Komuravelli Mallanna Temple
-
Telangana Temple Photos: ఈ ప్రముఖ దేవాలయాలు మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
Komuravelli : వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)
-
కొమురవెల్లిలో ముక్కు అవినాష్
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబసమేతంగా స్వామి వారికి పట్నం వేసిన అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలావుంటే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పలువురు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చదవండి: వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు -
‘తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర’
-
మల్లన్న సన్నిధిలో మహా కుంభాభిషేకం
సాక్షి, సిద్దిపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో శుక్రవారం రాజగోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో ఉజ్జయినితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు పాల్గొన్నారు. చివరి రోజు శుక్రవారం ఆలయ గోపురంపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరు గోపురంపై అభిషేకం నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హరీష్
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్నను మంత్రి హరీశ్ రావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో నిర్వహించదలిచిన పలు అభివృద్ధి పనులకు హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న హుండీ లెక్కింపులో చేతివాటం
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం బయటపడింది. లెక్కింపు జరగుతున్న సమయంలో అందులో పాల్గొన్న ఓ మహిళా చేతివాటం చూపించింది. లెక్కింపు చేస్తున్న క్రమంలో ఎవరి కంటాపడకుండా కొంత బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లడానికి యత్నించింది. ఆలయ ముఖమండపంలో హుండీ లెక్కింపులు నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న ఖాత శాంతమ్మ 5.77 గ్రాముల బంగారు, 5.29 గ్రాముల వెండి ఆభరణాలను తీసుకెళ్తుండంతో మండపం వద్ద తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఆమెను పోలీసులకు అప్పగించారు. -
'కొమురవెల్లి'లో కోడెల వేలం నిలిపివేయండి
- మల్లన్న ఆలయ అధికారులకు కలెక్టర్ ఆదేశం - సాక్షి కథనంతో కదలిక కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో కోడెల వేలాన్ని నిలిపి వేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆల యాధికారులను ఆదేశించారు. ఆలయానికి ఇచ్చిన కోడెలను కబేళాకు అమ్ముకుంటున్న తీరుపై ‘మల్లన్నా.. ఇదేం ఘోరం’ అన్న శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. బుధవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన.. కోడెల అమ్మకంపై విచారణ చేపట్టారు. అనంతరం విలేక రులతో మాట్లాడారు. ఇక నుంచి క్రయవిక్రయాలు చేపట్ట వద్దని ఈవోను ఆదేశించారు. కొమురవెల్లిలో గోశాలను అభి వృద్ధి చేసి గోవులు, కోడెల సంరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయి లో నిర్వహించాలన్నారు. ప్రతి మూడు, 4 నెలలకు ఒకసారి సమీక్షించి ప్రత్యే క చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: ఘోరం మల్లన్నా.. ఘోరం!) వీహెచ్‌పీ ధర్నా: కొమురవెల్లి మల్లన్నకు భక్తులు భక్తితో ఇచ్చే కోడెలను వేలంతో కబేళాలకు తరలింపును నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించింది. ఈ మేరకు ఆలయ ఈఓ రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేసింది. అనంతరం వీహెచ్‌పీ జిల్లా నాయకుడు వీరబత్తిని సత్యనారాయణ మాట్లాడుతూ గోవులను కబేళాకు తరలింపుతో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆలయ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేపట్టాలని కోరారు. -
ఘోరం మల్లన్నా.. ఘోరం!
కబేళాలకు తరలుతున్న కొమురవెల్లి మల్లన్న కోడెలు - వేలం నిర్వహించి కబేళా ఏజెంట్లకు అమ్మేస్తున్న ఆలయ అధికారులు - రెండు మూడు నెలలకోసారి విక్రయం - సిండికేట్‌గా మారి కొంటున్న బేరగాళ్లు - అక్కడ్నుంచి లారీల ద్వారా హైదరాబాద్‌లోని కబేళాలకు తరలింపు - భక్తితో సమర్పించిన కోడెల్ని కోతకు పంపడంపై భక్తుల ఆగ్రహావేశాలు (వర్దెల్లి వెంకటేశ్వర్లు) కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. భక్త జనుల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్నకు కోడె కడితే కోరుకున్న కొడుకు పుడతాడట! కొండరాళ్ల నడుమ పుట్ట మన్నుతో రూపం పోసుకున్న ఆ మల్లికార్జునుడికి తిరుగుడు కోడెను ఇస్తే కోరిన కోరిక తీరుతుందట!! ఈ విశ్వాసంతో భక్తులు మొక్కుబడి కింద కోడెలు, దూడలను మల్లన్నకు సమర్పించుకుంటారు. కానీ ఆ భక్త వత్సలుడి మూగజీవాలు కబేళాలకు తరలిపోతున్నాయి. పశు పోషణ భారం నుంచి తప్పించుకునేందుకు ఆలయ అధికారులే వాటిని కబేళాల ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. నెలనెలా పదుల సంఖ్యలో వస్తున్న పశువులను ఎప్పటికప్పుడు వేలం వేసి వారికి ఇచ్చేస్తున్నారు. ఓ అజ్ఞాత భక్తుడు ‘సాక్షి’కి చేరవేసిన సమాచారంతో కూపీ లాగగా... మల్లన్న లేగదూడలు గత కొన్నేళ్లుగా కోతకు, కబేళాలకు తరలిపోతున్నట్లు తేలింది. రెండు మూడు నెలలకోసారి వేలం సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొలువైన మల్లన్నకు లేగ దూడలు, కోడెలు అంటే చాలా ఇష్టం. సంతానం లేని దంపతులు, దారిద్య్రంతో బాధపడుతున్న భక్తులు కోనేటిలో తడిబట్ట స్నానం చేసి ఆలయం ముందు ఒళ్లు బండ వద్ద మల్లన్న దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. కోరుకున్న కోరిక తీరగానే మల్లన్నకు ఇష్టమైన కోడెలను కట్టి మొక్కు తీర్చుకుంటారు. ఇలా ప్రతినెలా పదుల సంఖ్యలో కోడెలు, దూడలను భక్తులు స్వామివారికి మొక్కులుగా చెల్లిస్తున్నారు. ఈ మూగజీవాలను పోషించడం వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం అన్న కారణంతో ఆలయ అధికారులు ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి వేలం పాటలు నిర్వహించి వాటిని విక్రయిస్తున్నారు. మూడేళ్లుగా కోతకే.. గడిచిన మూడేళ్లుగా ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెల వివరాల నివేదికలను, ఆలయ అధికారులు వేలం వేసిన రికార్డులను ‘సాక్షి’పరిశీలించింది. 2014లో ఐదుసార్లు, 2015లో ఆరుసార్లు, 2016 ఐదు పర్యాయాల చొప్పున పశువులను వేలం వేసినట్టు రికార్డుల్లో ఉంది. అన్నిసార్లు జరిగిన వేలం పాటల్లోనూ కేవలం ఆరు నుంచి ఏడుగురే పాల్గొని పశువులు దక్కించుకున్నట్టు తేలింది. చిరునామాల ఆధారంగా ‘సాక్షి’వారి వివరాలను సేకరించింది. చేర్యాల మండలం నర్సాయపల్లి, వేచరేణి గ్రామాలకు చెందిన ముగ్గురు సభ్యుల చొప్పున ఉన్న రెండు సిండికేటు బేరగాళ్లను గుర్తించి వారితో మాట్లాడింది. దీనిపై వారిని కదిలించగా.. ‘‘వేలం పాటలు వేసే ముందు దేవాలయం అధికారుల నుంచి మాకు ఫోన్ వస్తుంది. వేలంలో పశువులు తీసుకుంటాం. వాటిని ఎక్కువ రోజులు మా దగ్గర ఉంచుకోం. కొంత లాభం చూసుకొని అమ్ముకుంటాం. పశువులు కోతకు పోతాయి. చేర్యాల, సిద్దిపేట అంగడికి తీసుకపోతాం. అక్కడికి హైదరాబాద్ ఏజెంట్లు వచ్చి లారీల్లో తీసుకుపోతారు’’అని చెప్పారు. బాబుమియానే సాక్ష్యం... కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన ఓ బేరగాడు రూ.3,400, రూ.2,400, రూ.3,200, రూ.2,700, రూ.3,900, రూ.3,800, రూ.16,200 చొప్పున 7 కోడెలను వేలం పాటలో కొనుగోలు చేశాడు. పశువుల వ్యాపారం చేసే ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘బతకడానికి ఏదో పనిచేసుకోవాలే కదా. కొమురవెల్లి దేవుడికి మొక్కులు తీర్చేటోళ్లు అప్పగించే లేగలు, దూడలను వేలం పాటలో కొంటా.. కమీషన్ మీద కబేళాకు విక్రయిస్తా.. వాటిపై వచ్చే కొద్దిపాటి పైసలతో ఇళ్లు గడుస్తుంది. కొమురవెల్లి దేవస్థానం నుంచి బాగా తెలిసినోళ్లు వేలంపాట అప్పుడు నాకు ఫోన్ చేస్తరు. వెంటనే పోయి పాటలో పాల్గొని అన్నింటినీ కొనుక్కుంటా. ఒక్కొక్కసారి తక్‌పట్టీలు(రశీదులు) ఇత్తరు.. ఒక్కోసారి ఇయ్యరు..’’అని ఆయన చెప్పాడు. దేవాలయం నుంచి కబేళా దాకా.. ఈ ఏడాది నవంబర్ 25న ఆలయ అధికారులు పశువుల వేలం నిర్వహించారు. ఇద్దరు సిండికేటు బేరగాళ్లు రూ.6,300, రూ.6,000, రూ.1,400, రూ.3,600, రూ.19,000, రూ.7,000, రూ.5,000 చొప్పున ఏడు కోడెలను కొనుగోలు చేశారు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన ఫొటో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆ కోడెలను వాళ్లు డిసెంబర్ 2న నేరుగా హుస్నాబాద్ అంగడికి తోలుకెళ్లారు. అంగట్లో కబేళా ఏజెంట్లకు విక్రయించారు. వారు అక్కడ్నుంచి వాటిని లారీలో కుక్కి హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. అంతకుముందు జరిగిన వేలం పాటలో (సెప్టెంబర్ 3న) చేర్యాలకు చెందిన మరో వ్యక్తి రూ.5 వేల చొప్పున రెండు, రూ.23,000, రూ.1,800, రూ.1,000 చొప్పున మొత్తం ఐదు కోడెలను కొనుగోలు చేశారు. వాటిని ఆయన వారానికి ఒకటి చొప్పున కోత కోసి మాంసం విక్రయిస్తున్నాడు. ఎంతో భక్తిశ్రద్ధలతో మల్లన్నకు మొక్కుగా చెల్లించిన కోడెలను కబేళాలకు తరలించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవే పశువులను హుస్నాబాద్ అంగడి నుంచి లారీలో తీసుకుపోతున్న కబేళా ఏజెంట్లు