గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.సప్తమి ఉ.11.13 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: చిత్త రా.10.32 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: తె.4.45 నుండి 6.29 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.53 నుండి 9.41 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.46 వరకు, అమృత ఘడియలు: ప.3.19 నుండి 5.06 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.45.
మేషం....కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
మిథునం....సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు.
కర్కాటకం...రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు , ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
సింహం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.
కన్య....మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల..ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
వృశ్చికం....వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
ధనుస్సు...పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం....పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో మీ మాటే శిరోధార్యం.
కుంభం...వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మీనం..పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు.
Comments
Please login to add a commentAdd a comment