రేస్‌ నుంచి వైదొలగిన విజయ్‌సేతుపతి | vijay setupati move out of the race | Sakshi
Sakshi News home page

రేస్‌ నుంచి వైదొలగిన విజయ్‌సేతుపతి

Published Thu, Jan 12 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

రేస్‌ నుంచి వైదొలగిన విజయ్‌సేతుపతి

రేస్‌ నుంచి వైదొలగిన విజయ్‌సేతుపతి

పొంగల్‌ రేస్‌ నుంచి నటుడు విజయ్‌సేతుపతి తప్పుకున్నారు. ఈ సారి పొంగల్‌ బరిలో నాలుగైదు చిత్రాలు పోటీ పడడానికి సిద్ధమయ్యాయి. అలాంటిది రెండు చిత్రాలే చివరికి ఢీ కొంటున్నాయి. పొంగల్‌ రేసు నుంచి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ నటించిన బ్రూస్‌లీ చిత్రం వారం క్రితమే తప్పుకుంది.అలాగే మరో రెండు చిత్రాలు వెనక్కి వెళ్లాయి. దీంతో విజయ్‌ నటించిన భైరవా, విజయ్‌సేతుపతి నటించిన పురియాద పుధీర్, పార్తిబన్  చిత్రం కోడిట్ట ఇడంగళ్‌ నిరప్పుగా మొదలగు మూడు చిత్రాలు పోటీకి సిద్ధమయ్యాయి. అలాంటిది ఇప్పుడు నిక్కా మూమెంట్‌లో విజయ్‌సేతుపతి చిత్రం పురియాదపుధీర్‌ పోటీ నుంచి తప్పుకుంది. ఇక విజయ్‌ భైరవా, పార్తిబన్  కోడిట్ట ఇడంగళ్‌ నిరప్పుగా చిత్రాలే బరిలో తలపడుతున్నాయి.

భైరవా గరువారం భారీ స్థాయిలో తెరపైకి వచ్చింది. ఇక శనివారం పార్తిబన్  చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. విజయ్‌సేతుపతి చిత్రం విడుదల వాయిదా గురించి ఆ చిత్ర నిర్మాత దీపక్‌ భూపతి తెలుపుతూ విజయ్‌సేతుపతి, గాయత్రి జంటగా నటించిన తమ తొలి నిర్మాణం పురియాదపుధీర్‌ చిత్రం పొంగల్‌ రేసుకు సిద్ధమవుతుందని చాలా సంతోషించామన్నారు.ఇప్పటికే చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం చాలా ఉత్సాహాన్ని కలిగించిందన్నారు.అయితే తన తదుపరి చిత్రానికి ఏర్పడ్డ చిన్న సమస్య కారణంగా పురియాదపుధీర్‌ చిత్ర విడుదల వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.తదిపరి విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement