kanchana 2
-
ఆ పని మాత్రం చేయను!
తమిళసినిమా: నటి నిత్యామీనన్ రూటే వేరని చెప్పవచ్చు. చాలా వరకూ లవ్లీ పాత్రలు చేసిన ఈ మాలీవుడ్ భామ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యత నిస్తోందనే చెప్పవచ్చు. ఆ మధ్య కాంచన 2 చిత్రంలో దివ్యాంగురాలిగా నటించి మెప్పించిన నిత్యామీనన్, మణిరత్నం దర్శకత్వం చిత్రం కాదల్ కణ్మణి చిత్రంలో హీరోతో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేసే పాత్రలో నటించి అలరించింది. అదే విధంగా మెర్శల్ చిత్రంలో విజయ్‌కు జంటగా పల్లెటూరి అమ్మాయిగా నటించడానికి బరువు కూడా పెరిగింది. ఇక ఇటీవల తెలుగు చిత్రం ‘అ’లో లెస్బియన్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ పాత్రలో నటించిన నిత్యామీనన్‌ను విమర్శించిన వారూ లేకపోలేదు. అలాంటి విమర్శలను డోంట్‌కేర్ అంటున్న నిత్యామీనన్ మాట్లాడుతూ అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే వాటిలో ఒకటి రెండు చిత్రాలే తన వల్ల నటించడం అవుతుందని అంది. కారణం సాధారణ హీరోయిన్ పాత్రలను తాను కోరుకోవడంలేదని చెప్పింది. ఇక షూటింగ్ స్పాట్లో తన పాత్రను డెవలప్ చేసుకునే విషయంలోనూ, సంభాషణల గురించి దర్శకుడితో చర్చిస్తానని చెప్పింది. ఎందుకంటే తనకు దర్శకత్వం వహించాలన్న ఆసక్తి ఉందని చెప్పింది. అందుకే సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి తెలుసుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నానని అంది. భవిష్యత్‌లో కచ్చితంగా మెగాఫోన్ పడతానని, అయితే సొంతంగా చిత్రం నిర్మాణం చేపట్టే పొరపాటును మాత్రం చేయనని అంటోంది. మరి ఈమె దర్శకత్వం వహించే చిత్రాన్ని నిర్మాతగా ఎవరు ముందుకొస్తారో చూడాలి. -
‘కాంచన 2’ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో
సౌత్‌లో హర్రర్ సినిమాలకు క్రేజ్ తీసుకువచ్చిన నటుడు రాఘవ లారెన్స్. ముని, కాంచన, గంగ (కాంచన 2) సినిమాలతో వరస విజయాలు సాధించిన లారెన్స్.. ప్రస్తుతం కాంచన 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. లారెన్స్ సరసన తాప్సీ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ‘గంగ(కాంచన 2)’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో లారెన్స్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్నాడు. క్రిఅర్జ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రేరణా అరోరా, అర్జున్ ఎన్ కపూర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్యాడ్ మ్యాన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్, 2.ఓ, కేసరి, గోల్డ్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత గంగ(కాంచన 2) రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను 2019లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నాకేం తక్కువ!
పొగరుబోతుగా పేరు తెచ్చుకున్న నటి నిత్యామీనన్ కు ఇప్పుడు చాలా బెంగ పట్టుకుందట. ఇంతకు ముందు అవకాశాలు లేకపోయినా పర్వాలేదు హాయిగా ఇంట్లో కూర్చుంటాను కానీ అందుకోసం ఎవరినీ అడగను అని బింకాలు తీసిన ఈ అమ్మడు ఇప్పుడు ఆ అవకాశాలు రాకపోవడంతో చాలా ఇదైపోతోందట. మార్కెట్ ఉన్నప్పుడు మాటలు వేరు, అది లేనప్పుడు మాటలు వేరని నిత్యామీనన్ ను చూస్తే అర్థం అవుతుంది కదూ. ఈ కేరళ కుట్టికి అవకాశాలు అడపాదడపా వస్తున్నా అవి రెండవ హీరోయిన్ పాత్రలే కావడంతో ఇందుకు కారణం ఏమిటని తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధ పడిపోతోందట. తనకు అందం తక్కువా? అభినయ ప్రతిభ లేదా? అంటూ వాపోతోందట. నిజం చెప్పాలంటే మణిరత్నం చిత్రం ఓ కాదల్ కణ్మణి తరువాత నిత్యామీనన్ సోలో నాయకిగా నటించిన చిత్రాలు లేవనే చెప్పాలి. చాలా మందికి చెప్పినట్లే తన గోడును కాంచన–2 చిత్రంలో వైవిధ్యభరిత పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించిన లారెన్స్ వద్ద చెప్పుకుందట. అందుకు ఆయన అన్న మాట ఇంత బొద్దుగా ఉంటే ఎవరు మాత్రం కథానాయకి అవకాశాలు ఇస్తారు? ముందు బరువు తగ్గే ప్రయత్నం చేయండి అని చెప్పారట. కథానాయికలకు శారీరక అందం చాలా ముఖ్యం అని, సన్నగా, నాజూగ్గా ఉంటేనే అవకాశాలు వస్తాయని అన్నారట. అంతే కాదు స్లిమ్‌గా, గ్లామరస్‌గా ఎలా తయారవ్వాల్లో హిందీ నటి అనుష్కాశర్మను అడిగి తెలుసుకోండి అని ఉచిత సలహా కూడా ఇచ్చారట. దీంతో అమ్మడు ఇప్పుడు బరువు తగ్గి అందాన్ని పెంచుకునే పనిలో పడ్డారట. -
వంద కోట్ల క్లబ్లో కాంచన-2
కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. వంద కోట్ల క్లబ్లో చేరడం అంటే ఇంతకుముందు బాలీవుడ్ చిత్రాలకే సాధ్యం అనుకునేవారు. అలాంటిదిప్పుడు కోలీవుడ్ దాన్ని అధిగమించే స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడైనా భారీ చిత్రాలు వసూళ్లు సాధించాయంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి అంచనాలు లేని కాంచన-2 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో పాటు 100 కోట్లు వసూళ్లు సాధించిన అతి తక్కువ చిత్రాల సరసన నిలవడం విశేషం. దీనికి కర్త, కర్మ, క్రియ లారెన్స్‌నే. ఆయన నటనా చాతుర్యం, దర్శక నైపుణ్యం, నిర్మాణ దక్షతనే ప్రధాన కారణం. ఆయన నటించి దర్శకత్వం వహించిన ముని చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయినా దానికి సీక్వెల్‌గా కాంచన చిత్రం చేసి విజయం సాధించారు.ఆ తరువాత దానికి కొనసాగింపుగా కాంచన-2 తెరకెక్కించి ఘనవిజయాన్ని అందుకున్నారు. నిజానికి ఈ చిత్ర నిర్మాణంలో లారెన్స్ చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. షూటింగ్లో ఆపదకు గురై చాలా రోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. దీంతో కాంచన-2 షూటింగ్ రద్దుకాక తప్పలేదు. ఈ కారణాల వలన చిత్ర షూటింగ్లో జాప్యం జరిగింది. అసలు చిత్రం పూర్తి అవుతుందా? తెరపైకి వస్తుందా? అనే సందేహాలతో కూడిన ప్రచారం కూడా కోలీవుడ్‌లో హల్చల్ చేసింది. ఇలాంటి పనికి మాలిన ప్రచారాన్ని పెడచెవిన పెట్టి ఆకుంఠిత దీక్షతో లారెన్స్ తన పని తాను చేసుకుంటూ పోయారు. ఫలితం ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్ చిత్రంగా కాంచన-2 నమోదైంది. చిత్రం విడుదలై అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుని ఇంకా కొన్ని సెంటర్లలో ప్రదర్శింపబడుతున్న కాంచన-2 ,17 కోట్ల ఖర్చుతో రూపొంది 108 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ గణాంకాల మేధ త్రినాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇవేవి పట్టించుకోని లారెన్స్ కాంచన-3కి సన్నాహాలు చేస్తున్నారు. -
తాప్సీకి కోపమొచ్చింది
ఎప్పుడు నవ్వుతూ జాలీగా ఉండే నటి తాప్సీ. అలాంటి ఈ బ్యూటీ ఇటీవల చాలా ఆవేశానికి గురయ్యారు. కారణం ఏమిటంటారనేగా మీ ప్రశ్న. నిజం చెప్పాలంటే విజయం అనే దప్పికతో చాలాకాలంగా కొట్టుమిట్టాడుతున్న నటి తాప్సీ. ఈ బహుభాషా నటికి చాలా కాలం తరువాత కాంచన-2 చిత్రం తన విజయ దాహార్తిని తీర్చింది. దీంతో పుల్‌జోష్‌లో కొచ్చేశారు. అంతేకాదు తమిళంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించే అవకాశాల్ని రాబట్టుకున్నారు. ప్రస్తుతం జయ్ సరసన కొత్త చిత్రంలో నటిస్తూ బిజీగా వున్న తాప్సీ ఇటీవల సినీ కార్యక్రమాల్లో చాలా ఉషారుగా పాల్గొంటున్నారు. అలాంటి సమయంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న ఆమెను ఆగ్రహానికి గురి చేసింది. అది ఏమై ఉంటుందనేగా మీ ఆసక్తి. ఆ మధ్య జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో ఫుట్‌బాల్ క్రీడలో వెండి పతకాన్ని గెలుచుకున్న మ్యాథ్యూస్పో తో మీ ప్రేమాయణం ఎంత వరకు వచ్చిందన్న ప్రశ్నకు తాప్సీకి ఎక్కడలేని కోపం వచ్చేసిందట. దీంతో తన ప్రేమ గురించి చెప్పుకోవలసిన వారెవరైనా ఉంటే అది తన తల్లిదండ్రులేనన్నారు. వే రెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారట. కొన్ని నిజాలు ఇలా నిప్పులనే రగిలిస్తాయని పెద్దలంటుంటారు. అది ఇదేనేమో. -
కాంచన-2లో ప్రమోట్ సాంగ్
ప్రస్తుతం ఏ,బీ,సీ అంటూ వ్యత్యాసం లేకుండా అన్ని ఏరియాల్లోనూ కాంచన-2 విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాంచన వంటి హిట్ చిత్రం తరువాత దానికి కొనసాగింపుగా లారెన్స్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం కాంచన-2. తాప్సీ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ హార్రర్ థ్రిల్లర్ చిత్రం కోసం తాజాగా లారెన్స్ ఒక ప్రమోషన్ సాంగ్‌ను చిత్రీకరిస్తుండడం విశేషం. చిత్రంలో చోటు చేసుకున్న సిల్టా పిల్లాట్ట అనే తొలి పాటను లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్‌లపై చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాట ప్రచారానికే ఉపయోగించనున్నట్లు చిత్రంలో చోటు చేసుకోదని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ పాట చిత్రీకరణను మంగళవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించడానికి లారెన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
దానిపై నాకు నమ్మకం లేదు
మోడలింగ్‌లో నడకలు నేర్చి ఆపై సినిమాలో స్టెప్స్ వేయడం మొదలెట్టిన ఉత్తరాది బ్యూటీ తాప్సీ. హీరోయిన్గా కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఉరకలేస్తున్న పరువంతో పరుగులు పెడుతున్న ఈమె నటిగా ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నారు. అయితే అందం, అభినయాల్లో లోపం చెప్పడానికి వీలులేని తాప్సీ సినిమాలో అనుకున్న స్థాయికి చేరుకోలేదు. కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రమే (ఆడుగళం) జాతీయ అవార్డును గెలుచుకుంది. అయినా తాప్సీ కెరీర్ మెరుగుపడలేదు. అలాంటి ఈ ముద్దుగుమ్మ చాన్నాళ్ల తరువాత సంతోషంతో తుళ్లిపోతున్నారు. కారణం ఆమె నటించిన కాంచన -2 విశేష ప్రజాదరణు పొందడమే. ఈ చిత్రంలో తాప్సీ రెండు కోణాల్లో సాగే పాత్రను చాలా చక్కగా నటించారు. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్. ప్ర: కాంచన-2 చిత్రంలో దెయ్యంగా నటించిన అనుభవం గురించి? జ: చాలా కొత్త ఛాలెంజింగ్ అనుభవం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా రిస్క్ తీసుకుని నటించాను. లారెన్స్ ఎంతో నమ్మకంతో ఈ చిత్రంలో నేనే నటించాలని పట్టుబట్టి నటింప చేశారు. నా దెయ్యం నటన ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ప్ర: దెయ్యం అంటే భయం లేదా? జ: ఆ విషయం గురించి ఎందుకు అడుగుతారు లెండి. దెయ్యం అన్న మాట వింటేనే ఇప్పటికీ ఒంటిలో వణుకు పెడుతుంది. రాత్రుల్లో కూడా ఒంటరిగా నిద్రపోలేను. బామ్మనో, చెల్లెలు కూడా ఉండాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క దెయ్యం చిత్రం కూడా చూడలేదంటే నమ్మండి. చీకటి, నిశ్శబ్దం అన్నా భయమే. ప్ర: కాంచన-2 చిత్రంలో సిగరెట్లు తాగినట్లున్నారు? జ: చాలా దారుణమైన అనుభవం అది. నిజానికి నాకు సిగరెట్ అంటేనే అయిష్టత. షూటింగ్లో సిగరెట్ వెలిగించినప్పుడు ఆ పొగ కళ్లు, ముక్కుల్లోకి వెళ్లి చాలా అవస్థ పడ్డాను. ఆ సన్నివేశానికి 20 టేక్‌లు తీసుకున్నా. మరో విషయం ఏమిటంటే ఆ రోజంతా భోజనం కూడా చేయలేకపోయాను. ఇకపై జీవితంలో సిగరెట్ దరిదాపులకు వెళ్లను. ప్ర: సరే తదుపరి చిత్రం వై రాజా వై గురించి? జ: వై రాజా వై చిత్రంలో నాది అతిథి పాత్రే. అది జూదం నేపథ్యంలో సాగే కథా చిత్రం. ఆ జూదం గురించి ఇతరులకు నేర్పే పాత్ర నాది. హాస్యాస్పదం ఏమిటంటే పేకాట గురించి నాకు ఏ మాత్రం అవగాహన లేదు. ఐశ్వర్య ధనుష్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే నటించాను. ప్ర: చిత్రాల్లో మీడియా జర్నలిస్ట్‌గా నటించారు. నిజ జీవితంలో జర్నలిస్టుగా పని చేయాలనే ఆసక్తి ఉందా? జ: అమ్మో నా వల్ల కాదు. మానసికంగా నలిగిపోయే వృత్తి అది. నిరంతరం టెన్షన్‌తో కూడిన పని. కొత్త కొత్తగా ఆలోచించాలి. అలాంటి వృత్తి నాకు ఖచ్చితంగా సెట్ అవ్వదు. ప్ర: నటి త్రిష వై దొలగిన పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారే? జ: ఆ విషయాలేవీ నాకు తెలియదు. కొత్త చిత్రం నటుడు జయ్ హీరో అన్నారు. కథ విన్నాను. నచ్చింది. నటించడానికి ఓకే చెప్పాను. ప్ర: నెంబర్ వన్ హీరోయిన్ ఆశ ఉందా? జ: అసలు నెంబర్ వన్ స్థానం పైనే నమ్మకం లేదు. త్వర త్వరగా పది చిత్రాలు చేసేసి పోటీ పడే మనస్థత్వం నాది కాదు. నా కంటూ ఆడియన్స్ ఉన్నారు. వారిని అలరించే విధంగా చాలా సెలెక్టివ్ చిత్రాలే చేస్తాను. హీరో పక్క బొమ్మ మాదిరి నిలబడే పాత్రలు, చెట్లు, పుట్టలు, చుట్టూ పాటలు పాడే పాత్రలు నచ్చవు. ప్ర: ఇద్దరు హీరోయిన్ల చిత్రాలే అధికంగా చేస్తున్నారు? జ: నన్నేమి చేయమంటారు. 90 శాతం చిత్రాలిప్పుడు అలాంటివే వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు చిత్రాలు కలర్ఫుల్గా ఉండాలని ఆశిస్తున్నారు. అయినా సింగిల్ హీరోయిన్ పాత్ర వరిస్తే వద్దంటానా! ప్ర: హీరోలు సిఫార్సు చేస్తేనే హీరోయిన్లకు అవకాశాలన్న పరిస్థితిపై మీ అభిప్రాయం? జ: ఈ విషయంలో నిజం లేకపోలేదు. అయితే ఇప్పుడు హీరోల హవానే నడుస్తోంది. వారికే అధిక మార్కెట్ ఉం టుంది. హీరోయిన్ల కోసం ఎవరూ చిత్రాలు చూడటానికి రావడం లేదు. కాబట్టి తనకు ఏ హీరోయిన్ కావాలన్న విషయాన్ని హీరో నిర్ణయించడం తప్పు కాదు. నాకు అలాంటి సిఫార్సులు చేస్తే నేను చాలా చిత్రాలు చేసేదాన్ని. -
చైతూని లారెన్స్ భయపెడుతున్నాడా?
-
మణిరత్నంతో లారెన్స్ ఢీ
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నంతో ప్రముఖ నృత్య దర్శకుడు నటుడు, దర్శకుడు లారెన్స్ ఢీ కొడుతున్నారు. వీరిద్దరి మధ్య పోరు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? వృత్తిపరమైన పోరే లెండి. విషయం ఏమిటంటే రేపు మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కణ్మణి, లారెన్స్ నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కాంచన -2 చిత్రాలు తెరపైకి రానున్నాయి. ఈ రెండు చిత్రాల మధ్య చాలా పోలికలు వున్నాయి. రెండింటిపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాల విజయం ఇటు మణిరత్నంకు, అటు లారెన్స్‌కు చాలా అవసరం కూడా. కారణం మణిరత్నంకు ఇటీవల సరైన హిట్స్ లేవు. అదే విధంగా లారెన్స్ నటించిన ముని-2 (కాంచన) తెరపైకికొచ్చి చాలా కాలమైంది. ఆ తరువాత ఆయన చిత్రాలేవీ విడుదల కాలేదు. అయితే రేపు తెరపై ఢీ కొంటున్న ఓ కాదల్ కణ్మణి, కాంచన-2 రెండూ వేర్వేరు ఇతివృత్తంతో రూపొందిన చిత్రాలే. ఓ కాదల్ కణ్మణి : చాలాకాలం తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన పూర్తి వైవిధ్యభరిత, ప్రేమ కథా చిత్రం ఓ కాదల్ కణ్మణి. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బాలీవుడ్ ప్రముఖ గాయని లీలా సంసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. వివాహం కాకుండానే సహజీవనం చేసే ఓ యువ జంట ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంతో మణిరత్నం ఒక సంచలనానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం మద్రాసు టాకీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ విడుదల చేస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది. కాంచన -2 : లారెన్స్ రూపొందించిన కాంచన చిత్రం అందించిన విజయోత్సాహంతో కాంచన -2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్. కాంచన -2 చిత్రంలో లారెన్స్ పలు వండర్స్ చేశారట. ఏడేళ్ల బాలుడి నుంచి 70 ఏళ్ల బామ్మ వరకు పలు గెటప్‌లలో ఆయన విస్మయం కలిగించనున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్ ఫొటోలు చూసి సూపర్‌స్టార్ రజనీకాంతే ఆశ్చర్యపోయారని లారెన్స్ పేర్కొన్నారు. రాఘవేంద్రస్వామి ఆశీస్సులున్నాయి. నీకు విజయం తథ్యం అని కూడా రజనీకాంత్ ప్రోత్సాహకర వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చిత్రాన్ని సన్స్ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి థియేటర్లకు పైగా విడుదల చేయనుంది. -
కాంచన-2 ఫస్ట్ లుక్ విడుదల
కాంచన-2తో నటుడు, దర్శకుడు లారెన్స్ ఆలస్యమైనా, సరికొత్తగా తెరపైకి రాబోతున్నారు. ముని చిత్రానికి సీక్వెల్‌గా లారెన్స్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన కాంచన చిత్రం తమిళ, తెలుగు భాషల్లో అనూహ్య విజయాన్ని సాధించింది. దీంతో ఆయన కాంచన-2 చిత్ర నిర్మాణానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో లారెన్స్ సరసన నటి తాప్సీ హీరోయిన్. లారెన్స్ చిత్ర షూటింగ్లో అనూహ్యంగా గాయాలకు గురికావడంతో షూటింగ్ ఆలస్యమైంది. తాజాగా, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో తెర మీదకు తెచ్చేందుకు లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఆయన పేర్కొంటూ, ఇది కాంచన -2 అయినా, ఆ చిత్రానికి సీక్వెల్ మాత్రం కాదన్నారు. ఇది పూర్తిగా వేరే కలర్లో ఉండే విభిన్న కథా చిత్రం అని అన్నారు. చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగినా, చిత్రం సరికొత్తగా ఉంటుందన్నారు. చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో తెర మీదకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వె ల్లడించారు. కాంచన-2 తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధం అవుతోందన్నారు.