3 సీకి తక్కువ కాకుండా చూసుకోండి! | Keerthi Suresh got Bhairava movie offer | Sakshi
Sakshi News home page

3 సీకి తక్కువ కాకుండా చూసుకోండి!

Published Wed, Apr 12 2017 3:57 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

3 సీకి తక్కువ కాకుండా చూసుకోండి! - Sakshi

3 సీకి తక్కువ కాకుండా చూసుకోండి!

 3 సీ తక్కువ కాకుండా చూసుకోండి అంటోంది నటి కీర్తీసురేశ్‌. ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మాలీవుడ్‌ బ్యూటీ కీర్తీసురేశ్‌.ఆ చిత్రం ఓకే అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. దీంతో యమ క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు అనూహ్యంగా ఇళయదళపతితో భైరవా చిత్రంలో రొమాన్స్‌ చేసే అవకాశం వరించింది. అంతకు ముందే ధనుష్‌తో తొడరి చిత్రంలో నటించి తన వరకూ మంచి మార్కులు కొట్టేసింది. అయితే విజయ్‌తో నటించిన భైరవా చిత్రంపై కీర్తీసురేశ్‌ చాలా ఆశలనే పెట్టుకుంది.అయితే తను ఆశంచిన పేరు ఆ చిత్రం అందించలేదనే చెప్పాలి.అయినా టాలీవుడ్‌ కీర్తీని సక్సెస్‌తో ఆదుకుంది.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌కు జంటగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ద్విభాషా( తమిళం, తెలుగు) చిత్రంలో ఆ మహానటిగా నటించే అదృష్టం కీర్తీనే వరించింది. కోటి నుంచి కోటిన్నర, రెండు కోట్లు అంటూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ వస్తున్న కీర్తీసురేశ్‌ సావిత్రి జీవిత కథ ద్విభాషా చిత్రం కావడంతో తమిళం, తెలుగు భాషలకు కలిసి మూడు కోట్లు పారితోషికం ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసిందట.

నిర్మాత కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో తమిళ దర్శక, నిర్మాతలకు తన చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్‌ ఉంటోంది కాబట్టి మీరూ తన పారితోషికం మూడు కోట్లకు తక్కువ కాకుండా చూసుకోండని అంటోందట. ప్రస్తుతం టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తున్న నయనతార, అనుష్క వంటి వారే చాలా కాలం పోరాడి మూడు కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకోగా, కేవలం నాలుగైదు చిత్రాలతోనే కీర్తీసురేశ్‌ అంత పారితోషికం డిమాండ్‌ చేయడాన్ని తమిళ నిర్మాతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు టాక్‌. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో సూర్యకు జంటగా తానాసేర్న్‌దకూటం అనే ఒకే ఒక్క చిత్రం చేస్తోందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement