ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అక్టోబర్‌లో వచ్చేస్తున్నాడు | Shiva Rajkumar Ghost Movie Grand Release On October 19th - Sakshi
Sakshi News home page

ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అక్టోబర్‌లో వచ్చేస్తున్నాడు

Published Sat, Sep 23 2023 12:41 AM | Last Updated on Sun, Sep 24 2023 6:50 PM

Euphoric Original Gangster Music from Shiva Rajkumar Ghost Released - Sakshi

శివ రాజ్‌కుమార్‌

శివ రాజ్‌కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్‌’. శ్రీని దర్శకత్వంలో సందేశ్‌ నాగరాజ్‌ (ఎమ్మెల్సీ) సమర్పణలో సందేశ్‌ ఎన్‌. నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 19న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

అర్జున్‌ జన్య సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ మ్యూజిక్‌ ...’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేశారు. ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం ‘ఘోస్ట్‌’. రజనీకాంత్‌ ‘జైలర్‌’ చిత్రంలో శివరాజ్‌కుమార్‌ పాత్రకు వచ్చిన మంచి స్పందన ‘ఘోస్ట్‌’ పై మరిన్ని అంచనాలు పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement