shiva raj kumar
-
హీరో శివ రాజ్‌కుమార్‌పై సొంత బామ్మర్ది సంచలన ట్వీట్!
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌ను బావమరిది కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గలో శివ భార్య గీత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ బాధలో ఉండగానే బావమరిది, బీజేపీ నేత కుమార బంగారప్ప హేళనలు ఆయన అభిమానులను మరింత వేదనకు గురిచేశాయి. కుమార బంగారప్ప ఇంటిని హీరో శివరాజ్ కుమార్ అభిమానులు శనివారం ముట్టడించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ కుటుంబాల గురించి కుమార ఇటీవల చులకనగా మాట్లాడారు. అది తమకు బాధకు గురి చేసిందని, ఆయన బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని అభిమానులు పట్టుబట్టారు. బెంగళూరులో సదాశివనగరలో ఉన్న కుమార బంగారప్ప ఇంటి గేట్ లోపలికి చొరబడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివ రాజ్‌కుమార్ ఫొటోలను ప్రదర్శించారు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుండగా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంటి నుంచి వెళ్లాలని పోలీసులు అభిమానులను హెచ్చరించారు. ఆ తరువాత కేఎస్ఆర్పీ పోలీసులతో అధిక భద్రత కల్పిపించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీప పార్కు చుట్టుపక్కల నిల్చున్నవారిని సైతం నిర్బంధించారు. హేళనగా కుమార పోస్టు తన సోదరుడు, మంత్రి మధు బంగారప్ప, సోదరి గీతాను, గీతా భర్త శివరాజ్‌కుమార్ గురించి సోషల్ మీడియాలో హేళనగా రాశారు. శివరాజ్‌కుమార్ నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. మా గ్రామ జాతరలో నృత్యం చేసే పనికి దరఖాస్తు వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నా చెల్లెలు గీతా.. సినిమా డ్యాన్సర్ కాబట్టి ఊరికే ఉండాల్సిన పని లేదు. దొడ్డమనె వ్యవహారం చాలా ఉంటుంది. వేరేవారికి అవకాశం లభించరాదు. బెదిరించడం, భయపెట్టడం, హుషార్ అనే మాటలు ఏమున్నా గొంతు లోపలే, నాలుగు గోడల లోపలే ఉండాలి. మా సైన్యం ఆన్‌లోనే ఉంటుంది అని హెచ్చరికలు చేశారు.pic.twitter.com/6YPDJcjkmh— Kumar Bangarappa (@kumarbangarappa) June 4, 2024 -
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అక్టోబర్‌లో వచ్చేస్తున్నాడు
శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ (ఎమ్మెల్సీ) సమర్పణలో సందేశ్ ఎన్. నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 19న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ మ్యూజిక్ ...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం ‘ఘోస్ట్’. రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలో శివరాజ్‌కుమార్ పాత్రకు వచ్చిన మంచి స్పందన ‘ఘోస్ట్’ పై మరిన్ని అంచనాలు పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఘోస్ట్.. డేట్ ఫిక్స్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ అక్టోబర్‌లో ‘ఘోస్ట్’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఘోస్ట్’ రూపొందింది. అక్టోబర్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
గౌరవమే స్వేచ్ఛ
ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంకా అరుళ్ మోహనన్, నివేదితా సతీష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో టీజీ త్యాగరాజన్ సమర్పణలో జి. శరవణన్, సాయి సిద్ధార్థ్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ‘గౌరవమే స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ తో శుక్రవారం ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు ధనుష్. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1930–1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. ఆల్రెడీ 85 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఓటీటీలోకి ఉపేంద్ర ‘కబ్జ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కబ్జ’. శ్రియ హీరోయిన్గా నటించింది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 17న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏప్రిల్ 14 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెసాన్ ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. 1960 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ కథ ఇది. కేజీయఫ్ సినిమా తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే విడుదలైన తొలి రోజే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ని తెచ్చుకుంది. అయితే కర్ణాటక విషయం పక్కన పెడితే మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. a tale of unforeseen circumstances transforming an innocent young man into the most dreaded gangster ever! 🔥#KabzaaOnPrime, Apr 14 pic.twitter.com/wCRRyIDeAI — prime video IN (@PrimeVideoIN) April 11, 2023 -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్‌కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
సింపుల్‌గా నటుడు శివరాజ్‌కుమార్ బర్త్‌డే సెలబ్రేషన్స్
యశవంతపుర: ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ సోమవారం 59వ వసంతంలోకి అడుగు పెట్టారు. కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలను ఇంటిలోనే నిరాడంబరంగా జరుపుకున్నారు. భార్య గీతాతో కలిసి కేక్‌ను కట్ చేశారు. సోదరులు రాఘవేంద్ర, పునీత్ రాజ్‌కుమార్‌లు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Dr.Shivarajkumar Fc (@dr.shivarajkumar) -
బాలయ్యతో కాదు లారెన్స్‌తో..!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా శివలింగ. ఇటీవలే ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోగా ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే అదే సమయంలో బాలకృష్ణ హీరోగా శివలింగ సినిమాను టాలీవుడ్లో రీమేక్ చేసే ఆలోచన ఉందన్న టాక్ వినిపించింది. అంతేకాదు చిత్ర దర్శకుడు పి వాసు కూడా శివ లింగ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రస్తుతం తన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ, ఇప్పట్లో పి వాసుకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే బాలకృష్ణతో అనుకున్న శివలింగ రీమేక్‌ను లారెన్స్ హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. లారెన్స్ హీరోగా నటిస్తే ఒకేసారి తెలుగు, తమిళలో రిలీజ్ చేయోచ్చేనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.