
వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా జరిగిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. భారత్ తరఫున జైశంకర్ బృందం హాజరుకాగా.. ఆయన్ను ముందు వరుసలో కూర్చోబెట్టారు ట్రంప్.

ఇక ఫస్ట్ లేడీ మెలానియా ఫ్యాషన్ తళకులతో పాటు వేదికపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జంటతో కలిసి ట్రంప్ హుషారుగా సందడి చేయడం ఈవెంట్‌కు ఆకర్షణగా నిలిచాయి.




































