Kumar Bangarappa
-
హీరో శివ రాజ్‌కుమార్‌పై సొంత బామ్మర్ది సంచలన ట్వీట్!
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌ను బావమరిది కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గలో శివ భార్య గీత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ బాధలో ఉండగానే బావమరిది, బీజేపీ నేత కుమార బంగారప్ప హేళనలు ఆయన అభిమానులను మరింత వేదనకు గురిచేశాయి. కుమార బంగారప్ప ఇంటిని హీరో శివరాజ్ కుమార్ అభిమానులు శనివారం ముట్టడించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ కుటుంబాల గురించి కుమార ఇటీవల చులకనగా మాట్లాడారు. అది తమకు బాధకు గురి చేసిందని, ఆయన బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని అభిమానులు పట్టుబట్టారు. బెంగళూరులో సదాశివనగరలో ఉన్న కుమార బంగారప్ప ఇంటి గేట్ లోపలికి చొరబడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివ రాజ్‌కుమార్ ఫొటోలను ప్రదర్శించారు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుండగా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంటి నుంచి వెళ్లాలని పోలీసులు అభిమానులను హెచ్చరించారు. ఆ తరువాత కేఎస్ఆర్పీ పోలీసులతో అధిక భద్రత కల్పిపించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీప పార్కు చుట్టుపక్కల నిల్చున్నవారిని సైతం నిర్బంధించారు. హేళనగా కుమార పోస్టు తన సోదరుడు, మంత్రి మధు బంగారప్ప, సోదరి గీతాను, గీతా భర్త శివరాజ్‌కుమార్ గురించి సోషల్ మీడియాలో హేళనగా రాశారు. శివరాజ్‌కుమార్ నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. మా గ్రామ జాతరలో నృత్యం చేసే పనికి దరఖాస్తు వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నా చెల్లెలు గీతా.. సినిమా డ్యాన్సర్ కాబట్టి ఊరికే ఉండాల్సిన పని లేదు. దొడ్డమనె వ్యవహారం చాలా ఉంటుంది. వేరేవారికి అవకాశం లభించరాదు. బెదిరించడం, భయపెట్టడం, హుషార్ అనే మాటలు ఏమున్నా గొంతు లోపలే, నాలుగు గోడల లోపలే ఉండాలి. మా సైన్యం ఆన్‌లోనే ఉంటుంది అని హెచ్చరికలు చేశారు.pic.twitter.com/6YPDJcjkmh— Kumar Bangarappa (@kumarbangarappa) June 4, 2024 -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ముల సవాల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ముల మధ్య సవాల్ ఆసక్తిని రేపుతోంది. కర్ణాటక దివంగత ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుమారులిద్దరూ మరోసారి పోటీపడుతున్నారు. శివమొగ్గ జిల్లాలోని సొరబ నియోజకవర్గం నుంచి కుమార్ బంగారప్ప బీజేపీ నుంచి, మధు బంగారప్ప కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బంగారప్ప 1967 నుంచి 1994 వరకు సొరబ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. చిట్టచివరి సారిగా ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సొరబ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కుమార్ బంగారప్ప మరోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్నారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై కొట్టేసి బీజేపీలో చేరిన కుమార్, అప్పటికే జేడీ(ఎస్) సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మధుపై 3,286 ఓట్ల తేడాతో నెగ్గారు. 2021లో కాంగ్రెస్‌లో చేరిన మధు బంగారప్ప మరోసారి అదే నియోజకవర్గం బరిలో దిగడంతో అన్నదమ్ముల మధ్య పోరు ఉత్కంఠకు దారి తీస్తోంది. -
కమలం గూటికి మాజీ సీఎం కొడుకు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప తనయుడు, కాంగ్రెస్ నాయకుడు కుమార్ బంగారప్ప శుక్రవారం బీజేపీలో చేరారు. ఎంఎస్ కృష్ణ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య సర్కారు తనను పట్టించుకోకపోవడంతో ఆయన కలత చెందారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన మద్దతుదారులతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పను కలిశారు. పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు చెప్పేందుకే యడ్యూప్పను కలిశాసానని, తన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని అప్పుడు చెప్పారు. కుమార్ బంగారప్ప బీజేపీలో చేరడం ఖాయమని అప్పటి నుంచి మీడియాలో ప్రచారం మొదలైంది. ముందుగా ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆయన బీజేపీలో చేరారు. 80, 90 దశకంలో కన్నడ, తెలుగు, ఇంగ్లీషు సినిమాల్లో నటించిన కుమార్ బంగారప్ప యాక్షన్ హీరోగా పేరుగాంచారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా పనిచేశారు. చిన్నవయసులో మంత్రి పదవికి పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు.