కాంచన-2లో ప్రమోట్ సాంగ్ | Promoted Song in kanchana 2 | Sakshi
Sakshi News home page

కాంచన-2లో ప్రమోట్ సాంగ్

Published Wed, Apr 29 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

కాంచన-2లో ప్రమోట్ సాంగ్

కాంచన-2లో ప్రమోట్ సాంగ్

 ప్రస్తుతం ఏ,బీ,సీ అంటూ వ్యత్యాసం లేకుండా అన్ని ఏరియాల్లోనూ కాంచన-2 విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాంచన వంటి హిట్ చిత్రం తరువాత దానికి కొనసాగింపుగా లారెన్స్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం కాంచన-2. తాప్సీ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ హార్రర్ థ్రిల్లర్ చిత్రం కోసం తాజాగా లారెన్స్ ఒక ప్రమోషన్ సాంగ్‌ను చిత్రీకరిస్తుండడం విశేషం. చిత్రంలో చోటు చేసుకున్న సిల్టా పిల్లాట్ట అనే తొలి పాటను లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్‌లపై చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాట ప్రచారానికే ఉపయోగించనున్నట్లు చిత్రంలో చోటు చేసుకోదని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ పాట చిత్రీకరణను మంగళవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించడానికి లారెన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement