ఈ ఏడాది మూడు సినిమాలు! | Bellam Ramakrishna Reddy doing three movies in this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది మూడు సినిమాలు!

Published Sat, Apr 8 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

ఈ ఏడాది మూడు సినిమాలు!

ఈ ఏడాది మూడు సినిమాలు!

గతేడాది పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంౖపై ‘దృశ్యకావ్యం’ చిత్రాన్ని అందించిన దర్శక–నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ ఏడాది మూడు చిత్రాలను ప్రేక్షకులకు ఇవ్వనున్నారు. ఆ చిత్రాల విశేషాలను రామకృష్ణారెడ్డి తెలియజేస్తూ – ‘‘విజయ్‌–కీర్తీ సురేశ్‌ జంటగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘భైరవ’ను మేలో తెలుగులో విడుదల చేయబోతున్నాం.

జై, అంజలి, జెన్నీ అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా రాజ్‌ తరుణ్‌ ముఖ్య పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ‘బెలూన్‌’ షూటింగ్‌ ప్రస్తుతం కొడైకెనాల్‌లో జరుగుతోంది. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. విక్రమ్, నయనతార జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్వామి–2’ని ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తాం. మహేశ్‌ గోవిందరాజు సమర్పణలో మా పుష్యమి ఫిలిం మేకర్స్‌ నిర్మాణ సారథ్యంలో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ మూడు చిత్రాలూ ఘనవిజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement