
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్నను మంత్రి హరీశ్ రావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో నిర్వహించదలిచిన పలు అభివృద్ధి పనులకు హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment