బాలయ్యతో కాదు లారెన్స్తో..! | Shiva Linga Kannada Film Telugu, Tamil Remake With Lawrence | Sakshi
Sakshi News home page

బాలయ్యతో కాదు లారెన్స్తో..!

Published Tue, Jun 28 2016 12:48 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

బాలయ్యతో కాదు లారెన్స్తో..!

బాలయ్యతో కాదు లారెన్స్తో..!

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా శివలింగ. ఇటీవలే ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోగా  ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే అదే సమయంలో బాలకృష్ణ హీరోగా శివలింగ సినిమాను టాలీవుడ్లో రీమేక్ చేసే ఆలోచన ఉందన్న టాక్ వినిపించింది.

అంతేకాదు చిత్ర దర్శకుడు పి వాసు కూడా శివ లింగ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రస్తుతం తన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ, ఇప్పట్లో పి వాసుకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే బాలకృష్ణతో అనుకున్న శివలింగ రీమేక్ను లారెన్స్ హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. లారెన్స్ హీరోగా నటిస్తే ఒకేసారి తెలుగు, తమిళలో రిలీజ్ చేయోచ్చేనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement