కాంచన-2 ఫస్ట్ లుక్ విడుదల
కాంచన-2తో నటుడు, దర్శకుడు లారెన్స్ ఆలస్యమైనా, సరికొత్తగా తెరపైకి రాబోతున్నారు. ముని చిత్రానికి సీక్వెల్‌గా లారెన్స్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన కాంచన చిత్రం తమిళ, తెలుగు భాషల్లో అనూహ్య విజయాన్ని సాధించింది. దీంతో ఆయన కాంచన-2 చిత్ర నిర్మాణానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో లారెన్స్ సరసన నటి తాప్సీ హీరోయిన్. లారెన్స్ చిత్ర షూటింగ్‌లో అనూహ్యంగా గాయాలకు గురికావడంతో షూటింగ్ ఆలస్యమైంది. తాజాగా, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబు అవుతోంది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో తెర మీదకు తెచ్చేందుకు లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఆయన పేర్కొంటూ, ఇది కాంచన -2 అయినా, ఆ చిత్రానికి సీక్వెల్ మాత్రం కాదన్నారు. ఇది పూర్తిగా వేరే కలర్‌లో ఉండే విభిన్న కథా చిత్రం అని అన్నారు. చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగినా, చిత్రం సరికొత్తగా ఉంటుందన్నారు. చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో తెర మీదకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వె ల్లడించారు. కాంచన-2 తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధం అవుతోందన్నారు.