
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేశారు వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.

అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనిలో భాగంగా 25వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు.

ముందుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.







































