
మల్లన్న గోపురం దగ్గర హరీశ్, తలసాని
సాక్షి, సిద్దిపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో శుక్రవారం రాజగోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో ఉజ్జయినితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు పాల్గొన్నారు. చివరి రోజు శుక్రవారం ఆలయ గోపురంపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరు గోపురంపై అభిషేకం నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment