Upendra Latest Movie Kabzaa OTT Release Date Out, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Kabzaa OTT Release Date: ఓటీటీలోకి ఉపేంద్ర ‘కబ్జ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Published Tue, Apr 11 2023 5:21 PM | Last Updated on Tue, Apr 11 2023 6:10 PM

Upendra Latest Movie Kabzaa OTT Release Date Out - Sakshi

ఉపేంద్ర, సుదీప్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘కబ్జ’. శ్రియ హీరోయిన్‌గా నటించింది.  కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 17న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏప్రిల్‌ 14 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెసాన్‌ ప్రైమ్‌ వీడియో ట్వీట్‌ చేసింది.

1960 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్‌ కథ ఇది. కేజీయఫ్‌ సినిమా తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే విడుదలైన తొలి రోజే ఈ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది.  అయితే కర్ణాటక విషయం పక్కన పెడితే మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement