hundi
-
అయ్యయ్యో! నా ఐఫోన్ మురుగా..
సేలం(తమిళనాడు): ఆలయ హుండీలో పొరపాటుగా ఏది పడినా అది దేవుడికే సొంతమని పలు సినిమాల్లో సన్నివేశాలు మనం చూసి ఉంటాం. అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులోని తిరుపూర్‌లో చోటుచేసుకుంది. తిరుపోరూర్లోని మురుగన్ ఆలయానికి గత రెండు నెలల క్రితం చెన్నై అంబత్తూరుకు చెందిన దినేష్ దర్శనానికి వెళ్లాడు. ఆ సమయంలో దినేష్ హుండీలో కానుకలు వేస్తున్న సమయంలో పొరపాటుగా ఆయన చేతిలో ఉన్న ఐఫోన్ కూడా హుండీలో పడిపోయింది. ఈ విషయంగా ఆయన హిందూ దేవదాయ శాఖకు ఫిర్యా దు చేయగా, హుండీ లెక్కింపు సమయంలో తె లుపుతామని నిర్వాహకులు చెప్పి పంపించారు. ఈ స్థితిలో గురువారం ఆలయ హుండీని తెరి చారు. iPhone accidentally fell into the temple's hundi..The temple administration refused to return it the owner, saying it belonged to the temple.pic.twitter.com/4VgfcRk0Ib— Vije (@vijeshetty) December 20, 2024ఈ సందర్భంగా దినేష్‌కు సమాచారం ఇవ్వడం తన ఫోన్ తీసుకోవచ్చని ఎంతో ఆశగా ఆలయానికి వెళ్లాడు. హుండీ తెరిచిన ఆలయ నిర్వాహకులు దినేష్‌కు ఐఫోన్ చెందదని, హుండీలో ఏది పడినా మురుగనార్పణమేనని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. తర్వాత చేసేది లేక తన ఐఫోన్లో సిమ్‌కార్డును తీసుకుని, స్వామిని దర్శించుకుని నిరాశతో వెళ్లిపోయాడు. Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు -
వడ్డీ కాసులవాడా... గోవిందా..!
కేరళలోని కొట్టాయం పట్టణం. పేరెన్నిక గన్న ఆడిటర్ అతడు. డబ్బుకేమీ లోటు లేని అతన్ని పిల్లలు లేరన్న చింత ఒక్కటే పీడిస్తోంది. దాంతో ఏడుకొండల వాడిని ప్రార్థించాడు. మగ పిల్లవాడు పుడితే తన చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించింది కాబోలు... ఏడాదికే మగ పిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు ఆ ఆడిటర్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే, ‘ఈ వారం పోదాము, వచ్చే వారం పోదాము’ అని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు.ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టు పట్టేసరికి కొడుకు ఐదో పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకొచ్చింది. చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఈ ఉంగరం ఖరీదు పది హేనువేలు, ఇప్పుడు దీని ఖరీదు ఇరవై వేలు. ఈ ఉంగరం ఉంచేసుకుని స్వామి వారి హుండీలో పదిహేను వేలు వేద్దామనుకున్నాడు. కొడుకును తీసుకుని తిరుమల కొండ చేరాడు. ఆరోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ, ఎలాంటి తొడుగు లేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామి. ఆపాదమస్తకం కన్నులారా తిలకించి ‘‘ధన్యుడిని స్వామీ...’’ అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడానికి కొడుకును తీసుకుని హుండీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుకున్నట్లే పదిహేనువేల నూట పదహార్లు హుండీలో వేసి ‘‘మొక్కు చెల్లించేశాను స్వామీ... బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను. రుణ విముక్తుడినైనాను’’ అని హుండీకి దండం పెట్టుకుని అక్కడినుంచి కదిలాడు.తండ్రీ కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్నచిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికి లాగే తనకి ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తియ్య తియ్యగా ఉన్న లడ్డును ఆ అయిదేళ్ళ పిల్లవాడు గబగబా తినేశాడు. ‘‘అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్నా వీళ్ళు?’’ అని ఆశగా అడిగాడు. ‘ఒక్కరికి ఒక్కటే బాబూ... కావాల్సి ఉంటే నా లడ్డు తీసుకో!’’ అని కొడుకు చేతికి ఇచ్చాడు.తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా ‘‘నీ ఉంగరం ఏది నాన్నా?’’ అని అడిగాడు.అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ‘ఏమి జరిగిందా...’ అని లిప్తపాటు కళ్ళు మూసుకుని ఆలోచించాడు.ఆరు నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టడం లీలగా గుర్తుకొచ్చింది. అలాగే వైకుంఠం షెడ్డుల్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా అనిపించి దారాన్ని తీసివేయడం కూడా స్ఫురణకు వచ్చింది.‘అంటే... హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్న మాట. నిద్ర లేచింది మొదలు, రాత్రుల్లో నిద్ర పోయేంత వరకు డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ వడ్డీ కాసులవాడు... ఎంత తప్పు చేశాను... స్వామీ నన్ను క్షమించు!!’’ అని తలెత్తి ధ్వజ స్తంభానికి భక్తితో నమస్కరించి లెంపలేసుకున్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
చిల్లర లేకపొతేనేం.. క్యూఆర్ ఉందిగా!
ఆధునిక సాంకేతికత అంతటా యమ వేగంగా అల్లుకుపోతూ ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపుల యుగం నడుస్తోంది. అందులో భాగంగా ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం తదితర పద్దతుల్లో ప్రజలు సొమ్ము చెల్లింపు, ఇతర లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు క్యూఆర్ కోడ్‌ను కూడా అనుసరిస్తున్నారు. ఈ పద్ధతిని ఓ ఆలయ నిర్వాహకులు కూడా అందిపుచ్చుకున్నారు. భక్తులు నగదు అందుబాటులో లేదని సరిపుచ్చుకొని వెళ్లిపోకుండా క్యూ ఆర్ స్కానింగ్ పద్ధతి కూడా అందుబాటులో ఉందని తెలుపుతూ హుండీపై స్టిక్కర్‌ను ఏర్పాటు చేశారు. హుండీలో కానుకగా వేసేందుకు నగదు అందుబాటులో లేని భక్తుల కోసం ఈ క్యూర్ కోడ్‌ను ‘కానుక’గా ఏర్పాటుచేశారు. –కడప కల్చరల్ -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పిస్తున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 22 రోజులకు గాను రూ.2,92,28,842ల నగదు లభించింది. సరాసరిన రోజుకు రూ.13.28 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు. 740 గ్రాముల బంగారం, 6.95 కిలోల వెండి, భారీగా ఇతర దేశాల కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ–హుండీ ద్వారా రూ.89,193 విరాళాలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు సమర్పించినట్లు చెప్పారు. -
శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుండీలు!
తిరుమల: శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుండీలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అందులో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలోకి స్టీల్‌తో తయారు చేసిన ఐదు అడుగుల హుండీని ప్రయోగాత్మకంగా తీసుకెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలను ఉంచి అందులో భక్తులు కానుకలు సమర్పించేలా హుండీలను, మరికొన్ని ఇత్తడి హుండీలను ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. వీటిని శ్రీవారి సేవకులు, బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ట్రాలీల్లో శ్రీవారి ఆలయం నుంచి బయటకు, అక్కడి నుంచి లిప్టు ద్వారా లారీలో ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి నూతన పరకామణికి తరలిస్తున్నారు. అయితే ఇటీవల హుండీ తరలింపు సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నూతన హుండీలను తయారు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొంత మంది ఆలయంలోకి ప్రవేశించి హుండీలో భక్తులు నగదు వేస్తున్న సమయంలో హుండీ లోపలకు చేయిపెట్టి చోరీ చేసిన సంఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఇబ్బందులు రాకుండా నూతన హుండీలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నూతన హుండీలో మూడు వైపులా భక్తులు నగదు వేయవచ్చు. అదే సమయంలో ఇందులో భక్తుడి చేయి పూర్తిగా దూరే అవకాశం లేదు. మధ్యలో ఓ ఇనుప చువ్వను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నూతన హుండీ పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. వినియోగం సులభంగా ఉంటే దీనినే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నేడు శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవం తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. -
తిరుమల హుండీ ఆదాయంపై కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
తిరుమల: తిరుమల హుండీ ఆదాయంపై ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హుండీలో కానుకలు వేయడం స్వార్థపూరితమన్నారు. అవి ఏ ట్రస్టుకో పూజారికో వెళ్తాయంటూ కామెంట్స్ చేశారు. కానుకలతో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు అని నోటి దురుసు ప్రదర్శించారు. కమలేశ్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. తమ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. చదవండి: హుండీ ఆదాయంలో రికార్డుల మోత -
యాదాద్రీశుడికి కలిసొచ్చిన కార్తీక మాసం.. ఆదాయం రెండింతలు!
యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయానికి ఈ కార్తీక మాసం కలిసొచ్చింది. గతేడాది కార్తీక మాసంతో పోల్చుకుంటే ఈసారి అన్ని విభాగాల ద్వారా ఆదాయం డబుల్ అయింది. చివరి రెండు ఆదివారాలు భక్తులు 50వేల కంటే ఎక్కువగా వచ్చి స్వామిని దర్శించుకోవడంతో నిత్యా ఆదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. ఇక సత్యనారాయణస్వామి వ్రతాలు సైతం ఈసారి అధికంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈఓ గీతారెడ్డి బుధవారం రాత్రి వెల్లడించారు. ఆదాయం రెండింతలు.. గతేడాది కార్తీక మాసంలో రూ.7,35,10,307 ఆదాయం రాగా, ఈసారి రూ.14,66,38,097 ఆదాయం వచ్చింది. యాదాద్రి ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైన తర్వాత క్షేత్రానికి భక్తులు రాక అధికంగా పెరిగింది. స్వయంభూ దర్శనం పునఃప్రారంభం అయిన తరువాత మొదటిసారి వచ్చిన కార్తీక మాసం కావడంతో స్వామివారికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. వ్రతాలతో రూ.1.71కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తర్వాత యాదాద్రిలోనే భక్తులు అధికంగా సత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఈ కార్తీక మాసంలో 21,480 సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా రూ.1,71,84,000 ఆదాయం చేకూరినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది బాలాలయం ఉన్న సమయంలో 19,176 వ్రతాలు మాత్రమే జరిపించారు. రికార్డు స్థాయిలో నిత్యాదాయం.. కార్తీకమాసం చివరి రెండు ఆదివారాలు 50వేలకు పైగానే భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 13న ఆదివారం రోజున స్వామి వారికి రూ.1,09,82,446 నిత్య ఆదాయం రాగా, 20న ఆదివారం రోజున రూ.1,16,13,977 నిత్య ఆదాయం వచ్చింది. కార్తీక మాసం చివరి ఆదివారం వచ్చిన ఆదాయమే ఆలయ చరిత్రలో అధికమని అధికారులు వెల్లడించారు. (క్లిక్ చేయండి: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు) -
అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ఆదాయాన్ని బుధవారం స్థానిక శివాలయం వీధిలో ఉన్న పైడితల్లి అమ్మవారి కల్యాణ మంటపంలో లెక్కించారు. 90రోజులకు సంబంధించి చదురుగుడి, వనంగుడి హుండీల్లో సమకూరిన ఆదాయాన్ని లెక్కించగా వాటిలో ఫారిన్ కరెన్సీని అమ్మవారికి భక్తులు కానుకలుగా అందజేశారు. 18 డాలర్స్ యుఎస్ఏ కరెన్సీ, పది సింగపూర్ డాలర్స్, కువైట్‌కు ఒక దినార్, యుఏఈకి చెందిన 10 దిర్హమ్స్, నేపాల్‌కు 10 రూపీస్ విదేశీ కరెన్సీని ఆదాయం లెక్కింపు సందర్భంగా హుండీల్లో గుర్తించినట్లు ఆలయ ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిశోర్ కుమార్ వెల్లడించారు. చదురుగుడి హుండీల నుంచి రూ.35 లక్షల 18వేల 290 నగదు, 50 గ్రాములు 100 మిల్లీగ్రాముల బంగారం, 601 గ్రాముల వెండి లభించాయన్నారు. అలాగే వనంగుడి హుండీల నుంచి రూ.7 లక్షల 13వేల 082 నగదు, ఒక గ్రా ము 40 మిల్లీగ్రాముల బంగారం, 45 గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పైడితల్లి భక్తబృందం సేవా సమితి సభ్యులు, పాలకమండలి సభ్యులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
పోలీసులకు చిక్కిన హుండీల దొంగ
అచ్యుతాపురం(అనకాపల్లి): చిన్న చిన్న ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడే ఘరానా దొంగ అచ్యుతాపురం పోలీసులకు గురువారం చిక్కాడు. ఎస్ఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా సంచరిస్తున్న అప్పలరాజును పోలీసులు విచారించి అసలు విషయాన్ని రాబట్టారు. విశాఖ జ్ఞానపురానికి చెందిన అప్పలరాజుపై అనేక కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న అచ్యుతాపురం మండలంలోని ఉప్పవరం ఆంజనేయస్వామి ఆలయంలో రూ.9వేలు, ఫిబ్రవరి 23న మునగపాక మండలం టి.సిరసపల్లి వీరభద్రస్వామి ఆలయంలో రూ.6వేలు, మే 21న పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3వేలు, మే 25న సబ్బవరం మండలం జోడుగుళ్లు ప్రాంతంలో బంగారమ్మతల్లి ఆలయంలో చోరీకి ప్రయత్నించినట్టుగా పోలీసులు విచారణలో రాబట్టారు. అప్పలరాజు రాత్రి వేళల్లో మద్యం సేవించి చిన్న ఆలయాల్లో హుండీలు లక్ష్యంగా చోరీలకు పాల్పడతాడని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇతనిపై విశాఖనగరంలో 20 కేసులు ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. నాపై తప్పుడు కేసు... విచారణ చేయండి’ మాకవరపాలెం : తనపై నమోదైన తప్పుడు కేసుపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కొత్తపాలెం గ్రామానికి చెందిన యాకా లోవరాజు పోలీసులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశాడు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడంటూ లోవరాజుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం లోవరాజు విలేకరులతో మాట్లాడాడు. తహసీల్దార్ సంతకాన్ని తాను ఫోర్జరీ చేయలేదని తెలిపాడు. నిర్వాసిత కాలనీలో పట్టా కోసం అధికారులను కోరగా అప్పట్లో పనిచేసిన వీఆర్వో రూ.80వేలు అవుతుందని చెప్పడంతో మొదట రూ.10 వేలు ఇచ్చానన్నాడు. అనంతరం రూ.70వేలు సిద్ధం చేసుకోవాలని చెప్పగా నగదు పట్టుకుని వెళ్లానన్నాడు. వీఆర్వో తహసీల్దార్ ఇంటికి తీసుకెళ్లి నగదు తీసుకుని పట్టా ఇచ్చినట్టు తెలిపాడు. తీరా ఇప్పుడు ఈ పట్టా నకిలీదని, తానే సృష్టించానని తహసీల్దార్ తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు. ఈ విషయమై తహసీల్దార్ రాణీ అమ్మాజీని వివరణ కోరగా నగదు తీసుకున్నట్టు చెబుతున్న వీఆర్వో కన్నయ్య మరణించాడని, పట్టా తాను ఇవ్వలేదన్నారు. అది నకిలీ పట్టా కావడంతోనే ఫోర్జరీ సంతకంపై కేసు పెట్టినట్టు తెలిపారు. (చదవండి: హుండీలను కొల్లగొట్టే ముఠా అరెస్ట్) -
రామయ్య హుండీ ఆదాయం రూ.2 కోట్లు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. 59 రోజులకు హుండీల ద్వారా రూ.2,00,22,897 ఆదాయం లభించింది. ఈ నగదుతో పాటు 140 గ్రాముల బంగారం, 2.500 కేజీల వెండి వచ్చాయి. 780 అమెరికన్ డాలర్లు, 300 మలేషియా రింగిట్స్, 150 ఆస్ట్రేలియా డాలర్లు, 100 రష్యా రూబుల్స్, 30 దీరామ్స్, 101 బూటాన్ కరెన్సీ, ఒక సౌదీ రియాల్ లభించాయి. రెండేళ్ల అనంతరం శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం వేడుకలను మిథిలా స్టేడియంలో నిర్వహించడంతో అ«ధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి రామయ్యకు రూ.2 కోట్లకు పైగా ఆదాయం లభించిందని ఈవో శివాజీ తెలిపారు. -
హుండీని పెకలించి చోరీకి యత్నం
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో వారు గట్టిగా కేకలు వేయడంతో హుండీ అక్కడే వదిలి ఆటోతో సహా పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయాల్లో నగలు చోరీ శివమొగ్గ: బసవనగంగూరు గ్రామంలోని గుళ్లమ్మ, మాతంగమ్మ దేవాలయాల్లో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి దొంగలు చొరబడి దేవతామూర్తులకు అలంకరించిన రూ.లక్ష విలువైన బంగారు నగలు, హుండీలోని కానుకలను ఎత్తుకెళ్లారు. 14 బైక్‌లు స్వాధీనం యశవంతపుర: దేవస్థానాల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న మైసూరు జిల్లా శ్రీరంగపట్టణకు చెందిన శివకుమార్ అనే దొంగను చంద్రాలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.11.35 లక్షల విలువైన 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇతను జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర) -
‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’
మహానంది: ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న చందంగా ..ఓ పిల్లి కూన మహానందిలోని రామాలయం హుండీలోకి దూరింది. అందులో నుంచి బయటికి రాలేకపోయింది. శుక్రవారం ఉదయం విధులకు వచ్చిన అర్చకులు గుర్తించి విషయాన్ని ఈఓ మల్లికార్జున ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం హుండీల తాళాలు ఒకసెట్ దేవస్థానం వారి వద్ద, మరో సెట్ కర్నూలులోని ఏసీ కార్యాలయంలో ఉంటాయి. దీంతో ఈఓ విషయాన్ని ఏసీ దృష్టికి తీసుకెళ్లడంతో దేవదాయశాఖ నంద్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలుకు వెళ్లి తాళాలు తీసుకొచ్చారు. అనంతరం ఈఓ సమక్షంలో సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో హుండీ తాళాలు తెరచి పిల్లిపిల్లను బయటికి తీశారు. బయటికి వచ్చి వెంటనే అది తల్లి వద్దకు పరుగుపెట్టుకుంటూ వెళ్లింది. చదవండి: మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. విషాదం: కన్నీరే మిగిలిందిక నేస్తం! -
దేవుడి హుండీల్లో అశ్లీల చీటీలు, కండోమ్‌లు..
యశవంతపుర: ఆలయాల్లోని హుండీల్లోకి అశ్లీల సందేశాలు రాసిన చీటీలు,కండోమ్స్ వేసిన మంగళూరులోని జొకట్టి నివాసి అబ్దుల్‌రహీం, అబ్దుల్ తౌఫీక్ అనే నిందితులను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బుధవారం ఎమ్మెకెరె కొరగజ్జ ఆలయంలో ఉండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితులు మూడు నెలలుగా పాండేశ్వర, కద్రి, ఉళ్లాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలయాల్లో ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. -
నిండిన హుండీలు.. భక్తులకు తిప్పలు
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీలు నిండిపోయాయి. దీంతో కానుకలు వేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ గర్భగుడి, అంత ర్భాగంలో మొత్తం 18 హుండీలు ఉండగా.. 13 హుండీలు నిండాయి. భక్తులు కానుకలు వేయకుండా అధికారులు హుండీలకు వ్రస్తాన్ని చుట్టారు. దీంతో భక్తులు ఆలయ పరిసరాల్లో కానుకలను సమర్పించుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. జనవరి 27న హుండీలు లెక్కించగా.. రూ.10.80 కోట్ల ఆదాయం సమకూరింది. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. చిల్లర నాణేలను బ్యాంకర్లు తీసుకోకపోవడం.. లెక్కింపులోనూ జాప్యం జరగడంతో హుండీలు నిండిపోవడానికి కారణమని చెబుతున్నారు. బుధవారం హుండీలను లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని, చిల్లర సమస్యపై దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. -
ఆన్లైన్ హుండీ
-
ఈ వీధి కుక్క సూపర్...
రొంపిచర్ల (నరసరావుపేట): గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో గల నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఆదివారం రాత్రి దొంగలు దేవాలయం తాళాలు పగులకొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. ఈ హుండీలో భక్తులు సమర్పించిన సుమారు రూ.50 వేలు నగదు, కేజీ వరకు వెండి వస్తువులు ఉండవచ్చని భావిస్తున్నారు. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు అందులో ఉన్న వెండి, నగదును తీసుకుని, హుండీని పెద్ద చెరువులో పడేశారు. అయితే గుడి పరిసరాల్లోనే పెరుగుతున్న ఓ శునకం ప్రతిరోజూ గుడికి వచ్చే ఓ ముసలమ్మను కాలితో గీకి సైగలు చేసింది. దేవాలయం తలుపు తాళాలు పగులకొట్టిన దొంగలు ఆ వృద్ధురాలు శునకం చేష్టలను గమనించి దాని వెంట వెళ్లగా, అది చెరువు వద్దకు తీసుకువెళ్లింది. చెరువులో హుండీ కన్పించింది. శునకం అక్కడ నుంచి అన్నారం డొంక రోడ్డులోకి తీసుకెళ్లటంతో అటు వైపే దొంగలు వెళ్లి ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. గుడి వద్దే భక్తులు పెట్టే ప్రసాదాలతో జీవిస్తూ, అమ్మవారిపై విశ్వాసంతో హుండీ జాడను చూపించిన శునకాన్ని పోలీసులు, గ్రామస్తులు మెచ్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దోచుకున్న సొమ్ముతో ఇళ్లు..షికార్లు!
చిత్తూరు అర్బన్: అత్తసొమ్ము అల్లుడిదానం అంటే ఇదేనేమో. మోసం చేసి దోచుకున్న సొమ్ముతో జల్సా చేయడంతో పాటు అమ్మవారి ఆలయంలోని హుండీలో కూడా రూ.లక్షలు వేశాడు. కుటుంబ సభ్యుల్ని దేశంలోని పలు ప్రాంతాలకు టూర్లకు పంపాడు. ఇవన్నీ చేసింది గుడుపల్లెలో పట్టుబడ్డ రైస్‌పుల్లింగ్ కేసు ప్రధాన నిందితుడు మహదేవ లీలలివి! ఇతనితో పాటు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రూ.1.29 కోట్ల నగదు సీజ్ చేయడం విదితమే. బాధితుడుగా ఉన్న తిరుపత్తూరుకు చెందిన నవీన్ వాస్తవానికి రూ.2.18 కోట్లు ఈ ముఠాకు విడతల వారీగా అందజేశాడు. పోలీసులు 1.29 కోట్లు, రూ.20 లక్షల విలువైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.80 లక్షల వరకు రికవరీ చేయలేకపోయారు. దీనికి నిందితులు చెప్పిన లెక్కలు చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. ప్రధాన నిందితుడు మహదేవకు గుడుపల్లెలో ఉన్న తన ఇంటికి రిపేర్లు చేయించడం, మూడు ఏసీలు పెట్టడం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) పనులు చేయించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక తనతో పాటు మిగిలిన నిందితుల కుటుంబ సభ్యుల్ని ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలకు విహారయాత్రలకు పంపించాడు. ఇందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఇక వచ్చిన సొమ్ములో రూ.3 లక్షల వరకు నగదును కుప్పంలోని ఓ అమ్మవారి హుండీలో వేశాడు. అలాగే గ్రామస్తులు శబరిమలైకు వెళ్లాలంటే వారికి అన్నదానాలు చేయడంతో పాటు ఓ బస్సును ఏర్పాటుచేసి అన్ని ఖర్చులు తానే భరించి శబరిమలైకు పంపినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలను రాబట్టేందుకు నిందితులను పోలీసులు కస్టడీకు తీసుకోనున్నారు. నిందితులను 5 రోజులు పాటు కస్టడీకు కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు అధికారులు చెప్పారు. -
ఆలయంలోని హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు
సాక్షి, తూర్పుగోదావరి : స్థానిక కాపుల కాలనీలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో హుండీని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. స్థానికులు, ఆలయ కమిటీ కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఆలయం బయట గేటుకున్న తాళాలు తీసి లోపలికి వచ్చి హుండీని ఎత్తుకెళ్లిపోయారని, ఆ హుండీలో సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. చోరీ సంఘటన మొత్తం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైంది. ఉదయం చోరీ జరిగిన సంగతి తెలుసుకున్న కమిటీ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. కాగా ఆలయంలో చోరీ జరగడం ఇది రెండో సారి. -
కసుమూరు దర్గాలో దొంగలు పడ్డారు
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గా హుండీ వేలం వాయిదా పడడం దోపిడీదారులకు వరంగా మారింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా వక్ఫ్ బోర్డు అధికారులు, కొందరు వ్యక్తులు హుండీలో భక్తులు వేసిన నగదును దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. వక్ఫ్ బోర్డులోని కొందరికి వాటాలు వెళుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, వెంకటాచలం: మండలంలోని కసుమూరులో కాలేషాపీర్ మస్తాన్‌వలీ దర్గా ఉంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వక్ఫ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో దర్గా కార్యకలాపాలు సాగుతుంటాయి. వేలం పాటలు నిర్వహించి దర్గా హుండీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. వేలంపాట వాయిదా పడితే హుండీ నగదును వక్ఫ్ బోర్డు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో లెక్కించాల్సి ఉంది. గతేడాది హుండీ వేలంపాట జరగ్గా రూ.1.50 కోట్లకు వేలంపాటదారులు దక్కించుకున్నారు. దీని గడువు ఈ ఏడాది జనవరి 5వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి వక్ఫ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలోనే హుండీ నిర్వహణ సాగుతోంది. చర్యలు చేపట్టలేదు జనవరి 5వ తేదీ తర్వాత హుండీ వేలం గురించి వక్ఫ్ బోర్డు అధికారులు దృష్టి సారించలేదు. వేలం నిర్వహణకు సంబంధించి పలువురు కాంట్రాక్టర్లు వక్ఫ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. హుండీలో భక్తులు కానుకలుగా వేసిన నగదును తొలిసారి 53 రోజులకు వక్ఫ్‌బోర్డు అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపు ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారనే విమర్శలున్నాయి. ఈ లెక్కింపులో రూ.7.50 లక్షలు వచ్చినట్లు బోర్డు అధికారులు చెప్పడంతో స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గోప్యంగా ఉంచడంతో.. రెండో దఫాగా ఈనెల 12వ తేదీన 70 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. అయితే లెక్కింపు ప్రారంభమైన తర్వాత స్థానికులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకుని వక్ఫ్ బోర్డు అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హుండీ నగదును పక్కదారి పట్టించేందుకే రహస్యంగా లెక్కింపు చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. స్థానికులు ఆందోళన చేస్తున్న సమయంలోనే హుండీ లెక్కింపు వీడియో తీసుకున్న ప్రైవేట్ వ్యక్తికి బోర్డు సూపరింటెండెంట్ రూ.5 వేలు నగదు ఇవ్వగా ఇతరుల చేత ఆ నగదును బయటకు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు, వీఆర్వోకు చెప్పడంతో ఆ నగదును వెనక్కి తీసుకువచ్చారు. మరో ఘటనలో.. ఓ వ్యక్తి హుండీ నుంచి కిందపోసిన నగదులో ఓ కట్టను తీసుకుని బయటకు వెళ్లగా స్థానికులు వెంబడించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని నగదును లెక్కింపు వద్దకు చేర్చారు. ఈ విషయాల ఆధారంగా హుండీ నగదు దోచేస్తున్నారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హుండీ వేలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రతి ఏటా జనవరి నుంచి మే నెల వరకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నగదు వచ్చేదని పలువురు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది జనవరి ఐదో తేదీ నుంచి మే నెల 12వ తేదీ వరకు కేవలం రూ.19.75 లక్షలు వచ్చినట్లు చూపడంతో హండీ నగదు దోపిడీ చేస్తున్నారని అనేకమంది ఆరోపిస్తున్నారు. లెక్కింపు సమయంలో తప్పిదాలపై వక్ఫ్ బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోర్డులోని కొందరు ఉన్నతాధికారులకు వాటా పంపుతుండడంతో వారు పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేయించాలని భక్తులు కోరుతున్నారు. పోలీసులు విచారిస్తున్నారు హుండీ లెక్కింపు సమయంలో ఓ వ్యక్తి నగదు కట్ట తీసుకెళ్లిన విషయం వాస్తవమే. పోలీసులు అదుపులోకి తీసుకుని నగదు వెనక్కి తీసుకువచ్చారు. ఈ విషయంపై విచారిస్తున్నారు. హుండీ నగదు దోపిడీపై నాపై వచ్చే ఆరోపణలు అవాస్తవం. కెమెరామెన్‌కు రూ.5 వేలు ఇచ్చిన విషయం వాస్తవమే. కానీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తీసుకున్నాం. – అహ్మద్‌బాషా, దర్గా సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయలేదు హుండీ లెక్కింపు వద్దకు పోలీస్ సిబ్బందిని పంపాం. అక్కడ ఏం జరిగిందనే విషయంపై వక్ఫ్ బోర్డు అధికారులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అందువల్ల విచారణ జరపలేదు. – షేక్ కరీముల్లా, ఎస్సై -
మహానందిలో అపశ్రుతి
మహానంది: మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవి సన్నిధిలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. హారతిపళ్లెంలోని దీపానికి సంబంధించి నిప్పు రవ్వలు ఎగిసి హుండీలో పడడంతో పొగలు వచ్చాయి. భక్తులకు హారతి ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే ఆలయానికి చేరుకొని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుండీలో ఇసుక పోశారు. హుండీలోని కానుకలు కొంత మేరకు కాలిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆలయ సూపరింటెండెంట్ ఓ.వెంకటేశ్వరుడు మాట్లాడుతూ దీపం హుండీలో పడలేదని, హారతి పళ్లెంలో ఉన్న చిల్లరను అర్చకుడు హుండీలో వేస్తుండగా దీపానికి ఉన్న వత్తి కాయిన్లకు అతుక్కుని పొగవచ్చి ఉండవచ్చన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పెద్దయ్యనాయుడు ఆలయానికి చేరుకుని హుండీలను పరిశీలించడంతోపాటు సీసీ పుటేజీ దృశ్యాలు చూసి వివరాలు తెలుసుకున్నారు. -
దేవుడి హుండీలో ఐఫోన్ 6..
సాక్షి, కృష్ణా : సాధారణంగా ఆలయాల హుండీల్లో భక్తులు డబ్బులు, బంగారు ఇతర విలువైన కానుకలు వేస్తారు. కానీ, కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రసిద్ధ శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయ హుండీలో ఎవరో భక్తుడు ఖరీదైన యాపిల్ ఐ ఫోన్ 6ను కానుకగా వేశారు. శనివారం ఆలయ అధికారులు హుండీని తెరిచి అందులో ఐఫోన్ చూసి ఆశ్చర్యపోయారు.. గతంలో భక్తుల ఫోన్లు అనుకోకుండా హుండీలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయని ఆలయ సూపరింటెండెంట్ అధికారి తెలిపారు. అయితే, ఈ ఫోన్ కొత్తదని సీలు కూడా తీయలేదని గ్యారంటీ కార్డ్ కూడా అందులో ఉందని చెప్పారు. కొత్త మెబైల్ దుకాణాన్ని ప్రారంభించిన భక్తుడు ఎవరో దేవుడికి ఈ కానుక వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఖరీదైన ఫోన్‌ను ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వానికి తాము లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఫోన్‌ను వేలం వేసి వచ్చిన ఆ డబ్బును ఆలయ ఖాతాలో జమ చేయాలా? లేదా ఫోన్‌ను భక్తులకు సమాచారం అందించేందుకు రిసెప్షన్లో ఉంచాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. -
విచిత్రం: 2వేల నోట్లు మాత్రమే చోరీ!
చంఢీగఢ్: పంజాబ్‌లోని ఓ ఆలయంలో గురువారం రాత్రి విచిత్రమైన చోరీ జరిగింది. అయితే ఆ దుండగులు కేవలం రూ.2 వేల నోట్లను మాత్రమే చోరీ చేయడం ఆసక్తికరంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమృత్‌సర్‌లోని దుర్గియానా దేవాలయ హుండీని పగులగొట్టిన గుర్తు తెలియని దుండగులు అందులో ఉన్న రూ.7 లక్షల వరకు ఉన్న రూ.500, రూ.1000నోట్లను వదిలేసి.. రూ.6లక్షల విలువచేసే రూ.2000నోట్లను మాత్రమే ఎత్తుకెళ్లారు. నేటి (శుక్రవారం) ఉదయం చోరీ విషయం బయటపడింది. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలయం ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీ సమయంలో కొన్ని కెమెరాల లెన్స్‌లను దుండగులు మూసేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తూ కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి ప్రతిరోజూ రూ.2లక్షలకు పైగా ఆదాయం వస్తుందని, అదే పండుగ రోజుల్లో రూ.10లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుందని సమాచారం. సిక్కుల ప్రార్థనాస్థలం స్వర్ణ దేవాలయానికి సమీపంలోనే ఈ హిందూ ఆలయం ఉండటం గమనార్హం. -
కోటీశ్వరుడు ... సత్య గిరీశుడు
- హుండీలు తెరిస్తే చాలు...‘రూ కోటి ’ ఆదాయం వచ్చినట్టే ! - వరుసగా మూడు నెలలు రూ.కోటి దాటిన సత్యదేవుని హుండీ ఆదాయం - జూన్ నెల హుండీ ఆదాయం రూ.1,23,71,212 అన్నవరం: (ప్రత్తిపాడు): రత్నగిరివాసుడు శ్రీ సత్యదేవుని ఆలయానికి ఆదాయం గణనీయంగా వస్తోంది. అందులో హుండీల ద్వారా వచ్చే ఆదాయమే ప్రతి నెలా రూ.కోటికి పైగా ఉంటోంది. సంవత్సరంలో ఒకటి, రెండు నెలలు మినహా ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.కోటి దాటుతోంది. జూన్ నెలకుగాను శుక్రవారం సత్యదేవుని హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,23,71,212 ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెలకు సంబంధించి హుండీలను మే రెండో తేదీన (32 రోజులకు) తెరిచి లెక్కించగా రూ.1.08 కోట్లు ఆదాయం వచ్చింది. మే నెలకు సంబంధించి అదే నెల 29న లెక్కించగా రూ.1.25 కోట్లు ఆదాయం వచ్చింది. వేసవి సెలవులు...వివాహాల సీజన్‌తో... ఏప్రిల్, మే, జూన్ నెలల్లో స్వామి సన్నిధిన వివాహాలు అధికంగా జరగడం, వేసవి సెలవులు, సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు తదితర కారణాలతో స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో స్వామివారికి ఆదాయం భారీగా వచ్చింది. దాంతోపాటే హుండీల్లో కూడా భక్తులు దండిగా కానుకలు సమర్పించడంతో ఆదాయం రూ.కోటి దాటిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. హుండీ ఆదాయంలో నగదు 1.15 కోట్లు, చిల్లర రూ.8.15 లక్షలు... శుక్రవారం స్వామివారి హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,23,71,212 ఆదాయం వచ్చిందని ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు తెలిపారు. ఇందులో రూ.1,15,55,412 నగదు కాగా, రూ.8,15,800 చిల్లర నాణేలు. వీటితోపాటు బంగారం 65 గ్రాములు, వెండి 870 గ్రాములు లభించాయని తెలిపారు. అమెరికా డాలర్లు 719, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 205 , సింగపూర్ డాలర్లు రెండు, మలేషియా రిమ్స్ మూడు. మరో నాలుగు దేశాల కరెన్సీలు లభించాయని తెలిపారు. ఇంకా హుండీలలో రద్దయిన నోట్లు... కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను భక్తులు ఇంకా హుండీల్లో వేస్తూనే ఉన్నారు. శుక్రవారం స్వామివారి హుండీలను తెరవగా రూ.1,04,000 విలువైన పాత నోట్లు లభించాయి. హుండీలో రూ.500 నకిలీ నోటు... అప్పుడే కొత్త రూ.500 నకిలీ నోట్లు తయారయ్యాయి. ఇందుకు సాక్ష్యమే ఇది. ఈ నకిలీ నోటు ఒకటి శుక్రవారం దేవస్థానం హుండీలలో రాగా లెక్కింపులో సిబ్బంది గుర్తించి చించేశారు. శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పాలకమండలి సభ్యులు పర్వత రాజబాబు, యడ్ల భేతాళుడు, కొత్త వేంకటేశ్వరరావు (కొండబాబు), రొబ్బి విజయశేఖర్, శింగిలిదేవి సత్తిరాజు, యనమల రాజేశ్వరరావు పర్యవేక్షించారు. దేవస్థానం సిబ్బంది, వ్రతపురోహితులు, నాయీ బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చూయింగ్‌గమ్‌తో హుండీలో నగదు చోరీ
♦ యువకుడి అరెస్ట్ కేకేనగర్ : కర్రకు చూయింగ్ గమ్ అతికించి హుండీలో నగదు చోరిచేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వేలూరు జిల్లా అరక్కోణం రైల్వేస్టేషన్ సమీపంలో చర్చి ఉంది. ఈ చర్చి హుండీ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు చాలాసేపు నిలబడి ఉన్నాడు. దీంతో అక్కడున్న వారికి అతనిపై అనుమానం కలిగింది. దీంతో చాటుగా ఉండి అతన్ని గమనించగా కర్రకు చూయింగ్‌గమ్ అతికించి హుండీలో నగదు చోరీ చేయసాగాడు. వెంటనే యువకుడిని పట్టుకుని అరక్కోణం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి వద్ద విచారణ జరిపారు. అతడు తిరువళ్లువర్ సమీపం చెవ్వాపేట ప్రాంతానికి చెందిన ఆరోగ్యరాజ్ (36) అని తెలిసింది. భార్యతో ఉద్యోగం చేస్తున్నట్లు అబద్దం చెప్పి రోజూ చెవ్వాపేట నుంచి అరక్కోణం రైలులో వచ్చేవాడు. అక్కడు ఆలయ హుండీల్లో నగదు చోరీ చేసి భార్యకు ఇచ్చేవాడని తెలిసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. -
సత్తెన్న ‘ హుండీ ’ సిరి రూ.1.25 కోట్లు
అన్నవరం: శ్రీ సత్యదేవునికి మే నెలలో 27 రోజులకు హుండీల ద్వారా రూ.1,25,18,846 ఆదాయం సమకూరింది. అన్నవరం దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. రూ.1,16,37,156 నగదు, రూ.8,81,690 చిల్లర నాణాలు వచ్చినట్టు హుండీ లెక్కింపు పర్యవేక్షించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో 200 గ్రాముల బంగారం, 145 గ్రాముల వెండి భక్తులు సమర్పించారన్నారు. వీటితో బాటు అమెరికా డాలర్లు 144, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు పది, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ దీర్హామ్ ఒకటి, సింగపూర్ డాలర్లు 12, మలేషియా డాలర్లు తొమ్మిది, కెనడా డాలర్లు 20, మరో ఐదు దేశాలకు చెందిన కరెన్సీ లభ్యమయ్యాయని తెలిపారు. వేసవి సెలవుల కారణంగా నెల్లాళ్లుగా సత్యదేవుని ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. దీనికి తోడు పెద్దసంఖ్యలో వివాహాలు జరగడం, స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు తదితర కార్యక్రమాలను తిలకించడానికి వచ్చిన భక్తులు హుండీలో దండిగా కానుకలు సమర్పించడంతో ఈ ఆదాయం లభించిందన్నారు. ఆదాయంలో రూ.వంద, రూ.పదులదే అగ్రస్థానం: సత్యదేవుని హుండీ ఆదాయంలో సగానికన్నా ఎక్కువగా రూ.వంద, రూ.పది నోట్లే ఉన్నాయి. రూ. 2 వేల నోట్లు 556, రూ. 500 నోట్లు 3,646, రూ. 100 నోట్లు 46,700, రూ. 50 నోట్లు 22,772, రూ. 20 నోట్లు 40,867, రూ. పది నోట్లు 2,06,431, రూ. 5 నోట్లు 2,343, రూ. 2 నోట్లు 15, రూ. 1 నోట్లు 161 ఉన్నాయి. చిల్లర రూ. 8,81,690 సమకూరింది. -
మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.91 కోట్లు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయ దేవాలయాల్లో భక్తులు హుండీలలో వేసిన కానుకలను లెక్కించగా రూ. 1, 91, 45, 584 వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. శుక్రవారం స్వామిఅమ్మవార్ల కల్యాణ మండపంలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, భక్తులు, స్థానికులు ఈ లెక్కింపులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. నగదుతో పాటు 185 ›గ్రాముల బంగారు, 5.800 కిలో గ్రాముల వెండి, 43 యూఎస్ఏ డాలర్లు, 5 ఇంగ్లండ్ ఫౌండ్స్, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 20 న్యూజిలాండ్ డాలర్లు, 10 ఎఎస్యూ రియాల్స్, 1 మలేషియా రింగిట్స్, 1/4 కువైట్ డాలర్ తదితర విదేశీ కరెన్సీ హుండీలలో లభించాయన్నారు.ఈ మొత్తం 30 రోజులకు గాను స్వామిఅమ్మవార్లకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు. -
శ్రీవారి హుండీల లెక్కింపులో కొత్త ఆదేశాలు
ద్వారకా తిరుమల : శ్రీవారి దేవస్థానంలో బుధవారం నిర్వహించాలి్సన హుండీల లెక్కింపు కొత్త ఆదేశాల కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. దేవస్థానంలో పనిచేసే రెగ్యులర్ అటెండర్లు, డ్రైవర్లు, ఎన్‌ఎంఆర్‌లు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని హుండీల లెక్కింపునకు అనుమతించడం లేదని ఆలయ అధికారులు సర్క్యులర్ జారీచేశారు. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఈ సర్క్యులర్‌ను నోటీసు బోర్డులో ఉంచారు. దీంతో దిగువస్థాయి సిబ్బంది కొరత కారణంగా హుండీల లెక్కింపు నిలిచిపోయింది. చినవెంకన్న ఆలయంలో ప్రతి 15–20 రోజులకోసారి జరిగే హుండీల లెక్కింపులో రెగ్యులర్ సిబ్బంది 65 మందితో పాటు, ఎన్ఎంఆర్, ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులు దాదాపు 100 మంది పాల్గొంటారు. దిగువస్థాయి సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో పలు ప్రాంతాల్లో ఉన్న హుండీల్లోని సొమ్మును బయటకు తీసి, లెక్కింపు ప్రాంతానికి తరలిస్తారు. అక్కడ మిగిలిన సిబ్బంది, అధికారులు లెక్కిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ శ్రమిస్తేనే ఈ లెక్కింపు పూర్తవుతుంది. అయితే బుధవారం హుండీల లెక్కింపు జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇంతలో ఎగువస్థాయి సిబ్బంది, అధికారులతో మాత్రమే లెక్కింపు జరపమన్న ఆదేశాలు జారీ అయ్యాయి. సొమ్ము బయటకు తీసేవారు లేక హుండీల లెక్కింపు జరిపేందుకు సుమారు 30 మంది అధికారులు, ఎగువస్థాయి సిబ్బంది ఉదయం లెక్కింపు ప్రాంతానికి చేరుకున్నారు. అయితే హుండీల్లోని సొమ్ము బయటకు తీసే వారు లేక, తీసినా సకాలంలో లెక్కింపు పూర్తవదన్న సందేహంతో అధికారులు లెక్కింపును నిలిపివేశారు. సీసీ కెమేరాల పర్యవేక్షణలో జరిగే హుండీల లెక్కింపునకు అనుమతించని దిగువస్థాయి సిబ్బందిని, ఏ పర్యవేక్షణా లేని, ఆదాయాలు వచ్చే ప్రాంతాల్లో విధులు ఎలా కేటాయిస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరింత కట్టుదిట్టమైన భద్రతల నడుమ లెక్కింపు జరపాల్సింది పోయి, ఇలా దిగువస్థాయి సిబ్బందికి లెక్కింపులో మినహాయింపు ఇవ్వడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
హుండీ చోరి కేసులో పూజారుల అరెస్టు
చెన్నై: తిరుచ్చెంగోడు అర్థనారీశ్వర ఆలయంలో నిఘా టీవీ కెమెరాను గుడ్డతో కప్పి హుండీ సొమ్మును అపహరించిన ఆలయ పూజారి, అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా తిరుచెందూరు నగరంలో సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల పురాతన ప్రసిద్ధి చెందిన అర్థనారీశ్వర స్వామి ఆలయం కొండ పైన ఉంది. ఈ ఆలయానికి ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. ఇంకనూ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పండుగ ముహూర్తం రోజులలో ఆలయం భక్తులతో క్రిక్కిరిసి ఉంటుంది. ఇక్కడ భక్తులు కానుకలు చెల్లించడానికి హుండి, దాని పక్కనే సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆలయంలోని హుండీలో భక్తులు చెల్లించిన కానుకలు అపహరణకు గురైందువల్ల ఆలయ నిర్వాహకులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసు జాయింట్ కమిషనర్ రత్నవేల్ సీసీ టీవీ కెమెరాలో నమోదయిన దృశ్యాలను పరిశీలించారు. ఆ సమయంలో గత 17వ తేది కెమెరాను నల్ల గుడ్డతో ఒక వ్యక్తి మూసివేస్తూ కనిపించాడు. వెంటనే పోలీసులు ఆలయంలో పని చేసే వారి వద్ద విచారణ చేపట్టారు. ఆ సమయంలో పారంపర్య పూజారి జ్ఞానమణి (65), అతని కుమారుడు ముల్లైవన నాధన్ (24)లు హుండీలో డబ్బులు చోరీ చేసినట్లు అంగీకరించారు. విచారణలో వారు రూ. 20 లక్షలతో కొత్త ఇల్లు నిర్మించుకున్నారని దాని కోసం ప్రతి రోజూ చోరి చేసేవారని ఇప్పటి వరకు సుమారు రూ. 3 లక్షలను చోరి చేసినట్లు తెలిసింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. -
మహానందిలో హుండీ చోరీయత్నం
– అన్నదానభవనంలో ఘటన మహానంది: మహానంది దేవస్థానంలోని నిత్యాన్నదాన భవనంలోని హుండీ చోరీ యత్నం సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించడంతో సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే...మహానంది దేవస్థానంలో ప్రతిరోజు 125 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాల్లోని అన్నదాన భవనంలో హుండీ ఉంటుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అన్నదానమండపం వెనుక వైపు ఉన్న కిటికీలకు ఉన్న కడ్డీలను తొలగించి లోపలికి చొరబడ్డారు. అక్కడే ఉన్న హుండీని భవనం వెనుక ఉన్న షెడ్డువైపు తీసుకొచ్చి చోరీకి యత్నించారు. హుండీ తాళం పగలగొట్టలేక పడేసి వెళ్లారు. ఆదివారం ఉదయం గుర్తించిన సిబ్బంది అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు వర్గాల మధ్య ఉన్న విభేధాలే ఈ ఘటనలకు కారణం ఉండొచ్చు అని పలువురు చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్నదానమండపం ప్రాంగణంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
నాగుపామును చంపి హుండీ చోరీ
తిరువణ్ణామలై: కణ్ణమంగళం సమీపంలోని అమ్మన్ ఆలయంలో నాగుపామును చంపి హుండీని చోరీ చేసిన సంఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని సందవాసల్ పుష్పగిరి చెరువు వద్ద పూవమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయం ఎదుట అతి పెద్ద పుట్ట కూడా ఉంది. పుట్టలో నాగుపాము అమ్మన్ ఆలయంలోకి ప్రవేశించి తిరిగి పుట్టలోకి వస్తుండగా భక్తులు చూశారు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో భక్తులు పుట్టలో పాలు, గుడ్లు పెట్టి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఆలయంలో దురైస్వామి పిల్లై అర్చకుడిగా ఉన్నారు. ఇతను భోజన సమయం మినహా మిగిలిన సమయాల్లో ఆలయంలోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇంటికి భోజనానికి వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో ఆలయ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఆలయ హుండీ కనిపించలేదు. మూలస్థానం వద్ద నాగుపామును కొట్టి చంపి ఉండడాన్ని గమనించాడు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో వారు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సందవాసల్ పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని విచారించగా అక్కడి సమీపంలోని పొలంలో హుండీ కనిపించింది. అందులో నగదును దుండగులు చోరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీ
కొలిమిగుండ్ల: కనకాద్రిపల్లెలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గతేడాది డిసెంబర్ 2న ఆలయాన్ని ప్రారంభించారు. మెయిన్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉన్న ఈ ఆలయానికి నిర్వాహకులు పూర్తి స్థాయిలో లైటింగ్ సౌకర్యం కల్పించారు. దుండగులు తాళాలు బద్దలు కొట్టి హుండీని తీసుకెళ్లారు. ఆలయం ఎదురుగా ఇంటిపై నిద్రిస్తున్న సోమశేఖర్ దంపతులు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వగా అందరూ కలిసి వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. సుమారు అర కిలో మీటర్ దూరంలో కంప చెట్ల చాటున హుండీని పగుల కొట్టి నగదు ఎత్తుకెళ్లారు. రూ.20 వేలకు పైగానే నగదు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఏఎస్ఐ ఉస్మాన్‌ఘని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చోరీ జరిగిన ఘటనపై విచారణ చేపడతామని ఏఎస్ఐ పేర్కొన్నారు. -
నేడు మల్లన్న హుండీల లెక్కింపు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల్లోని హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో చేపడుతున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త గురువారం తెలిపారు. అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, స్థానికులు, భక్తులంతా చొక్క, బనియన్లు తీసీవేసి హాజరుకావాలన్నారు. నగదు, ఉంగరాలు ధరించకుండా హుండీల లెక్కింపులో పాల్గొన్నాలని ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు ప్రారంభమైన తరువాత అత్యవసరంగా ఎవరైనా సిబ్బంది బయటకు వెళ్లినా, లోపలికి వచ్చినప్పుడు వారి రాకపోకల వివరాలను తెలియజేసేందుకు రిజిస్టర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తిగా సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తున్నామని ఈఓ తెలిపారు. -
మల్లన్న హుండీ లెక్కింపులో చేతివాటం
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం బయటపడింది. లెక్కింపు జరగుతున్న సమయంలో అందులో పాల్గొన్న ఓ మహిళా చేతివాటం చూపించింది. లెక్కింపు చేస్తున్న క్రమంలో ఎవరి కంటాపడకుండా కొంత బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లడానికి యత్నించింది. ఆలయ ముఖమండపంలో హుండీ లెక్కింపులు నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న ఖాత శాంతమ్మ 5.77 గ్రాముల బంగారు, 5.29 గ్రాముల వెండి ఆభరణాలను తీసుకెళ్తుండంతో మండపం వద్ద తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఆమెను పోలీసులకు అప్పగించారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.28 కోట్లు
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉభయ ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.1,28,53,611 ఆదాయం వచ్చినట్లు ఈఓ నారాయణభరత్‌గుప్త తెలిపారు. బుధవారం అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్థానికులు, భక్తులు హుండీల ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 135 గ్రాముల బంగారు, 4.4 కేజీల వెండి లభించినట్లు ఈఓ తెలిపారు. అలాగే 66 అమెరికా డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 10 న్యూజిలాండ్ డాలర్లు, 180 యూఎఈ దిర్హమ్స్ హుండీలలో వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం 22 రోజులకు సంబంధించినదని ఈఓ తెలిపారు. -
సత్తెన్నకు‘అరకిలో’ బంగారు కానుకలు
హుండీల ఆదాయం రూ.59.47 లక్షలు అన్నవరం : రత్నగిరివాసుడు సత్యదేవునికి హుండీల ద్వారా 17 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో అరకిలో బంగారం లభించగా, రూ.59.47 లక్షలు వచ్చింది. ఈ బంగారమంతా భక్తులు స్వామికి సమర్పించిన చిరుకానుకలే కావడం విశేషం. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న బంగారం రేటు ప్రకారం ఈ దీని విలువ సుమారు రూ.14 లక్షలు. ఫిబ్రవరిలో 480 గ్రాముల బంగారం వచ్చినా అప్పుడు 29 రోజులకు హుండీలను లెక్కించారు. మార్చిలో తొలివిడతగా శుక్రవారం దేవస్థానంలో హుండీలను తెరిచి లెక్కించారు. వాటిలో భక్తులు సమర్పించిన సుమారు 50 చిరు బంగారు కానుకలు ఉండడంతో వాటిని తూకం వేయించగా 500 గ్రాములు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో వచ్చిన 480 గ్రాములు బంగారం ఆలయచరిత్రలో ఇప్పటివరకూ రికార్డుగా ఉంది. ఇక నగదు రూపంలో రూ.55,94,978 , రూ.3,52,886ల చిల్లర నాణాలు వచ్చాయని లెక్కింపును పర్యవేక్షించిన దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. నగదుతోపాటు అమెరికా డాలర్లు 137, సౌదీ అరేబియన్ మోనాటిరీలు 22, యూరో కరెన్సీ 5 ఉన్నాయన్నారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఏఈఓలు వైఎస్ఆర్ మూర్తి, ఎంకేటీఎన్వీ ప్రసాద్, నటరాజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ నెలాఖరున మరోసారి హుండీలను లెక్కిస్తామని అధికారులు తెలిపారు. -
మాఘం.. అమోఘం..
సత్యదేవునికి ‘కోట్లు’ కురిపించిన మాసం హుండీల ద్వారానే రూ.1.11 కోట్ల ఆదాయం రాక మిగిలిన విభాగాల ద్వారా మరో రూ.9 కోట్లు వచ్చే వీలు హుండీ ఆదాయంలో మరలా పది నోట్లదే అగ్రతాంబూలం అన్నవరం : రత్నగిరివాసుడు సత్యదేవునికి ఫిబ్రవరి నెలలో వచ్చిన మాఘమాసం దండిగా సిరులు కురిపించింది. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ మాఘమాసంలో భక్తులు సత్యదేవుని సన్నిధికి పోటెత్తారు. ఫలితంగా రికార్డుస్థాయిలో సత్యదేవునికి హుండీల ద్వారా రూ.1,11,13,424 ఆదాయం వచ్చింది. సాధారణంగా హుండీ ఆదాయాన్ని అనుసరించి మిగిలిన విభాగాల ద్వారా ఆదాయం ఎలా వచ్చిందో అంచనా వేస్తారు. సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 27 రోజులకుగాను భారీగా ఆదాయం రావడంతో మిగిలిన ఆదాయ వనరుల ద్వారా దేవస్థానానికి మరో రూ.తొమ్మిది కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరులు కురిపించే మాఘమాసం సాధారణంగా సత్యదేవుని ఆలయానికి కార్తీకం, వైశాఖ మాసాల తరువాత మాఘాన్ని బాగా ఆదాయాన్ని తెచ్చే మాసంగా చెబుతారు. మాఘమాసంలో పెద్దసంఖ్యలో వివాహాలు జరగడం, నవదంపతులు, వారి బంధుమిత్రులు స్వామి సన్నిధికి తరలివచ్చి స్వామివారి వ్రతాలు ఆచరించి, దర్శించుకుంటారు. మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి, అదే విధంగా మాఘ ఆదివారాలు, దశమి, బహుళ ఏకాదశి వంటి పర్వదినాలలో భక్తులు అధికంగా రావడం వల్లే ఆదాయం భారీగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. హుండీ ఆదాయంలో పది నోట్లే అధికం సోమవారం లెక్కించిన హుండీ ఆదాయంలో 40 శాతానికి పైగా రూ.పది నోట్లే లభించాయి. మొత్తం హుండీ ఆదాయం రూ. 1,11,13,424 కాగా, అందులో కరెన్సీ 1,04,68,994. చిల్లర నాణేలు రూ.6,44,430. కరెన్సీలో సుమారు రూ.22 లక్షలు విలువైన రూ.పది నోట్లే ఉండడం విశేషం. రూ.వంద నోట్లు రూ.45 లక్షలు విలువైనవి ఉన్నాయి. ఈ సారి హుండీలో రికార్డు స్థాయిలో బంగారం 480 గ్రాములు, వెండి 615 గ్రాములు లభించాయి. హుండీలో 58 డాలర్ల అమెరికా చెక్కు సాధారణంగా సత్యదేవుని హుండీలో డాలర్లు వస్తాయి. కానీ ఈ సారి ఓ అజ్ఞాతభక్తుడు సత్యదేవునికి 58 డాలర్ల చెక్ కూడా సమర్పించాడు. ఈ చెక్‌ను ఆన్లైన్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు కలెక్షన్‌కు పంపించాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీంతో బాటు అమెరికా డాలర్లు 182, మలేషియా డాలర్లు 14, సౌదీ అరేబియా మోనాటరీలు రెండు, యూరోలు పది, నేపాలీ రూపాయలు 20, ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ పది రియల్స్, కెనడా డాలర్లు 25, సింగపూర్ డాలర్లు 5, యునైటెడ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ దీనార్స్ పది, సౌతాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ ర్యాండ్స్ 430, ఆస్ట్రేలియా డాలర్లు వంద, బ్యాంక్ ఆఫ్ జమైకా డాలర్లు వంద లభించాయి. సత్యదేవుని హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం ఛైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఇతర సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. అలాగే మాఘమాసం నెల రోజులు ఎంత ఆదాయం వచ్చిందో అధికారికంగా ఒకట్రెండురోజుల్లో అధికారులు వెల్లడించనున్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.40 కోట్లు
శ్రీశైలం : భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయ ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.1,40,80,480లు వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. మంగళవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, వ్యాపారస్తులు, భక్తులు హుండీల ఆదాయాన్ని(24 రోజులు) లెక్కించారు. నగదుతోపాటు 304.5 గ్రాముల బంగారం, 3.950 కేజీల వెండి వచ్చినట్లు ఈఓ తెలిపారు. అలాగే 345 యూఎస్ఎ డాలర్లు, 50 ఇంగ్లాండ్ ఫౌండ్లు, 5 కెనడా డాలర్లు, 5 యూఏఈ దిర్హమ్స్, 219 మలేషియా రింగిట్స్, 4 సింగపూర్ డాలర్లు లభించాయన్నారు. -
శ్రీ మఠం ఆదాయం రూ. 1.50 కోట్లు
మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం జనవరి నెలకు సంబంధించి రూ. 1.50 కోట్లు వచ్చినట్లు శ్రీ మఠం మేనేజర్ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భక్తులు రాఘవేంద్రస్వామికి కానుకలు, ముడుపుల రూపంలో రూ.1.50 కోట్లతో పాటు 76 గ్రాములు బంగారం, 650 గ్రాములు వెండి, 2764 విదేశి డాలర్లు సమర్పించినటు్ల పేర్కొన్నారు. -
చూడకపోతే గోవిందా!
– హుండీలోకి వెళ్లని భక్తుల కానుకలు - బయటనే కనిపిస్తున్న వైనం – పట్టించుకోని అధికారులు – ఆందోళనలో భక్తులు ఆళ్లగడ్డ: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ అహోబిలేసుడి పారువేట మహోత్సవాలు జరుగుతాయి. ఉత్సవ పల్లకీలో కొలువైన శ్రీజ్వాలానరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములను దర్శించుకునేందుకు భక్తులు ఎంత ప్రాధాన్యమిస్తారో పల్లకీకి అమర్చిన హుండీ కూడా వారికి అంతే ముఖ్యం. ఏడాది పొడువున ముడుపులు కట్టి, స్వామి తమ తెలుపు పై కొలువైన సమయంలో ఆ సొమ్ములు హుండీలో వేస్తారు. ఇలా చేస్తే సుఖశాంతులతో పాటు ధనప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతటి ప్రాశస్త్యం ఉన్న హుండీలో భక్తులు సొమ్ములు, కానుకలు వేస్తే లోపలకు పడకుండా బయటనే ఉండిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని కొందరు రెండు రోజులుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వేసే కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయే ప్రశ్నార్థకంగా మారింది. ఎంతో భక్తితో హుండీలో వేసే కానుకలు తమ కళ్లెదుటే దుర్వినియోగమవుతున్నాయని భక్తులు వాపోతున్నారు. దీనిపై దేవస్థానం ఉద్యోగి రాంభూపాల్ దృష్టికి తీసుకెళ్లగా పల్లకీకి అమర్చిన హుండీ పాతది కావడంతో పాటు కానుకలు వేసే రంద్రం చిన్నగా ఉండటంతో లోపలికి పోవడంలేదని తెలిపారు. వేరే హుండీ పంపిస్తామని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 1.15కోట్లు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం డిసెంబర్ నెల హుండీ ఆదాయం రూ. 1.15 కోట్లు సమకూరింది. నాలుగురోజుల పాటు హుండీ లెక్కింపు సాగింది. ఇందులో నగదు 1,15,63,444, గోల్లు (బంగారం) 35గ్రాములు, వెండి 410 గ్రాములు, విదేశీ కరెన్సీ 914 డాలర్లు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావ్ వివరించారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి హుండీ లెక్కింపు బుధవారంతో రెండో రోజుకు చేరింది. మొదటి రోజు రూ.69.31 లక్షలు రాగా, బుధవారం రూ.33.32 లక్షలు సమకూరింది. మొత్తం నగదు రూ.1.02 కోట్లు స్థానిక స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రెండు రోజుల్లో హుండీ లెక్కింపు పూర్తవుతున్నట్లు ఆయన వివరించారు. ఈరన్నస్వామికి.. ఉరుకుంద ఈరన్నస్వామికి రెండో రోజు హుండీ లెక్కింపులో రూ.14,12,356ల ఆదాయం సమకూరింది. అన్నదానం హుండీ నుంచి మరో రూ.3,67,440లు వచ్చిందని ఈవో మల్లికార్జునప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ చెన్నబసప్పలు తెలిపారు. మొత్తం 17,79,796 రూపాయల హుండి వచ్చినట్లు వారు తెలిపారు. దీనితో పాటు 10గ్రాముల బంగారం, 1,320కేజిల వెండి వచ్చిందన్నారు. కార్యక్రమంలో కర్నూల్ ఎండోమెంట్ పర్యవేక్షకుడు సుధాకర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామి, పర్యవేక్షకులు మల్లికార్జున, వేంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, నరసన్న, మల్లికార్జున, ఈరన్న, ఆంధ్రబ్యాంకు సిబ్బంది, సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ ముత్తమ్మ పాల్గొన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయదేవాలయాల్లోని 15 రోజుల హుండీ ఆదాయం రూ.1,29,41,864 వచ్చినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. శనివారం అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ఈ లెక్కింపులో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగదుతో పాటు 36.650 గ్రాముల బంగారు, 2.150 కిలో గ్రాముల వెండి వచ్చిందన్నారు. గత నెల 25 నుంచి శనివారం వరకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు. -
శివాలయంలో హుండీ చోరీ
వైఎస్సార్ కడప: జిల్లాలోని సుండుపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయంలో శుక్రవారం చోరీ జరిగింది. ఆలయ హుండీని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి నగదు, కానుకలు దోచుకె ళ్లారు. హుండీలో సుమారు రూ.2లక్షల వరకు నగదు ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శ్రీమఠం హుండీ లెక్కింపు ప్రారంభం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం హుండీ లెక్కింపు సోమవారం సీసీ కెమెరాలు, అధికారుల నిఘా నేత్రాల మధ్య కొనసాగింది. లెక్కింపులో పలు ఆసక్తికర కానుకలు కనిపించాయి. ఓ భక్తుడు హుండీలో కేజీ వెండి బిస్కెట్లు, కంకణం, స్వామి రేకు వేశాడు. మరో భక్తుడు రూ.500 నోట్ల (100 నోట్లు) కట్టను సమర్పించారు. మొదటి రోజు హుండీ ఆదాయం రూ.63,95,600 సమకూరింది. రూ.2000 నోట్లు 106, రూ.వెయ్యి నోట్లు 746, రూ.500 నోట్లు రూ.3,466, రూ.100 నోట్లు 31,746, రూ.50 నోట్లు వెయ్యి, రూ.20 నోట్లు 1500 లెక్కలో తేలాయి. మఠం ప్రధాన హుండీతోపాటు 3 హుండీల ఆదాయాన్ని గణించారు. తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, ఎస్ఐ శ్రీనివాసనాయక్, మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు సమక్షంలో ఎండోమెంట్ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు హుండీలను తెరిచారు. మరో రెండు రోజుల పాటు హుండీ లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. -
రామహనుమాన్ ఆలయం దేవాదాయశాఖ స్వాధీనం
కర్నూలు(న్యూసిటీ): బళ్లారి చౌరస్తాలోని రామాంజనేయ స్వామి ఆలయాన్ని శనివారం దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఆ శాఖ ఉపకమిషనర్ బి.గాయత్రీదేవి ఆదేశాలనుసారం కర్నూలు గ్రూపు1 దేవాలయాల కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో ఉన్న మూడు హుండీలను సీజ్ చేశారు. కార్యక్రమంలో అర్చకులు మారుతీ శర్మ, దేవాదాయశాఖ కార్యనిర్వాహణాధికారులు అనుమంతరావు, దినేష్, చంద్రశేఖరరెడ్డి, సుబ్రమణ్యంనాయుడు, కల్లూరు ప్రసాద్, వరదరాజులు పాల్గొన్నారు. -
సత్యదేవుని ప్రధాన హుండీ రాబడి రూ.11,40,633
తాళం చెవి లేకపోవడంతో పగలకొట్టి లెక్కింపు l ఊహించినట్టు కానరాని ‘బ్లాక్ మనీ’ కట్టలు అన్నవరం : సత్యదేవుని ప్రధానాలయ హుండీని బుధవారం లెక్కించగా రూ.11,40, 633 రాబడి లభించింది. దీంతో సత్యదేవుని గత 17 రోజులలో మొత్తం హుండీ ఆదాయం రూ.92,55,819కు చేరింది. స్వామివారి హుండీలను మంగళవారమే లెక్కించినా ప్రధానాలయంలోని హుండీ తాళం చెవి కనిపించకపోవడంతో ఆ హుండీని తెరవలేదు. అకౌంట్స్ విభాగంలో ఎంత వెదికినా బుధవారం కూడా తాళం చెవి కనిపించకపోవడంతో తాళం కప్పను పగులకొట్టి లెక్కించేందుకు దేవాదాయశాఖ ఏసీ రమేష్‌బాబు అనుమతించారు. బుధవారం ఉదయం పది గంటలకు దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు, ఏసీ రమేష్ బాబు, హుండీ తాళాన్ని పగులకొట్టించి, కానుకలను పది మూటలుగా కట్టి, నిత్యకల్యాణమండపానికి తీసుకువెళ్లి లెక్కించారు. రూ.10,82,500 నగదు, రూ.58,133 చిల్లర నాణాలు, అమెరికా డాలర్లు 26, సింగపూర్ డాలర్లు నాలుగు, ఆస్ట్రేలియా డాలర్లు 50 లభించాయి. ‘తాళం చెవి’ బాధ్యులకు చార్జి మెమో పెద్ద నోట్ల రద్దు వలన బ్లాక్‌మనీ వదిలించుకునేందుకు బడాబాబులు ప్రధానాలయ హుండీలో పెద్ద ఎత్తున రూ.వేయి, రూ.500 నోట్ల కట్టలు వేస్తారన్న అధికారుల ఊహ నిజం కాలేదు. ఎవరైనా అలా ఆ నోట్లకట్టలు వేస్తే ఇతరులు చూడకుండా హుండీ చుట్టూ పోలింగ్ బూత్ మాదిరిగా వస్త్రం కూడా కట్టారు. ఈ నేపథ్యంలో ఈ హుండీ ఎప్పుడు తెరుస్తారా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే హుండీని తెరిచాక నోట్లకట్టలేమీ కనిపించలేదు. ఎవరో రూ.500 కట్ట ఒకటి, రూ.వంద కట్టలు ఒకకట్టగా కట్టి రూ.లక్ష హుండీలో వేశారు. కాగా హుండీ తాళం చెవి మాయం కావడానికి బాధ్యులైన వారికి చార్జి మెమో ఇచ్చినట్టు ఈఓ చెప్పారు. -
హుండీలు నిండుతున్నాయి
• ఆలయాలకు పోటెత్తుతున్న పెద్ద నోట్లు • కానుకలుగా సమర్పించుకుంటున్న ‘పెద్ద భక్తులు’ • భక్తుల సంఖ్య తగ్గుతున్నా భారీ ఆదాయం! సాక్షి, హైదరాబాద్: కార్తీక సోమవారం. శివునికి రుద్రాభిషేకం చేయాలి. టికెట్ రూ.300. ఓ భక్తుడు రూ.500 నోటిచ్చాడు. రూ.200 తిరిగివ్వడానికి సిబ్బం దికి చిల్లర దొరకలేదు. చిల్లర బదులు 8 లడ్డూ ప్రసాదాలను భక్తుని చేతిలో పెట్టారు. అన్ని వద్దని, చిల్లరే ఇవ్వాలని కోరినా చేతులెత్తేశారు! మరో భక్తుడు అమ్మవారికి కుంకుమార్చన చేరుుంచాడు. టికెట్ రుసుము పోను మిగతా చిల్లర సిబ్బంది ఇవ్వలేకపోయారు. దాంతో సదరు భక్తుడు ఆ మొత్తాన్ని ఆలయానికే విరాళంగా ఇచ్చేశాడు!! ఇంకో ఆలయంలో మూడు హుండీలూ ఒక్కసారిగా నిండిపోయారుు. రూ.1,000, రూ.500 నోట్లు నిండుగా నిండి, చోటు చాలక బయటికి హుండీల్లోంచి బయటికే కనిపిస్తున్నారుు. దాంతో ఎప్పట్నుంచో మూలపడి ఉన్న పాత హుండీ దుమ్ముదులిపి తెచ్చిపెడితే అదీ నిండిపోరుుంది!! రాష్ట్రంలో భక్తి భావం ఉప్పొంగుతోంది. భగవంతునికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. ఇష్టాలయాలకు బారులుతీరి మరీ హుండీలను నోట్లతో నింపేస్తున్నారు. చిన్న దేవాలయాల్లో కూడా హుండీలు ఇట్టే నిండిపోతున్నారుు! అంతా పెద్ద నోట్ల రద్దు ఫలితం!! రూ.1,000, 500 నోట్లను భారీగా పోగేసుకున్న ‘పెద్ద’భక్తులు వాటిని భారీగా ఆలయాలకు సమర్పిస్తున్నారు. విరాళంగా ఇస్తే పేర్లు వెల్లడించాల్సి వస్తుందని నోట్ల కట్టల రూపంలోనే హుండీల్లో వేసేస్తున్నారు. దాంతో హుండీలు చకచకా నిండిపోతున్నారుు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోన ప్రధాన దేవాలయమైన కాళేశ్వరంలో దాదాపు నాలుగు హుండీలూ పూర్తిగా నిండిపోయారుు. ఇక్కడ సాధారణంగా మూడు నెలలకోసారి హుండీలు తెరుస్తారు. ఉత్సవాలు, పండుగలప్పుడైనా నెలకోసారే తెరుస్తారు. ఇప్పుడు అంతకంటే ముందే హుండీలు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలోనూ హుం డీలు బరువెక్కారుు. వాటిని తెరిచి నాలుగు రోజులే కావడం విశేషం! రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! విచిత్రమేమిటంటే, చిల్లర సమస్యతో ప్రయాణాలు ఇబ్బందికరంగా మారి సాధారణ రోజుల కంటే అన్ని ఆలయాలకూ భక్తుల రద్దీ ఇప్పుడు కాస్త తగ్గింది. ఆ లెక్కన హుండీ ఆదాయం తగ్గాల్సింది పోరుు సీన్ రివర్సవుతోంది! రద్దరుున పెద్ద నోట్లు భారీగా ఉండి, బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు లేని ‘భక్తులు’అందులో వీలైనంత మొత్తాన్ని దేవుళ్లకు సమర్పించేస్తున్నారు. సాధారణంగా రోజుకు రూ.లక్షన్నర దాకా ఉండే భద్రాచలం రామాలయం హుండీయేతర ఆదాయం ఐదారు రోజులుగా రూ.ఐదున్నర లక్షలు దాటుతోం ది! అరుుతే, రద్దరుున పెద్ద నోట్లు ప్రస్తుతానికి చెల్లుతాయంటూ కేంద్రం ప్రకటించిన జాబి తాలో ఆలయాలు లేకపోవడంతో వాటికి ఇలా వచ్చిపడుతున్న నోట్ల చెల్లుబాటుపై అయోమయం నెలకొంది. వీటిని డిసెంబరు 31లోపు మార్చుకోవాల్సి ఉండటంతో ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమ చేయాల్సిందిగా ఆదేశిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ తాజాగా ఆలయాలన్నింటికీ సర్క్యులర్ ఇచ్చారు. తద్వారా బ్యాంకుల నుంచి అభ్యంతరాలేమైనా వస్తే తదుపరి కార్యాచరణకు సమయం చిక్కుతుందన్నది శాఖ ఆలోచన. చిల్లర చిక్కులు మరోవైపు ఆలయ సిబ్బందిని చిల్లర చిక్కులు వేధిస్తున్నారుు. సేవలు, పూజాదికాల కోసం భక్తులు రూ.1,000, 500 నోట్లే ఇస్తుండటంతో చిల్లర ఇవ్వడం వారి తరం కావడం లేదు. దాంతో చిల్లరకు బదులు ప్రసాదం ఇచ్చి సరిపెడుతున్నారు. మరికొందరికి భవిష్యత్తు సేవల కోసం అడ్వాన్సుగా పేర్లు రాసి రశీదులిస్తున్నారు. ఇంకొందరు భక్తులు ఆ మొత్తాన్ని విరాళంగా సమర్పిస్తున్నారు. ఇంకోవైపు రోజువారి ఆలయ ఖర్చులకు డబ్బులు సమకూర్చుకోవటం కూడా సిబ్బందికి సమస్యగానే మారింది. బ్యాంకు నుంచి రోజువారి నగదు విత్‌డ్రాకు పరిమితి ఉండటం, గంటల తరబడి లైన్లలో నుంచోవాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట వంటి ఆలయాల్లో సాధారణంగా ఘనంగా జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలు ఈసారి ఇలాంటి కారణాలతో వెలవెలబోయారుు. -
అజ్ఞాత భక్తుడు రూ. 3.60 లక్షలు విరాళం
మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ మహానందీశ్వరస్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు రూ. 3.60 లక్షలు సమర్పించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన ఓ భక్తుడు గర్భాలయం ఎదురుగా ఉన్న హుండీలో ఈఓ శంకర వరప్రసాద్ సమక్షంలో నగదు వేసినట్లు సిబ్బంది తెలిపారు. పాతనోట్లు రద్దయిన సందర్భంగా ఓ భక్తుడు పెద్ద మొత్తాన్ని హుండీలో వేయడం స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు. - మహానంది -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.17కోట్లు
మంత్రాలయం : అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీ మఠం రాఘవేంద్ర స్వామి హుండీ నుంచి రూ.1,17,29, 253 సమకూరినట్లు మఠం మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగిన హుండీ లెక్కింపులో 50 గ్రాముల బంగారం, 442 గ్రాముల వెండీ , 1933 విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు. దసరా సెలవులు, శ్రీ మఠంలో కార్తీక పూజలు మెదలు కావడంతో భక్తుల రద్దీ పెరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా హుండీ ఆదాయం అధికంగా వచ్చినట్లు చెప్పారు. -
అంకమ్మ తల్లి ఆలయంలో చోరీ
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలోని అంకమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. ఆలయ గర్భగుడి తలుపులు పగులగొట్టిన గుర్తు తెలియని దుండగులు అమ్మవారి వెండి కిరీటం, రెండు బంగారు గొలుసులు, మంగళ సూత్రాలు ఎత్తుకుపోయారు. అక్కడే ఉన్న హుండీని పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకుపోయారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొత్తు విలువ కనీసం రూ.2 లక్షలు ఉంటుందని పూజారి తెలిపారు. -
ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు
ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలో సొత్తు ఎంత ఉంటుందనే తెలియరాలేదు. -
యాదాద్రి హుండీ లెక్కింపు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 35 రోజులకు గాను రూ.58,61,69లు, అలాగే 80 గ్రాముల బంగారం , 1,600 గ్రాముల వెండి వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మెన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ఏఈఓలు చంద్రశేఖర్, రామ్మోహన్రావు, అధికారులు గజ్వేల్ రమేశ్, శ్రవణ్, గోపాల్, చలమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ మఠం హుండీ లెక్కింపు పూర్తి
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ లెక్కింపు శనివారం రాత్రి ముగిసిందని శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబరు నెలకు సంబంధించి భక్తులు రాఘవేంద్రస్వామికి చెల్లించిన ముడుపుల నగదు రూ. 81,30,086, గోల్డ్ 21 గ్రాములు, సిల్వర్ 540 గ్రాములు, విదేశీ కరెన్సీ 111 డాలర్లు ఆదాయం సమకూరిందని వివరించారు. -
మహానందీశ్వరుని హుండీ లెక్కింపు
మహానంది: మహానంది క్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా రూ. 25.63 లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ శంకర వరప్రసాద్ తెలిపారు. మహానంది క్షేత్రంలోని సామూహిక అభిషేక మండపంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కామేశ్వరీదేవి సహీత మహానందీశ్వరస్వామి, కోదండరామాలయం, వినాయకనంది ఆలయాల్లో ఉన్న హుండీల లెక్కింపు ద్వారా రూ. 25,53,695 వచ్చిందన్నారు. అలాగే అన్నదానం విభాగం ద్వారా రూ. 9,453 వచ్చినట్లు చెప్పారు. రెండు కలిపి రూ. 25,63,148 వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయం 52 రోజులకు వచ్చిందన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ రాజశేఖర్, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, పాలకమండలి ధర్మకర్తలు పాల్గొన్నారు. -
ఈరన్నకు రూ. 31లక్షల ఆదాయం
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణమాస ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి అమవాస్యకు సంబంధించిన హుండి లెక్కింపును బుధవారం కాలక్షేప మంఠపంలో నిర్వహించారు. పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో రూ. 31,03,095 నగదు, 9,100 గ్రాముల వెండి, 50 గ్రా. బంగారం సమకూరింది. కార్యక్రమంలో ఆలయ ప్రదాన అర్చకుడు ఈరప్పస్వామి, పర్యవేక్షకులు మల్లికార్జున, వేంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, నరసన్న, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. -
ఒకేరోజు మూడు ఆలయాల్లో చోరీ
నంద్యాల: మండలపరిధిలో ఒకేరోజు మూడు ఆలయాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి బొమ్మలసత్రం ప్రాంతంలోని సాయిబాబా ఆలయం తాళాలను పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. అందులోని రూ.50వేలను తీసుకుని ఆలయానికి కొద్దిదూరంలో ఖాళీ హుండీని పడేసి వెళ్లారు. అక్కడి నుంచి దొంగల గ్యాంగ్ చాపిరేవుల సమీపంలో ఉన్న కాసిరెడ్డినాయన ఆశ్రమంలో చోరీకి పాల్పడ్డారు. తర్వాత కొద్దిదూరంలోని పెద్దమ్మ గుడిలో చొరబడి హుండీని ఎత్తుకెళ్లడానికి యత్నించారు. అయితే, స్థానికులు గమనించడంతో పరారయ్యారు. ఈ సీరియల్ దొంగతనాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఎస్ఐ సూర్యమౌళి చోరీ జరిగిన సాయిబాబా ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
అన్నవరప్పాడు ఆలయంలో చోరీ
అన్నవరప్పాడు (పెరవలి) : జాతీయ రహదారి పక్కన పెరవలి మండలం అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గర్భాలయం ఎదుట ఉన్న ప్రధాన హుండీని దొంగ అపహరించాడు. రెండు నెలలుగా హుండీ ఆదాయం లెక్కించకపోవడంతో సుమారు రూ.50 వేలకు పైగా సొమ్ము ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ మేనేజర్ బ్రహ్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి 8.30 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు మూసివేశారు. నైట్ వాచ్మెన్ కోటిపల్లి ఆంజనేయులు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి 1–2 గంటల మధ్య చోరీ జరిగినట్టు ఆలయంలోని సీసీ కెమెరాలో నమోదైంది. అసలేం జరిగిందంటే.. రాత్రి 1 గంటకు ప్రధాన ఆలయం పక్కన ఉన్న అలివేలు మంగతాయారు గుడి తలుపులు పగులకొట్టేందుకు దొం గ ప్రయత్నించాడు. అవి తెరుచుకోకపోవడంతో 1.15 నిమిషాలకు గర్భాలయం ఎదుట ఉన్న ప్రధాన హుండీకి ఉన్న ఇనుమ గొలుసులను తెంపి హుండీతో ఉడాయించాడు. ఈ సమయంలో ఆలయంలోని విద్యుత్ దీపాలను దొంగ ఆర్పివేశాడు. దీనిని గమనించిన నైట్ వాచ్మెన్ దీపాలు వేశాడు. మరలా దొంగ దీపాలను ఆర్పివేశాడు. దీంతో అనుమానం వచ్చిన నైట్ వాచ్మెన్ ఆలయం వెనుక నివాసం ఉంటున్న సిబ్బందిని తీసుకురావడానికి వెళ్లాడు. వారు వచ్చి ఆలయ ప్రాంగణంలో పరిశీలించినా దొంగను మాత్రం గమనించలేదు. తర్వాత కొద్దిసేపటికి దొంగ హుండీతో సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. నైట్‌వాచ్‌మెన్, ఆలయ సిబ్బంది గర్భాలయం వద్ద చూడగా హుండీ చోరీకి గురైనట్టు గుర్తించారు. పొలంలో హుండీ పగులగొట్టిన దొంగ సొమ్ముతో ఉడాయించాడు. ఆ సమయంలో ఆలయం వద్ద మోటార్ బైక్ శబ్ధం రావడంతో ఆలయ సిబ్బంది, స్థానికులు పొలం వైపుగా వెళ్లారు. దొంగ వేగంగా మోటార్ బైక్‌పై తప్పించుకుని పోయాడు. స్థానికులు ఖండవల్లి గ్రామం వరకూ దొంగను వెంబడించినా ఫలితం లేదు. ఖండవల్లి నుంచి తూర్పువిప్పర్రు రోడ్డులోకి దొంగ వేగంగా వెళ్లిపోయాడు. ఇది మూడోసారి అన్నవరప్పాడు గ్రామంలో ఆలయాల్లోని హుండీలు అపహరణకు గురికావడం ఇది మూడోసారి. గతేడాది జూలైలో ఇదే తరహాలో ఈ ఆలయంలోనే చోరీ జరిగింది. గత నెలలో గ్రామంలోని శక్తమ్మవారి ఆలయంలో హుండీని అపహరించారు. మరలా ఇప్పుడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. -
కొల్లేటి పెద్దింట్లమ్మ హుండీ ఆదాయం రూ.17.56లక్షలు
ఆకివీడు : కొల్లేటి కోటలోని పెద్దింట్లమ్మవారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఈవో ఆకుల కొండలరావు పర్యవేక్షణలో సిబ్బంది ఐదు ¯ð లల హుండీని తెరిచారు. హుండీలోని డబ్బును దేవస్థానం ఇన్స్పెక్టర్, గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో లెక్కించగా రూ.17, 56, 975 వచ్చిందని కార్యనిర్వాహణాధికారి కొండలరావు చెప్పారు. -
యాదాద్రి హుండీ లెక్కింపు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని సంగీతభవనంలో గురువారం 24 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో 71,49,494 రూపాయల నగదు , 62 గ్రాముల బంగారం, 3400 గ్రాముల వెండీ వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ఏఈఓ చంద్రశేఖర్, దోర్భల భాస్కర శర్మ, రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.24.73 లక్షలు
శ్రీకాకుళం : ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. అనివెట్టి మండపంలో జరిగిన ఈ లెక్కింపులో రూ.24,73,292ల ఆదాయం దేవస్థానానికి సమకూరింది. నోట్ల రూపంలో రూ.23,61,904, చిల్లర రూపంలో రూ.01,11,388, వెండి 1.100 కిలోలు, బంగారం 40 గ్రాములు, 9 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్యామలాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, రామతీర్థాల ఈఓ పి.బాబూరావు, ఈవోలు వీఆర్ఆర్బి ప్రసాద్‌పట్నాయిక్, కేవీ రమణమూర్తి, ఎన్వీ రమణమూర్తి, టి.వాసుదేవరావు, వి.గురునాదరావులతో పాటు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది జూలై 5 తేదీన జరిగిన హుండీ లెక్కింపు ద్వారా దేవాలయానికి సుమారు రూ.28 లక్షల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. -
కాసుల వర్షం
అన్నవరం : సత్యదేవుని సన్నిధిలో కాసుల వర్షం కురిసింది. దండిగా ఆదాయం వచ్చింది. ఆగస్టు నెలకు సంబంధించి అన్నవరం దేవస్థానానికి స్వామివారి హుండీల ద్వారా రూ.1,04,38,186 రాబడి సమకూరింది. స్వామివారి హుండీలను మంగళవారం తెరచి లెక్కించారు. హుండీల ద్వారా నగదు రూపంలో రూ.98,98,676, చిల్లర నాణేల రూపంలో రూ.5,39,510 ఆదాయం వచ్చినట్టు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. వీటితోపాటు వంద గ్రాముల బంగారం, 680 గ్రాముల వెండి లభించిందన్నారు. అలాగే మొత్తం 17 దేశాల కరెన్సీ కూడా ఉందని చెప్పారు. అమెరికన్ డాలర్లు 125, యూఏఈ 170, ఖతార్ సెంట్రల్ బ్యాంకు రియాల్స్ 139, సింగపూర్ డాలర్లు 32, మలేషియా డాలర్లు 46, కెనడా డాలర్లు 20, ఇంగ్లండ్ పౌండ్స్ 65 లభించాయని తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ఏసీ జగన్నాథరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట ఆలయ హుండీ లెక్కింపు
కడప కల్చరల్ : ఒంటమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని హుండీని సోమవారం లెక్కించారు. తిరుమల–తిరుపతి దేవస్థానాల అసిస్టెంట్ ఇంజనీరు శంకర్రాజు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల రోజులకుగాను హుండీలో రూ. 3,11,675 సమకూరిందని ఏఈ శంకర్రాజు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
కానుకల హుండీకి సీలువేయటంలో నిర్లక్ష్యం
–శ్రీవారి ఆలయ అధికారులపై మండిపడ్డ టీటీడీ చైర్మన్ – విజిలెన్స్ విచారణకు ఆదేశం సాక్షి, తిరుమల: భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ముడుపులు, కానుకల రూపంలో చెల్లించిన హుండీ భద్రపరిచే విషయంలో తిరుమల ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. కానుకలతో నిండిన హుండీకి ఆలయ నిబంధనల ప్రకారం సీలు వేయకుండా వదిలేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. దీనిపై టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆలయంలో రోజూ రూ.2 నుండి 3.5 కోట్ల వరకు హుండీ (కొప్పెర) కానుకలు లభిస్తున్నాయి. ఇలా ఏటా టీటీడీకి రూ.వెయ్యికోట్ల నగదు, రూ.300 కోట్ల విలువైన బంగారు, వెండి, ఇతర ఆస్తులు లభిస్తున్నాయి. భక్తుల రద్దీ బట్టి ఆలయంలో 7 నుండి 10 హుండీలు కానుకలతో నిండుతుంటాయి. ఇలా కానుకలతో నిండిన హుండీని సోమవారం ఉదయం 10.20 గంటలు తొలగించి, దానిస్థానంలో కొత్త హుండీ ఏర్పాటు చేశారు. తొలగించిన హుండీని ఆలయ నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో ఉన్న సంబంధిత ఆలయ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో హుండీకి తాడుతో గట్టిగా కట్టాలి. అధికారితోపాటు భక్తుల సమక్షంలో లక్కతో ఆలయ అధికారిక సీలు వేయాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు పాటించలేదు. నిర్లక్ష్యంగా కేవలం జనపనార పురిదారంతో హుండీని చుట్టి పక్కన పెట్టేశారు. తర్వాత ఉదయం 11.20 గంటలకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హుండీ వద్దకు వచ్చి కానుకలు సమర్పించారు. సమీపంలోనే నిండిన హుండీ సీలు లేకుండా , కేవలం పురిదారంతో మాత్రమే ఉండటాటాన్ని గుర్తించారు. ఈ ఘటనపై చైర్మన్ సంబంధిత ఆలయ అ«ధికారులపై మండిపడ్డారు. వీఎస్వో రవీంద్రారెడ్డిని అక్కడికి పిలిపించి జరిగిన సంఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. భక్తులు సమర్పించే కానుకల్లోనూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? అంటూ అక్కడి సిబ్బందిని మందలించారు. భక్తులు సమర్పించే కానుకలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. హుండీ కానుకలు భద్రత, లెక్కింపుల్లో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక సూచనలు చేసినప్పటికీ ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించటం గమనార్హం. -
రామాలయ హుండీ ఆదాయం రూ.46.71 లక్షలు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. హుండీల ద్వారా 46,71,553 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు తెలిపారు. 31 గ్రాముల బంగారం, 590 గ్రాముల వెండి వచ్చింది. 713 యూఎస్ఏ డాలర్లు, 108 సౌదీ రియాల్స్, 3 క్వార్టర్, 10 మలేషియా, 5 యూనా, 1 మానట్ , 1 దినా డాలర్లు వచ్చినట్లుగా వివరించారు. 30 రోజులుకు గాను హుండీల ద్వారా ఈ ఆదాయం లభించిందన్నారు. -
ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
చింతలపూడి: చింతలపూడి పా త బస్టాండ్ సెంటర్లోని అభయాంజనేయస్వామి ఆలయం లో గురువారం వేకువజామున దొంగలు పడ్డారు. హుండీ తాళాలు పగులగొట్టి నగదు అపహరించారు. ఆలయ అర్చకులు రాఘవాచారి ఉదయం 4 గంటలకు ఆలయానికి రాగా హుండీ తాళాలు పగులగొట్టి ఉండటంతో ఆలయ కమిటీకి సమాచారం అందించారు. దీనిపై పో లీసులకు ఫిర్యాదు చేశామని కమిటీ అధ్యక్షుడు శేషగిరిరావు చెప్పారు. రెండు నెలలుగా హండీ తెరవలేదని సుమారు రూ.15 వేలకు పైగా నగదు ఉండవచ్చని అన్నారు. ఇటీవల కాలంలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఆలయాల్లో చోరీలు జోరుగా సాగుతున్నాయి. హుండీ తాళాలు పగులగొట్టి సొమ్ములు అపహరిస్తున్నారు. చింతలపూడిలో ముత్యాలమ్మ, జీబీజీ రోడ్డులో ఆంజనేయస్వామి, యర్రగుంటపల్లి ఆంజనేయస్వామి ఆలయాల్లో ఇదే తరహా చోరీలు జరిగాయి. -
ఈరన్న హుండీ ఆదాయం రూ. 38.34 లక్షలు
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణమాసపు ఉత్సవాల సందర్భంగా రెండో సోమవారానికి సంబంధించిన హుండీ ఆదాయం రూ. 38,34,892 వచ్చినట్లు ఈఓ మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. హుండీ లెక్కింపును మంగళవారం కాలక్షేప మంఠపంలో నిర్వహించగా నగదుతో పాటు 49గ్రాముల బంగారం, 12కేజీల 50 మిల్లిగ్రాముల వెండి వచ్చినట్లు ఈఓ చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, పర్యవేక్షకులు మల్లికార్జున, వెంకటేశ్వర్లు, ఆలయ, అర్చక సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది, సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ ముత్తమ్మ, పాలక మండలి డైరెక్టర్లు కొట్రేష్గౌడు, ఎలివె ఈరన్న, ఈరన్న, శంక్రమ్మ, తిక్కన్న తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.73.44 లక్షలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జుర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు మంగళవారం లెక్కించగా రూ.73,44,451 వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. నగదుతో పాటు 107 యూఎస్ఏ డాలర్లు, 50 న్యూజిలాండ్ డాలర్లు, 40 యూకే పౌండ్లు, ఐదు మాల్దీవి విదేశీ కరెన్సీ లభించిందన్నారు. ఈ మొత్తం 15 రోజుల్లో స్వామి అమ్మవార్లకు వచ్చిన ఆదాయమని వెల్లడించారు. -
యాదాద్రి హుండీ లెక్కింపు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని సంగీతభవనంలో సోమవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 39 రోజులకు గాను రూ. 80,29,901 నగదు, 88గ్రాముల బంగారం,1750 గ్రాముల వెండి వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి. నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, అధికారులు దోర్భల భాస్కర శర్మ, రామ్మోహన్రావు, చంద్ర శేఖర్, శ్రవణ్, జూషెట్టి కృష్ణ, గోపాల్ పాల్గొన్నారు. -
జోగుళాంబ ఆలయ హుండీ ఆదాయం రూ.19.73 లక్షలు
అలంపూర్‌రూరల్: అలంపూర్ జోగుళాంబ ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం దేవస్థాన ఈఓ గురురాజ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా ప్రేమ్‌కుమార్ హాజరయ్యారు. గత నాలుగు నెలల హుండీ ఆదాయం మొత్తం రూ.19లక్షల 73,873 లభించిందని, ఇందులో అమ్మవారి ఆలయం ద్వారా రూ.14లక్షల91వేలు, స్వామివారి ద్వారా రూ.4లక్షల82,883 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కొందరు భక్తులు బంగారు ముక్కు పుడక, వెండి వంటి వస్తువులు హుండీలో వేశారని వాటిని జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ సమక్షంలో లెక్కిస్తామని, పుష్కరాల సందర్భంగా సమక్క–సారక్క ఆలయం నుంచి అదనంగా హుండీలను తెప్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ మేనేజర్ కృపాదానం, బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
శ్రీవారి హుండీలో చోరీ
– రూ.50,500 కానుకలు స్వాధీనం – నిందితుడి అరెస్ట్ సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి హుండీలో చోరీకి పాల్పడిన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరుకు చెందిన పి.అర్జున్(30) పట్టుబడ్డాడు. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో ఆలయ హుండీలో కానుకలు వేస్తున్నట్టు నటించాడు. అదే సమయంలో ఇతర భక్తులు వేసిన కానుకల్ని చే త్తో పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను అక్కడి భద్రతా సిబ్బంది సీసీ కెమెరాల్లో గుర్తించారు. వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుండి రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అర్జున్‌తోపాటు నగదును క్రై ం పోలీసులకు అప్పగించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని క్రై ం ఎస్ఐ రామయ్య తెలిపారు. నిందితుడు మూడేళ్ల ముందు హుండీలో చోరీ చేస్తూ పట్టుబడిన పాతనేరస్తుడని తెలిపారు. -
నేడు మల్లన్న హుండీల లెక్కింపు
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉభయదేవాలయాలలోని హుండీలెక్కింపును సోమవారం స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త ఆదివారం తెలిపారు. హుండీ లెక్కింపులో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది అంతా చొక్క, బనియన్లు తీసీవేసి హాజరు కావాలన్నారు. అలాగే నగదు, ఉంగరాలు ధరించకుండా హుండీల లెక్కింపులో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు ప్రారంభమైన తరువాత అత్యవసరంగా ఎవరైనా సిబ్బంది బయటకు వెళ్లినా, లోపలికి వచ్చినప్పుడు వారి రాకపోకల వివరాలను తెలియజేసేందుకు రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, ఎవరైనా అధికార సిబ్బంది హుండీల లెక్కింపులో పాల్గొనని వారిపై క్రమశిక్షణ చర్యలు, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
గూడెం హుండీ లెక్కింపు
దండేపల్లి : మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి ఆషాఢ పౌర్ణమి జాతర సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మొత్తం రూ.2,01,147 ఆదాయం వచ్చింది. అందులో హుండీ ద్వారా రూ.77,750, రశీదులు, ఇతరముల ద్వారా రూ.1,23,397 ఆదాయం వచ్చింది. లెక్కింపును దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు, ఆదిలాబాద్ డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు వెంకటస్వామి, ఈవో పురుషోత్తమచార్యులు, వేదపారాయణదారు నారాయణశర్మ, ఆలయ సిబ్బంది, అర్చకులు, సత్యనారాయణస్వామి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.93 లక్షలు
అన్నవరం: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని దేవస్థానానికి ఏప్రిల్ నెలకు హుండీల ద్వారా రూ.93,01,588 ఆదాయం సమకూరింది. శుక్రవారం హుండీలను లెక్కించగా నగదు రూ.88,61,208, చిల్లర నాణాలు రూ.4,40,380 వచ్చాయని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. నగదుతోపాటు 103 గ్రాముల బంగారం, 445 గ్రాముల వెండి, 298 అమెరికన్ డాలర్లు, 20 యునెటైడ్ అరబ్ దీర్హామ్స్, 36 ఖతార్ రియాల్స్, రెండు సింగపూర్ డాలర్లు, 500 ఒమెన్ బైసాలు, 30 కెనడా డాలర్లు లభించాయని తెలిపారు. నిలువు దోపిడీ సమర్పించిన భక్తురాలు సత్యదేవునికి ఓ భక్తురాలు నిలువు దోపిడీ సమర్పించినట్లు ఈఓ తెలిపారు. గొలుసుతో కూడిన మంగళసూత్రం, నాలుగు గాజులు, రెండు చెవి దిద్దులు, ఒక పాపిడి బిళ్ల, ఒక ముక్కు పుడక, మూడు ఉంగరాలు, చిన్న కాసుల పేరు ఒక పట్టుబట్టలో మూటగట్టి పడవేసినట్లు తెలిపారు. వీటన్నిటి బరువు సుమారు 20 గ్రాములుంటుందన్నారు. హుండీల లెక్కింపులో ఈఓతో పాటు దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు తదితరులున్నారు. -
శ్రీవారి హుండీ...
మీకు తెలుసా? ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ స్వామిని కన్నులారా చూసిన వెంటనే అక్కడే ఉన్న హుండీలో కానుకలను సమర్పించడం పరిపాటి. ఈ హుండీకి ఒక కథ ఉంది. అదేమిటో చూద్దాం... స్వామివారికి శ్రీవారి హుండీ ఆలయంలోని తిరుమామణి మంటపంలో ఉంది. రాగి గంగాళాన్ని శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన వస్త్రం లోపల ఉంచుతారు. ఆ గంగాళాన్ని హుండీ లేదా కొప్పెర అంటారు. ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821, జూలై 25న ఈ హుండీని ఏర్పాటు చేసినట్లు ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్‌కోడ్-12 లో పేర్కొన్నారు. 1958 నవంబర్ 28న, శ్రీవారి ఒక రోజు ఆదాయం మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలు దాటింది. ఇప్పుడైతే రోజువారీ హుండీ ఆదాయం కోటిన్నర దాటుతోంది. కానుకలతో కొప్పెర నిండిన ప్రతిసారీ భక్తుల సమక్షంలో సీలువేసి పారుపత్తేదారు కానుకలు లెక్కించే పరకామణికి చేరవేస్తారు. అక్కడ సీల్ తీసి అందులోని నోట్ల కట్టలు, చిల్లర నాణాలు, బంగారు ఆభరణాలను వేర్వేరుగా లెక్కిస్తారు. లెక్కింపునకు టీటీడీ ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తుంది. తిరుమల తిరుపతిలో పనిచేసే టీటీడీ సిబ్బందికి నెలకో రోజు చొప్పున ఈ విధులు కేటాయిస్తారు. లెక్కింపు ప్రక్రియ మొత్తాన్నీ సీసీ కెమెరాలలో చిత్రీకరిస్తారు. పరకామణిలోకి ప్రవేశించే సిబ్బందిని పంచె, బనియన్లతో మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రోజుకు సుమారు 50 మంది రెండు బృందాలుగా ిషిఫ్టుల పద్ధతిలో పరకామణి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారు. భద్రత తనిఖీల కారణంగా గతంలో మాదిరిగా కట్టలుకట్టలుగా హుండీలో కానుకలు పడటం లేదు. -
పట్టపగలే దొంగల బీభత్సం
అక్కిరెడ్డిపల్లి(విశాఖపట్నం): విశాఖలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. దేవాలయ గుమాస్తాపై దాడి చేసి హుండీని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అక్కిరెడ్డిపల్లిలోని బీహెచ్‌పీవీ సమీపంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన ఆగంతకులు గుమస్తా కాల్లు చేతులు కట్టేసి, ఆయన తలపై గాయపరిచి దేవాలయ హుండీలోని కానుకలు తీసుకెళ్లారు. గుమస్తాకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘాన్సీమియాగూడలో హుండీ చోరీ
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీమియాగూడలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎల్లమ్మ దేవాలయంలో హుండీ చోరీ జరిగింది. గురువారం ఉదయం చోరీ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గాంధీనగర్ సాయిబాబా గుడిలో చోరీ
గాంధీనగర్ : నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో చోరి జరిగింది. లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని సాయిబాబ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు నాలుగు హుండీలను బద్దలు కొట్టి వాటి నుంచి సుమారు రూ.60 వేల నగదు తస్కరించారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలిని పరిశీలించిని పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. -
మద్దిలేటిస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
కర్నూలు: కర్నూలు జిల్లా బేతంచర్ల మండల పరిధిలోని శ్రీ మద్దిలేటి స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తయింది. శుక్రవారం జరిగిన ఈ లెక్కింపులో హుండీ ఆదాయం 21 లక్షలుగా తేలింది. గత సంవత్సరం నవంబర్ 15 నుంచి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన దానాలతో పాటు, జనవరిలో జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఆదాయం కూడా ఇందులో ఉంది. (బేతంచర్ల) -
నాచగిరిలో దొంగల హల్చల్
వర్గల్ : చోరులు బరి తెగించారు. మండల పరిధిలోని నాచగిరి పుణ్యక్షేత్రం ఆలయ ద్వారాల తాళాలు బద్దలుకొట్టి లోనికి చొరబడి హుండీలు, బీరువాలను కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం రాత్రి రోజు మాదిరిగానే నాచగిరి ఆలయ అర్చక, పురోహితులు పూ జా కార్యక్రమాలు ముగించి గుడి మూసేశారు. అదే రోజు రాత్రి ఆలయం వద్ద పహారా కాసేందుకు ముగ్గురు నైట్ వాచ్మెన్లు విధుల్లో చేరారు. సోమవారం రాత్రి అనూహ్యంగా సాయిబాబా ఆలయం వద్ద ఇనుప గేటు గొలుసు విరగ్గొట్టారు. అందులోనుంచి ఆలయ ఆవరణలోకి ప్రవేశించారు. మెట్ల దిగువున ఉన్న నవగ్రహాలయ హుండీ బద్దలు కొట్టారు. లోపలి వైపు తాళం లేకపోవడంతో హుండీ తెరుచుకున్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న శివాలయం హుండీ తాళం, రామాలయం హుండీ పగులకొట్టేందుకు ప్రయత్నించారు. లడ్డూల కోటా గది తాళం బద ్ధలు కొట్టి లోపలి బీరువా తెరచి సొమ్ము కోసం వెతుకులాడారు. ఆ తరువాత ప్రధాన ఆలయంలోకి వెళ్లేందుకు ప్రత్యేక దర్శనం గేటు తాళం పగులగొట్టారు. ఆలయ మండపంలోని ఆండాళమ్మ కోవెల గదిని తెరి చేందుకు ప్రయత్నించారు. అది సాధ్యపడలేదు. అయితే శివాలయం వద్ద, ప్ర దాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఓ పక్కకు తిప్పేశారు. ఇంత జరుగుతున్నా.. పహారా కాసే కాపలాదారులకు వినిపించకపోవడం గమనార్హం. కాగా మంగళవారం ఉదయం అర్చకులు ఆలయం తెరిచేందుకు వచ్చి చూసే వరకు విషయం వెలుగులోకి రాలేదు. అర్చకుల ద్వారా సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ హేమంత్ కుమార్, సంగారెడ్డి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శివరాజ్ మంగళవారం ఉదయం ఆలయం చేరుకుని చోరీ తీరు పరిశీలించారు. తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తూప్రాన్ ఎస్ఐ సంతోష్‌కుమార్ ఆలయం సందర్శించారు. సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు వాచ్మెన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. -
భిక్షాటన చేసి రాజధాని నిర్మిస్తారా?
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుండీ పెట్టడం సరికాదని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. భిక్షాటన చేసి రాజధాని నిర్మిస్తామనడం అవమానకరమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి విరాళాల కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ వద్ద, సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో హుండీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.