![Shivarajkumar Fans Demand Apology From Kumar Bangarappa](/styles/webp/s3/article_images/2024/06/9/shivarajkumar.jpg.webp?itok=mO2p8Qn4)
హీరో శివ రాజ్‌కుమార్‌పై కుమార బంగారప్ప హేళన పోస్టు
ఇంటిని ముట్టడించిన అభిమానులు
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌ను బావమరిది కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గలో శివ భార్య గీత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ బాధలో ఉండగానే బావమరిది, బీజేపీ నేత కుమార బంగారప్ప హేళనలు ఆయన అభిమానులను మరింత వేదనకు గురిచేశాయి. కుమార బంగారప్ప ఇంటిని హీరో శివరాజ్ కుమార్ అభిమానులు శనివారం ముట్టడించారు.
![](/sites/default/files/inline-images/geetha.jpg)
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ కుటుంబాల గురించి కుమార ఇటీవల చులకనగా మాట్లాడారు. అది తమకు బాధకు గురి చేసిందని, ఆయన బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని అభిమానులు పట్టుబట్టారు. బెంగళూరులో సదాశివనగరలో ఉన్న కుమార బంగారప్ప ఇంటి గేట్ లోపలికి చొరబడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివ రాజ్‌కుమార్ ఫొటోలను ప్రదర్శించారు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుండగా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.
ఇంటి నుంచి వెళ్లాలని పోలీసులు అభిమానులను హెచ్చరించారు. ఆ తరువాత కేఎస్‌ఆర్‌పీ పోలీసులతో అధిక భద్రత కల్పిపించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీప పార్కు చుట్టుపక్కల నిల్చున్నవారిని సైతం నిర్బంధించారు.
హేళనగా కుమార పోస్టు
తన సోదరుడు, మంత్రి మధు బంగారప్ప, సోదరి గీతాను, గీతా భర్త శివరాజ్‌కుమార్ గురించి సోషల్ మీడియాలో హేళనగా రాశారు. శివరాజ్‌కుమార్ నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. మా గ్రామ జాతరలో నృత్యం చేసే పనికి దరఖాస్తు వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నా చెల్లెలు గీతా.. సినిమా డ్యాన్సర్ కాబట్టి ఊరికే ఉండాల్సిన పని లేదు. దొడ్డమనె వ్యవహారం చాలా ఉంటుంది. వేరేవారికి అవకాశం లభించరాదు. బెదిరించడం, భయపెట్టడం, హుషార్ అనే మాటలు ఏమున్నా గొంతు లోపలే, నాలుగు గోడల లోపలే ఉండాలి. మా సైన్యం ఆన్‌లోనే ఉంటుంది అని హెచ్చరికలు చేశారు.
— Kumar Bangarappa (@kumarbangarappa) June 4, 2024
Comments
Please login to add a commentAdd a comment