విజయ్‌ కోసం.. కుంచె పట్టిన కీర్తీ | Kireesh Ramesh was saddened by the idea of giving a Gift on Vijay's birthday | Sakshi
Sakshi News home page

విజయ్‌ కోసం.. కుంచె పట్టిన కీర్తీ

Published Tue, Jun 27 2017 2:40 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

విజయ్‌ కోసం.. కుంచె పట్టిన కీర్తీ

విజయ్‌ కోసం.. కుంచె పట్టిన కీర్తీ

తమిళసినిమా: హీరోలంటే పడిచచ్చే అభిమానుల్లో చాలా మంది సెలబ్రిటీలు ఉంటారనడానికి చిన్న ఉదాహరణ నటి కీర్తీసురేశ్‌. అనతికాలంలోనే విజయ్, సూర్య, విక్రమ్‌ లాంటి స్టార్స్‌తో నటించే స్థాయికి ఎదిగిన లక్కీ బ్యూటీ కీర్తీసురేశ్‌. విజయ్‌కి జంటగా భైరవా చిత్రంలో నటించిన ఈ భామ తాజాగా సూర్యతో తానాసేర్న్‌ద కూటం చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్నారు.

త్వరలో సామి– 2లో విక్రమ్‌తో డ్యూయెట్లు పాడటానికి సిద్ధం అవుతోంది. నటి కాక ముందు కీర్తీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. ఇప్పుడు తన చిత్రాలకు తానే దుస్తులు డిజైన్‌ చేసుకుంటారట. కాగా ఈ అమ్మడు నటుడు విజయ్‌కి వీరాభిమాని అట. ఇటీవల విజయ్‌ పుట్టిన రోజును జరుపుకున్నారు. అయితే ఆయనకు ఏలాంటి గిప్ట్‌ ఇవ్వాలన్న ఆలోచనలతో మునిగిపోయిన కీర్తీసురేశ్‌ తనకు తెలిసిన విద్యకు పని చెప్పారట.

మంచి పెయింటింగ్‌ నాలెడ్జ్‌ ఉన్న కీర్తీ విజయ్‌ రూపాన్ని క్యాన్వాస్‌పై ఆవిష్కరించి పుట్టిన రోజు కానుకగా ఆయనకు పంపించారట. అందులో కలర్‌ఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో బ్లాక్‌ ఫేడ్‌లో స్టైలిష్‌గా నడిచివస్తున్న విజయ్‌ ప్రతిరూపం కనిపిస్తోంది. ఈ పెయింటింగ్‌ కింద మీ విజయం కోనసాగాలి లక్షలాది మీ అభిమానుల్లో నేనూ ఒకరిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని రాశారు. ఈ పెయింటింగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement