మల్లన్న హుండీ లెక్కింపులో చేతివాటం
Published Thu, Mar 30 2017 3:39 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం బయటపడింది. లెక్కింపు జరగుతున్న సమయంలో అందులో పాల్గొన్న ఓ మహిళా చేతివాటం చూపించింది. లెక్కింపు చేస్తున్న క్రమంలో ఎవరి కంటాపడకుండా కొంత బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లడానికి యత్నించింది. ఆలయ ముఖమండపంలో హుండీ లెక్కింపులు నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న ఖాత శాంతమ్మ 5.77 గ్రాముల బంగారు, 5.29 గ్రాముల వెండి ఆభరణాలను తీసుకెళ‍్తుండంతో మండపం వద్ద తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఆమెను పోలీసులకు అప్పగించారు.
Advertisement
Advertisement