
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న కేత్రం పసుపువర్ణ శోభితమైంది. పట్నం వారం సందర్భంగా సోమవారం తోటబావి ప్రాంగణంలో పెద్దపట్నం, అగ్నిగుండాలు అత్యంత వైభవంగా నిర్వహించారు

పంచవర్ణాల పెద్దపట్నం దాటుకుంటూ.. అగ్నిగుండంలో నడుస్తూ మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు

ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణంతో మారుమోగాయి. ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన మానుక పోచయ్య యాదవ్ కుటుంబ సభ్యులు, దుర్గాప్రసాద్‌యాదవ్, యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పెద్దపట్నం, అగ్నిగుండాలను నిర్వ హించారు

శివసత్తులు, భక్తులు బండారు (పసుపు)చల్లుకోవడంతో ఆలయ పరిసరాలు పసుపు మయమయ్యాయి





















