 దీపావళి సందర్భంగా చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. కాగా ఇంతకు ముందు విజయ్ నటించిన కత్తి చిత్రం 2014 దీపావళికి విడుదలై ఘన విజయం సాధించిందన్నది గమనార్హం. -
డబ్బింగ్ రైట్స్‌కు 25 కోట్లు
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న బండ్ల గణేష్ కొన్నాళ్లుగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్నాడు. తిరిగి ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని భావించినా స్టార్ హీరోల డేట్స్ లేకపోవటంతో విరమించుకున్నాడు. అయితే తాజాగా డబ్బింగ్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడ్డుతున్నాడు గణేష్. ఇప్పటికే మళయాల సూపర్ హిట్ సినిమా 'టు కంట్రీస్' రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న బండ్ల గణేష్, తెలుగులో ఓ స్టార్ హీరోతో ఆ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీంతోపాటు మరో తమిళ సినిమా డబ్బింగ్ రైట్స్‌ను కూడా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు గణేష్. లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భైరవ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను 25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నాడు. ముని, కాంచన, గంగ సినిమాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా మంచి విజయాలు నమోదు చేసిన లారెన్స్, అదే జానర్లో భైరవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గంగ సినిమా తెలుగులో 18 కోట్లకు పైగా బిజినెస్ చేయటంతో నెక్ట్స్ సినిమాకు అంతకుమించి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే భారీ మొత్తానికి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్‌ను తీసుకున్నాడు. -
మరో ప్రయోగం చేస్తున్న లారెన్స్
కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా హీరోగా కూడా సూపర్ సక్సస్ అయిన సౌత్ సెలబ్రిటీ లారెన్స్. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్న లారెన్స్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలు సాధించాడు. ఆ తరువాత తానే హీరోగా మారి స్టైల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితం వచ్చిన హార్రర్ కామెడీ జానర్ సినిమాలను కాంచనతో మళ్లీ తెర మీదకు తీసుకువచ్చి వరుసగా మూడు బ్లాక్ బస్టర్లను సాధించాడు. అదే జోష్‌లో ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మొట్ట శివ, కొట్టే శివ పేరుతో కాంచన సీరీస్‌లో మరో సినిమాను తెరకెక్కిస్తున్న లారెన్స్, ఆ సినిమా పూర్తయిన తరువాత రెండు డిఫరెంట్ సినిమాలను ప్రారంభించనున్నాడు. నాగ, భైరవ పేరుతో తెరకెక్కనున్న ఈ రెండు సినిమాల్లో జంతువులే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నాయట. 80లలో సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు కనిపించినా.. తరువాత తరువాత తగ్గిపోయాయి. ప్రస్తుతం జంతువుల రక్షణ కోసం అనేక సంఘాలు పని చేస్తున్న సమయంలో లారెన్స్ చేయాలనుకుంటున్న సినిమాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి లారెన్స్ జంతువులతోనే ఈ సినిమా తెరకెక్కిస్తాడా లేక పూర్తిగా గ్రాఫిక్స్ మీదే ఆధారపడతాడా చూడాలి.