విజయ్ని వెంటాడుతున్న లీకులు | Kollywood Star Hero Vijay Bhairava Songs Leaked | Sakshi
Sakshi News home page

విజయ్ని వెంటాడుతున్న లీకులు

Published Wed, Dec 21 2016 11:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

విజయ్ని వెంటాడుతున్న లీకులు

విజయ్ని వెంటాడుతున్న లీకులు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ని కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో విజయ్ నటించిన సినిమాల రిలీజ్ విషయంలో సమస్యలు తలెత్తేవి.. కానీ విజయ్ తాజా చిత్రానికి సెట్స్ మీద ఉండగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబందించిన ప్రతీ విషయం, చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించడానికి ముందే బయటికి వచ్చేస్తుండటంతో యూనిట్ సభ్యులు కంగారు పడుతున్నారు.

హీరో విజయ్ 60వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా భైరవ. ఈ సినిమా టైటిల్ దగ్గరి నుంచే లీకులు మొదలయ్యాయి. చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయడానికి ముందే టైటిల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.  ఆ తరువాత ఫస్ట్ లుక్ విషయంలోనూ అదే జరిగింది. యూనిట్ సభ్యులు ప్రకటించిన డేట్ కన్నా ముందే విజయ్ స్టిల్స్ బయటకి వచ్చేయటంతో ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ను అఫీషియల్గా రిలీజ్ చేయాల్సి వచ్చింది.

తాజాగా ఆడియో రిలీజ్ విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 23న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వర్థ తుఫాన్తో ఈవెంట్ను రద్దు చేసి ఆడియోను నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కానీ యూనిట్ సభ్యులు రిలీజ్ చేయడానికి నాలుగు రోజుల ముందే భైరవ పాటలు ఐ ట్యూన్స్లో దర్శనమిచ్చాయి.

ఆడియో కంపెనీ వారు టెక్నికల్ మిస్టేక్ వల్లే ఇలా జరిగిందని.. పూర్తి పాటలను అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఇలా వరుసగా అన్నీ రిలీజ్ డేట్కు ముందు బయటకి వచ్చేస్తుండటంతో యూనిట్ సభ్యులు, ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement