
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఎలాన్‌మస్క్, సుందర్‌పిచాయ్.. వంటి ప్రముఖులు ఏఐ పుణ్యమా అని మహాకుంభమేళాలో స్టాల్స్ ప్రారంభించినట్లు వీడియో వైరల్ అవుతుంది.

ఈమేరకు సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మకంగా క్రియేట్ చేసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

అందులో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు మహాకుంభమేళాలో స్ట్రీట్ వెండర్లుగా మారినట్లు క్రియేట్ చేశారు.

ఈ వీడియోలో ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సుందర్‌పిచాయ్.. వంటి ప్రముఖులున్నారు.

ఎలాన్ మస్క్ సాంప్రదాయ భారతీయ కుర్తా ధరించి స్టాల్ ఏర్పాటు చేసినట్లు ఇందులో చూపించారు.

ముఖేష్ అంబానీ జియో స్టాల్ వద్ద కనిపించారు.

ఏఐ క్రియేట్ చేసిన ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా చాలామంది వీక్షించారు.



